నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల
న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడలేదని భారతీయ కంపెనీలు పేర్కొన్నాయి. తమ ఫ్యాక్టరీ భవనానికి కొద్దిగా బీటలు వచ్చాయి తప్ప.. ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ వెల్లడించింది. భూకంపం తర్వాత తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోకకోలా ఇండియా తెలిపింది. ఐటీసీ వర్గాలు కూడా తమ ప్లాంట్లకు ఎలాంటి నష్టంవాటిల్లలేదని తెలిపాయి.