అప్పన్న సన్నిధిలో రామ | ramcharan visits to simhachalam appanna swamy temple | Sakshi
Sakshi News home page

అప్పన్న సన్నిధిలో రామ

Published Mon, Oct 15 2018 12:32 AM | Last Updated on Mon, Oct 15 2018 12:32 AM

ramcharan visits to simhachalam appanna swamy temple - Sakshi

రామ్‌చరణ్‌

అజర్‌బైజాన్, హైదరాబాద్‌ చుట్టొచ్చాక వైజాగ్‌ వెళ్లారు రామ్‌చరణ్‌. సినిమా ఫ్యామిలీతో కలసి సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరక్కెకిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయిక. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వైజాగ్‌లోని సింహాచలం గుడిలో జరుగుతోంది. రామ్‌చరణ్, ఆర్యన్‌ రాజేశ్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.

ఈ షెడ్యూల్‌లో ఎక్కువ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ ఉంటాయని సమాచారం. రామ్‌ చరణ్‌కు అన్నయ్యలుగా ‘జీన్స్‌’ ఫేమ్‌ ప్రశాంత్, ఆర్యన్‌ రాజేశ్‌ కనిపించనున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా కనిపించనున్నారు. దసరాకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ చేయనున్నారని టాక్‌. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement