అమెజాన్ భారీ డిస్కౌంట్లు వాటిపైనే!
అమెజాన్ భారీ డిస్కౌంట్లు వాటిపైనే!
Published Wed, Sep 20 2017 12:18 PM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్ కంపెనీ బిగ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సారి ఫుడ్, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లకు అమెజాన్ తెరతీసింది. ఈ-కామర్స్ గ్రోసరీ స్పేస్‌లో భారీ ఎత్తున్న పోటీ నెలకొనడంతో ఫుడ్, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆహారోత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతి కల్పించిన సంగతి తెలిసిందే. అమెజాన్ నేటి నుంచి ప్రారంభించిన గ్రేట్ ఇండియన్ సేల్‌లో 40 శాతం డిస్కౌంట్లను ఆహారోత్పత్తులపై ఆఫర్ చేస్తుంది.
అంతేకాక మేకప్, బ్యూటీ ఉత్పత్తులపై 35 శాతం వరకు, బేబీ కేర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు, లాండ్రీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్లకు అమెజాన్ తెరతీసింది. కస్టమర్లను గెలుచుకోవడం కోసం ఈ పండుగ సీజన్‌లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులపై ప్రమోషన్లను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రేట్ బ్రాండులపై గ్రేట్ డీల్స్‌ను తమ కస్టమర్లకు అందించడానికి విక్రయదారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గ్రోసరీ, పర్సనల్ కేర్, బేబీ ఉత్పత్తులపై కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement