సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయ అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్రం బుధవారం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
కలిసి అభివృద్ది చేద్దాం..
కేంద్రం నిర్ణయంపై సంచయిత గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు 'ప్రసాద్' పథకంలో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రదాని మోదీ, కేంద్ర పర్యాటక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ఆలయాల్లో సింహాచలం దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానాన్ని కలిసి అభివృద్ది చేద్దాం.." అంటూ కేంద్రమంత్రికి రీట్వీట్ చేశారు. కాగా దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం "ప్రసాద్" పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. ('ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం')
చదవండి: 2024 నాటికల్లా విశాఖ మెట్రో..
Comments
Please login to add a commentAdd a comment