సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ సారాంశాన్ని మంత్రులు తలసాని, గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాకు వివరించారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ప్రధానంగా ఇచ్చిన హామీకి కట్టుబడి 111 జీవో రద్దుతో పాటు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
👉 సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహణ. రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. 21 రోజుల పాటు విజయోత్సవాలు. రోజుకో రంగంలో ఉత్సవాలు.
👉 కుల వృత్తులను ఆర్దికంగా ఆదుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక్కో కులానికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం. మంత్రి గంగుల నేతృత్వంలో ఈ కమిటీ.
👉 111 జీవో ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం. 84 గ్రామాలకు మేలు చేసే నిర్ణయం ఇది. HMDA భూముల వలే, ఈ గ్రామాలకు కూడా అవే రూల్స్ ఉంటాయి.
👉 గోదావరి, కృష్ణ, మంజీర నది నుంచి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కు వస్తుంది. కాబట్టి ఉస్మాన్, గండి పేట్ చెరువులకు రింగ్ మెయిన్ చేయాలని కేబినెట్ నిర్ణయం
👉 హుసేన్ సాగర్‌ను గోదావరి నదితో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం.
👉 కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట అనుసంధానానికి కేబినెట్ ఆమోదం.
👉 హైదరాబాద్ జోన్ లో 6 జోన్లకు డీఎం అండ్ హెచ్‌వోలు, రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది డీఎం అండ్ హెచ్‌వోలను నియమించాలి.
👉 అర్బన్ హెల్త్ సెంటర్ లో పర్మినెంట్ ఉద్యోగుల నియామకం
👉 40 మండలాల్లో కొత్త PHC మంజూరు చేయాలని నిర్ణయం
👉 రైతుల సంక్షేమం కోసం మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ
👉 నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడుతం. రాష్ట్ర పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తారు. పీడీ యాక్ట్ పెట్టి అరెస్టులు ఉంటాయి.
👉 అలాగే.. మక్కలు, జొన్నలు కొనడానికి వ్యవసాయ, సివిల్ సప్లై శాఖకు కేబినెట్ అనుమతి
👉 వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టంతో.. పంట కాలం నెల ముందుకి జరపాలని ప్రణాళిక. ఈ ప్రణాళిక విధివిధానాలపై సబ్ కేబినెట్ దీనికి నివేదిక ఇస్తుంది.
👉 వీఆర్ఎ లకు శుభవార్త. వాళ్లను పర్మినెంట్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు
👉 TSPSC లో 10 పోస్టుల మంజూరు.
👉 వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి 10 గుంటల భూమి
👉 ఖమ్మం లో జర్నలిస్టుల సంక్షేమానికి భవనం. జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు
👉 జైన్ కమ్యూనిటీని మైనార్టీ కమిషన్ లో చేరుస్తూ నిర్ణయం. కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం.
👉 అచ్చం పేట ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 1, ఫేస్ 2 మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయంరెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment