
‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్ ట్రా’ విక్రయాలు బంద్
న్యూఢిల్లీ: దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందటానికి తరుచూ ఉపయోగించే ‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా’ ఇక మెడికల్ షాపుల నుంచి కనుమరుగు కానున్నది. ఎఫ్‌ఎంసీజీ సంస్థ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) తన ప్రముఖ బ్రాండ్ ‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్‌ట్రా’ తయారీ, అమ్మకాలను తక్షణం నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 344 ఫిక్డ్స్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌పై నిషేధించిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.