
సాక్షి, విశాఖపట్నం: దివంగత ఆనంద గజపతిరాజు 70వ జన్మదినం సందర్భంగా శుక్రవారం రోజున మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి జన్మదినం సందర్భంగా ఆనందవనం పేరుతో సింహాచలంలో మాన్సాస్ ట్రస్ట్ అధ్వర్యంలో 700 మొక్కలు చొప్పున నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. (చంద్రబాబుకు సంచయిత గట్టి కౌంటర్!)
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఈ రోజు నా తండ్రి జన్మదినం సందర్భంగా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ప్రజలకి సేవచేయడమే నా లక్ష్యం. నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను' అని పేర్కొన్నారు. అనంతరం దేవస్థానంలోని గోశాలను సందర్శించిన సంచయిత గోవుల రక్షణకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా కొనసాగించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. (సంచయితపై బాబు, అశోక్ రాజకీయ కుట్ర)
Comments
Please login to add a commentAdd a comment