సాక్షి, విశాఖపట్నం: సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మహిళల పట్ల అభిమానంతో సీఎం జగన్ అన్నింటిలో వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గురువారం సింహాచలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సిరిపురపు ఆశా కుమారి, వారణాసి దినేష్, రొంగలి పోతన్న, సూరిశెట్టి సూరిబాబు, కృష్ణారెడ్డి, చంద్రకళ, రాగాల నరసింహనాయుడు, దాడి దేవి, గరుడా మాధవి, పద్మ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. (మాన్సాస్‌లో పెనుమార్పు..!)
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు మహిళలకు పదవులు ఇస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు అంటే తమకు గౌరవం ఉందని.. అతని కుటుంబానికి చెందిన మహిళను చైర్మన్‌గా నియమించడం సంతోషకరమన్నారు. అనంతరం సింహాచలం ఆలయ చైర్‌పర్సన్ సంచయిత గజపతి రాజు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుడిలోని దేవునితోపాటు ప్రజాసేవే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ రూరల్ అధ్యక్షులు సరగడం చిన్న అప్పలనాయుడు, ఆలయ ఈవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment