దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి.
ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్‌ఫార్మా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎల్‌టిఐఎండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ నష్టపోయాయి.
జీఎస్‌టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్
మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్‌టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్‌కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం.
అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment