Simhachalam appanna temple
-
అంగరంగ వైభవంగా సింహాచలం గిరి ప్రదక్షిణ
-
Simhachalam Temple: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
సింహగిరికి మరో ఘాట్ రోడ్
దొండపర్తి : సింహాచలం భక్తులకు శుభవార్త. కొండపైకి మరో ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండు ఘాట్లు అందుబాటులో ఉండగా మరో ఘాట్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు పూర్తిచేశారు. సింహాచలం దేవస్థానం పై నుంచి కిందకు దిగేందుకు వీలుగా మరో ఘాట్ రోడ్డును నిర్మించేందుకు యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. పర్వదినాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఘాట్ రోడ్డు వేసేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే తొలి పావంచ నుంచి కొండపైకి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు వాటి సాధ్యాసాధ్యాలపై వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోబోయే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్అండ్బీ, పోలీస్, దేవస్థానం, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొని వారి సలహాలు, సూచనలు అందజేశారు. భవిష్యత్తు అవసరాలను, ప్రధానంగా గిరి ప్రదక్షిణ, చందనోత్సవం వంటి పర్వదినాల్లో భక్తులు, వాహనాల రాకపోకలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి దేవస్థానం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాల్లో అనుకూలమైన మార్గాన్ని చూపేందుకు, అధ్యయనం చేసేందుకు దేవస్థానం, పోలీసు, ఇంజనీరింగ్, ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమిటీ అధ్యయనం తర్వాత అనుకూలమైన మార్గంలో రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు రహదారిని ఏర్పాటు చేయటంతో పాటు సింహాచలం దేవస్థానంపై మౌలిక వసతులను కూడా కల్పించాలని చెప్పారు. 25 నుంచి 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించబోయే రహదారికి ఆనుకొని కొండపై 5 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు కొండపై బస చేసేందుకు అనువుగా అదనపు వసతి గృహాలు నిర్మించాలని, కాటేజీలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో దేవస్థానం అవసరాలను తీర్చేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. సుప్రభాత సేవ, ఆరాధన సమయంలో భక్తులు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సత్రాలను నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి, ఈఈ శ్రీనివాస రాజు, డీసీపీ ఆనంద్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇలా.. దేవస్థానం నుంచి కిందకు దిగేందుకు రెండు ప్రత్యామ్నాయాలను చూపుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొండపై ఉన్న టీవీ టవర్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో పాత గోశాల వైపు దిగేలా 6 కిలోమీటర్ల మేర ఒక రోడ్డును ప్రతిపాదించారు. కొండ పై భాగంలోని ఎత్తు రోడ్డు నుంచి 4.5 కిలోమీటర్ల మేర బీఆర్టీఎస్ రహదారిలో దిగేలా కృష్ణాపురం గోశాల(సూర్యనారాయణ దేవాలయం) వైపు మరో రహదారిని దేవస్థానం అధికారులు సూచించారు. తొలిపావంచ నుంచి ప్రస్తుతం ఉన్న రహదారిని దశావతారం జంక్షన్ నుంచి పైవరకు 2.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదన చేశారు. -
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
సింహాచలం చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో పోటెత్తిన భక్తులు
-
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
సింహాచలంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం
-
సింహాచల లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
సింహ‘గిరి’.. ఆధ్మాత్మిక సిరి.. తన్మయులై సాగిన అశేష జనవాహిని (ఫొటోలు)
-
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాత్ కుటుంబం
-
కాణిపాకం, అప్పన్న ఆలయాలకు ఐఎస్వో సర్టిఫికెట్లు
కాణిపాకం (యాదమరి)/సింహాచలం(పెందుర్తి): చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి, విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాలకు ఐఎస్వో సంస్థ సర్టిఫికెట్లను అందజేసింది. శుక్రవారం వినాయక చవితి రోజు ఐఎస్వో సంస్థ ప్రతినిధి శివయ్య కాణిపాకం ఆలయానికి చేరుకుని సంస్థ నుంచి ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు ఒకటి, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌కు మరో సర్టిఫికెట్ అందజేశారు. ఆయనకు ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఐఎస్వో సంస్థ ప్రతినిధి సర్టిఫికెట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, తదితరులు ఉన్నారు. మరోవైపు అప్పన్న దేవస్థానానికి ఐఎస్వో 9001–2015 గుర్తింపు లభించింది. సింహగిరికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు, హిందూ ధర్మం, సంస్కృతిని ప్రచారం చేస్తున్నందుకు దేవస్థానానికి ఈ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సింహాచలం దేవస్థానానికి ఈ గుర్తింపునిచ్చింది. ఆ సంస్థ జారీ చేసిన ఐఎస్వో ధ్రువీకరణ పత్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతులమీదుగా దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ అందుకున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా దేవస్థానం అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే పంచగ్రామాల భూసమస్య పరిష్కారమవుతుందన్నారు. -
కాలేజీ పేరుతో కాజేశారు
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్ భూములను అమ్మేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్ కాలేజీ పేరుతో మాన్సాస్ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..? భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు. రోడ్లు వేయాలంటూ.. కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు. 10.98 ఎకరాలు ఉచితంగా... ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ.. మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు. సింగిల్ బిడ్ టెండర్లతోనే అమ్మకం.. కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. -
సింహాచలం భూముల అక్రమాలపై నేడు నివేదిక
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం భూముల అన్యాక్రాంతం, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి జరిగిన భూముల అక్రమాలపై విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అధికారులు శుక్రవారం నివేదికను సమర్పించనున్నారు. ఈ వ్యవహారంపై దేవదాయశాఖ అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, ప్రాంతీయ కమిషనర్ భ్రమరాంబ, ఉప కమిషనర్ పుష్పవర్దన్‌ల కమిటీ విచారణ చేపట్టి సింహాచలం, విజయనగరం ప్రాంతాల్లో పర్యటించింది. పంచగ్రామాలను సందర్శించి.. అక్కడ ప్రజల నుంచి వివరాలు సేకరించింది. విశాఖ దేవదాయ శాఖ ఉపకమిషనర్ కార్యాలయంలో సింహాచలం దేవస్థానం రికార్డులు, ఆస్తుల జాబితా ప్రాపర్టీ రిజిస్టర్లను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించింది. దీన్ని రాష్ట్ర దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావుకు శుక్రవారం సమర్పించనుంది. -
జలహారతులిచ్చిన స్వామి స్వరూపానందేంద్ర
విశాఖ: సింహాచలం పూల తోటలో శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జలధారలకు హారతులిచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. సింహగిరిపై ఎనిమిదేళ్లుగా జలధారలు శిథిలమయ్యాయని, ఇనేళ్ల తరువాత జలహారతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సింహగిరిపై మొక్కలు నాటడం శుభపరిణామమని స్వామి పేర్కొన్నారు. అప్పన్న జలధారల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపలేదని, సింహాచలం ట్రస్ట్‌బోర్డు ప్రత్యేక చొరవతో జలహారతి కార్యక్రమం పునఃప్రారంభానికి నోచుకుందని స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చొరువను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని స్వామి ఆరోపించారు. అనతికాలంలోనే జలధారలను పునరుద్ధరించిన ట్రస్ట్ బోర్డును స్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జలధారల పునరుద్ధరన విషయంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మిగతా దేవాలయాల ట్రస్ట్ బోర్డులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్వరూపానందేంద్ర స్వామి స్పందిస్తూ.. స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు దేవుడితో చలగాటం ఆడటం ఏమాత్రం మంచిది కాదని, దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల నియంత్రణపై ప్రభుత్వ చిత్తశుద్దిని స్వామి ప్రశంశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ త్వరగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సంచయితపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: చారిత్రాత్మక దేవాలయమైన సింహాచలం అప్పన్న ఆలయ అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజుపై కేంద్రం బుధవారం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాలయ అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కలిసి అభివృద్ది చేద్దాం.. కేంద్రం నిర్ణయంపై సంచయిత గజపతి రాజు సంతోషం వ్యక్తం చేశారు 'ప్రసాద్' పథకంలో సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసినందుకు ప్రదాని మోదీ, కేంద్ర పర్యాటక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. "ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ఆలయాల్లో సింహాచలం దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానాన్ని కలిసి అభివృద్ది చేద్దాం.." అంటూ కేంద్రమంత్రికి రీట్వీట్ చేశారు. కాగా దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం "ప్రసాద్" పథకాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఇప్పటికే ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. ('ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం') చదవండి: 2024 నాటికల్లా విశాఖ మెట్రో.. -
అలాంటి మాటలను పట్టించుకోను
సాక్షి, సింహాచలం(పెందుర్తి): మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతిరాజు పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. అడవివరానికి చెందిన పలువురు మహిళలు, సింహాచలం దేవస్థానంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న మహిళలు, భక్తులతో కలసి సంచయిత గజపతిరాజు వేడుకలు జరుపుకున్నారు. తొలుత కొండదిగువ మహిళా వ్యాపారులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండ దిగువ తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బీపీ, సుగర్ తదితర పరీక్షలను చేయించుకున్నారు. దర్శనం క్యూలో వెళ్తున్న సంచయిత గజపతిరాజు మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి.. మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దని సూచించారు. దేవస్థానం తరఫున నెలకొకసారైనా వైద్య శిబిరాలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామన్నారు. అక్కడి నుంచి ఆమె తొలిపావంచా వద్ద స్వామికి కొబ్బరికాయ కొట్టి మెట్లమార్గంలో నడిచి వెళ్లి సింహగిరికి చేరుకున్నారు. నృసింహ మండపంలో దేవస్థానం మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఆమెకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సాధారణ భక్తుల క్యూలో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. క్యూల్లో వేచి ఉన్న భక్తులను పలకరించారు. తర్వాత స్థానిక వీఐపీ కాటేజీ ప్రాంగణంలో మహిళలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. (నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్!) వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సంచయిత సంప్రదాయాలను గౌరవించడమే కాదు ఫాలో అవుతా.. మహిళగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి మాటలను పట్టించుకోనన్నారు. తనకు హిందూ ఇజం అంటే చాలా ఇష్టమన్నారు. అనాదికాలం నుంచి పంచ భూతాలనన్నింటినీ పూజించే సంప్రదాయం మనదన్నారు. ఈరోజు ఓ హిందువుగా తనకు దేవస్థానం చైర్పర్సన్ అవకాశం వచ్చిందన్నారు. సంప్రదాయాలను గౌరవిస్తానని, ఆలయాల్లో ఏ సంప్రదాయం ఉందో.. దానినే అనుసరిస్తానని స్పష్టం చేశారు. దేవస్థానాన్ని మంచిగా అభివృద్ధి చేస్తున్నామా.. భక్తుల సమస్యలు పరిష్కరిస్తున్నామా.. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పిస్తున్నామా.. తదితర అంశాలపై తన దృష్టి ఉందన్నారు. అభివృద్ధి అనేది సమష్టి కృషి అని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం మహిళా ఉద్యోగులు, సిబ్బందికి చీరలు అందజేశారు. ఈ సమావేశంలో దేవస్థానం ఈవో ఎం. వెంకటేశ్వరరావు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ట్రస్ట్ బోర్డు సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకుమారి పాల్గొన్నారు. (బాబాయ్ ఇలా మాట్లాడతారా?: సంచయిత భావోద్వేగం) -
మహిళకు పదవి ఇస్తే ఓర్వలేకపోతున్నారు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మహిళల పట్ల అభిమానంతో సీఎం జగన్ అన్నింటిలో వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గురువారం సింహాచలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సిరిపురపు ఆశా కుమారి, వారణాసి దినేష్, రొంగలి పోతన్న, సూరిశెట్టి సూరిబాబు, కృష్ణారెడ్డి, చంద్రకళ, రాగాల నరసింహనాయుడు, దాడి దేవి, గరుడా మాధవి, పద్మ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. (మాన్సాస్‌లో పెనుమార్పు..!) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు మహిళలకు పదవులు ఇస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు అంటే తమకు గౌరవం ఉందని.. అతని కుటుంబానికి చెందిన మహిళను చైర్మన్‌గా నియమించడం సంతోషకరమన్నారు. అనంతరం సింహాచలం ఆలయ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుడిలోని దేవునితోపాటు ప్రజాసేవే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్న అప్పలనాయుడు, ఆలయ ఈవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో స్వరూపానందేంద్ర సరస్వతి
-
అప్పన్న సన్నిధిలో స్వరూపానందేంద్ర సరస్వతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. సింహాద్రి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వెంకటేశ్వరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అప్పన స్వామి 32 బీజ మంత్రాలు పురస్కరించుకుని 32 రోజుల అప్పన్న దీక్షను స్వరూపానందేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యద్భుతమై దేవాలయం అప్పన్నస్వామి ఆలయమని తెలిపారు. సింహాద్రి అప్పన్న గిరిజనులకు, చెంచు కులాల వారికి ఆరాధ్య దైవంగా త్రేతా యుగం నుంచి పూజలు అందుకున్నారని పేర్కొన్నారు. నారాసింహ క్షేత్రాల్లో అత్యధికంగా ఇష్టపడే దేవాలయం సింహాద్రి అప్పన ఆలయం అని పేర్కొన్నారు. -
సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్
సాక్షి, విశాఖపట్నం : సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ దంపతులు అనంతరం స్వామివారి నిత్య అన్నదాన పథకం కోసం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. తమ్మినేని మాట్లాడుతూ... సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం జగన్ నేతృత్వంలో స్పీకర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. అన్యాక్రాంతమైన దేవుడు భూములను పరిరక్షిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాదిలోగా ఇళ్ల స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ్మినేని ఆరోపించారు. -
అంగరంగ వైభవంగా మెట్ల దినోత్సవం
-
అప్పన్న టిక్కెట్ కౌంటర్లోరూ.56వేలు మాయం
సింహాచలం(పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని టిక్కెట్ కౌంటర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. నాలుగు రోజుల కిందట ఆ వ్యక్తి రూ.56వేలు తస్కరించాడు. ఇంత జరిగినా దేవస్థానం అధికారులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా చర్చానీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే... దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో ఒక ఇంజినీర్కి అసిస్టెంట్‌గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కేంద్రాలు, కార్యాలయంలోని కంప్యూటర్లు ఏమైనా మొరాయిస్తే సరిచేయడం ఆ ఉద్యోగి విధుల్లో భాగం. అలా అతను సింహగిరిపై టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లకు తరచూ వెళ్తుంటాడు. కౌంటర్లలో కూర్చుంటూ టిక్కెట్లు కూడా జారీ చేస్తున్నాడు. నాలుగు రోజుల కిందట సింహగిరిపై ఆంధ్రాబ్యాంకు అవుట్ సోర్సింగ్ సిబ్బంది జారీ చేసే 100 రూపాయల టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లో అప్పటి వరకు పనిచేసే ఉద్యోగి ఆలయంలోకి వెళ్లడంతో కొంతసేపు కూర్చుని టిక్కెట్లు జారీ చేశాడు. తొలి షిప్టు అవ్వగానే రెండో షిప్టులో కౌంటర్లో పనిచేయడానికి వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నగదు లెక్క చూసుకోగా సుమారు రూ.56వేలు తేడా వచ్చింది. దీంతో విషయం బయటపడింది. ఈ విషయంపై సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారించగా ఆ తర్వాత రూ.52వేలు తిరిగి కట్టేశాడు. బ్యాంకు అధికారులు, దేవస్థానం అధికారుల దృష్టికి వెళ్లినా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ విషయం బయటపడటంతో తీవ్ర చర్చాంశనీయమైంది. ఆంధ్రాబ్యాంకు కౌంటర్లో జరిగిన సంఘటన తమకు సంబంధం ఉండదని, బ్యాంకు అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని ఆలయ ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ వివరణ ఇచ్చారు. బ్యాంకు అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో కూడా సదరు వ్యక్తి దేవస్థానం టిక్కెట్లు జారీ చేసే కౌంటర్లోనే రూ.25వేలు వాడుకున్నట్టు కూడా గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సదరు వ్యక్తిని విధులకు హాజరు కావొద్దని దేవస్థానం ఈవో బుధవారం చెప్పినట్టు తెలుస్తోంది. అంతా అవుట్సోర్సింగ్ మాయాజాలం అప్పన్న దేవస్థానంలో అంతా అవుట్సోర్సింగ్ మాయాజాలంగా మారింది. దేవస్థానంలో పనిచేస్తున్న కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తాము ఆడిందే ఆటగా పేట్రేగిపోతున్నట్టు ఇటీవల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం కూడా వారిని చూసీ చూడనట్టు వదిలేస్తోంది. కీలకమైన నగదు లావాదేవీలు జరిగే కౌంటర్లలో వారిని నియమిస్తుండటం కూడా అవకతవకలకు ఆస్కారమిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో వచ్చిన వారే కావడంతోనే దేవస్థానం అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు దేవస్థానంలో పనిచేసే పలువురు ఉద్యోగుల మద్దతు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉండటంతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు వెల్లడవుతోంది. ఇటీవల ప్రసాద విక్రయశాలలో చోటుచేసున్న లడ్డూల అవినీతి వెలుగుచూసి వారం రోజులు గడవకముందే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అవినీతి బయటపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అల్లు అర్జున్, బోయపాటి
విశాఖ: దైవ దర్శనానికి వెళ్లిన సినీ హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సింహాచలం వరాహ నరసింహస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన వీరికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. దర్శన అనంతరం అల్లు అర్జున్, బోయపాటి లిఫ్ట్ ఎక్కగా, సాంకేతిక లోపంతో సగంలో నిలిచిపోయింది. వీరితో పాటు అభిమానులు కూడా పరిమితికి మించి ఎక్కేయడంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో ఆలయ అధికారులు లిఫ్ట్ డోరు పగులగొట్టి వారిని బయటకు తీశారు. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది కల్పించుకుని అభిమానులను నిలువరించారు. కాగా బన్నీ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో వారు అప్పన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.