జీఎస్‌టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్‌టీ కౌన్సిల్‌కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.
కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్‌టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!
Comments
Please login to add a commentAdd a comment