సాక్షి, విజయవాడ: వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నామని.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. ‘‘జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది.
వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు!
జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం
వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు
ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు— YSR Congress Party (@YSRCParty) June 24, 2024
కాగా, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవ కంటే కక్షసాధింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీసింది చంద్రబాబు సర్కార్.
వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment