ఫుల్‌ క్లారిటీ | Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

ఫుల్‌ క్లారిటీ

Published Sat, Oct 27 2018 2:31 AM | Last Updated on Sat, Oct 27 2018 2:31 AM

Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama - Sakshi

టైటిల్‌ ఖరారైందా? ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడు? సినిమా షూటింగ్‌ ఎంతవరకూ వచ్చింది? రామ్‌చరణ్‌ కొత్త చిత్రానికి సంబంధించి ఆయన అభిమానుల్లో ఉన్న ప్రశ్నలు ఇవి. ఆ సందేహాలకు ఇప్పుడు ఫుల్‌ క్లారిటీతో సమాధానం ఇవ్వబోతున్నాం. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అదే టైటిల్‌ ఫిక్స్‌ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

దీపావళి స్పెషల్‌గా టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయబోతున్నారట.ప్రస్తుతానికి 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరోవైపు  కెమెరామేన్‌ రిషీ పంజాబీ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో చిత్రబృందంలో మనస్పర్థలు వచ్చాయి అని పలు పుకార్లు బయటకు వస్తున్నాయి. ఈ విషయం గురించి చిత్రబృందం మాట్లాడుతూ– ‘‘ఆల్రెడీ ముందుగా అంగీకరించిన సినిమా ఉండటంతో రిషీ ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతే కానీ ఎటువంటి మనస్పర్థలు లేవు. మిగిలిన భాగాన్ని కెమెరామేన్‌ ఆర్థర్‌ విల్సన్‌ పూర్తి చేస్తారు’’ అని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement