‘స్వామి వారిని దర్శించుకోవడం అనుభూతి కలిగించింది’ | Governor Biswabhushan Harichandan Visakha Tour | Sakshi
Sakshi News home page

‘స్వామి వారిని దర్శించుకోవడం అనుభూతి కలిగించింది’

Published Mon, Mar 28 2022 12:05 PM | Last Updated on Mon, Mar 28 2022 1:09 PM

Governor Biswabhushan Harichandan Visakha Tour - Sakshi

విశాఖ: ప్రత్యేక విమానంలో గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ విశాఖ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. సోమవారం ఉదయం  విజయవాడ నుంచి విశాఖ పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం లభించింది.ఎయిర్‌పోర్ట్‌ నుంచి కాన్వాయ్‌లో నేరుగా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయానికి గవర్నర్‌ దంపతులు చేరుకున్నారు.

ఈ మేరకు మాట్లాడిన ఆయన..సింహాచల  శ్రీ వరాహ  లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాలా అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్యపై చర్చించి , తన వంతు కృషి చేస్తానని గవర్నర్‌ తెలిపారు. అంతకుముందు సింహగిరికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ఉన్న కప్ప స్తంభం ఆలింగనం చేసుకొని , అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement