
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు): మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి సంచయితను కోర్టు తప్పించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆమె కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
సంచయితకు మహిళా కమిషన్ బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గడిచిన రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధిని సీఎం కోరుకుంటే.. టీడీపీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment