రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్టుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘మింట్’ కథనం ప్రకారం.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లలో నిర్ధిష్ట-కాల పరిమితి నియామకాల వ్యవస్థకు ముగింపు పలికారు. అంటే ట్రస్టీలు శాశ్వత సభ్యులుగా మారుతారు.
గురువారం జరిగిన రెండు ట్రస్టుల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా నివేదిక పేర్కొంది. ఈ మార్పు తర్వాత ఇకపై బోర్డు సభ్యులు తామంతట తాము రాజీనామా చేసేంత వరకు కొనసాగుతారు. అదే సమయంలో కొత్త సభ్యుల నియామకానికి ఇకపై బోర్డు ఏకగ్రీవ సమ్మతి కావాల్సి ఉంటుంది. అక్టోబర్ 11న టాటా ట్రస్ట్‌లకు అధిపతిగా నోయెల్ టాటా నియమితులైన తర్వాత ట్రస్టులు నిర్వహించిన రెండో బోర్డు సమావేశం ఇది.
ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?
రెండు ట్రస్టులు సమిష్టిగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో సగానికి పైగా వాటాలను కలిగి ఉన్నాయి. టాటా గ్రూప్ తరఫున అన్ని దాతృత్వ కార్యకలాపాలను ఈ రెండు ట్రస్టుల ద్వారానే నిర్వహిస్తున్నారు. నివేదిక ప్రకారం.. టాటా సన్స్‌లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు 27.98 శాతం, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 23.56 శాతం వాటాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment