
సాక్షి, విజయవాడ: ప్రాణం ఉన్నంతవరకు సీఎం జగనన్నతోనే ఉంటానని, ఆయన కోసమే పనిచేస్తానని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. నూతన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు ఎప్పటికి మర్చిపోలేను. నన్ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారు. కానీ జగనన్న నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశం ఇచ్చారు.
మహిళా పక్షపాత సీఎం క్యాబినెట్‌లో మహిళ మంత్రిగా చోటు దక్కడం నా అదృష్టం. సీఎం జగనన్న చెప్పిన పని చెయ్యడమే నా విధి. నన్ను ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు జగనన్న మంత్రిగా చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తాను. మంత్రి అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నాను. టీవీ, సినిమా షూటింగ్‌లలో ఇక చెయ్యను' అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రకటించారు.
చదవండి: (RK Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. ఆమెకు సరిలేరు)
Comments
Please login to add a commentAdd a comment