హెచ్‌యూఎల్‌ లాభం 9 శాతం అప్‌ | Story image for FMCG, HUL, Quarter from Livemint Markets await HUL results to gauge GST impact on FMCG sector | Sakshi
Sakshi News home page

హెచ్‌యూఎల్‌ లాభం 9 శాతం అప్‌

Published Wed, Jul 19 2017 12:45 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

హెచ్‌యూఎల్‌ లాభం 9 శాతం అప్‌ - Sakshi

హెచ్‌యూఎల్‌ లాభం 9 శాతం అప్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనీలీవర్‌ (హెచ్‌యూఎల్‌) నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 9.28 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 1,174 కోట్లు.

తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 4.98 శాతం వృద్ధితో రూ. 8,662 కోట్ల నుంచి రూ. 9,094 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ. 8,910 కోట్ల నుంచి రూ. 9,335 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం హెచ్‌యూఎల్‌ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,058 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement