ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ నికర లాభం రెండో త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 914 కోట్లుగా నమోదైంది.
ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ నికర లాభం రెండో త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 914 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 807 కోట్లు. మరోవైపు, ఆదాయాలు రూ. 6,155 కోట్ల నుంచి రూ. 6,747 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్‌ఈకి శనివారం తెలిపింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరుపై రూ. 5.50 మధ్యంతర డివిడెండ్‌ను హెచ్‌యూఎల్ ప్రకటించింది. అలాగే, భవిష్య అలయన్స్ చైల్డ్ న్యూట్రిషన్ ఇనీషియేటివ్స్ సంస్థను పూర్తి అనుబంధ సంస్థగా మార్చుకునేందుకు అదనంగా మరిన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సంస్థ నిర్ణయించింది.