క్యూ1 ఆర్థిక ఫలితాలు... | q1 net profit results | Sakshi
Sakshi News home page

క్యూ1 ఆర్థిక ఫలితాలు...

Published Fri, Aug 5 2016 1:45 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

q1 net profit results

ఇమామి లాభం 35 శాతం డౌన్
ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఇమామి నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ1లో 35 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.87 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.57 కోట్లకు పడిపోయింది. నికర అమ్మకాలు మాత్రం రూ.537 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ.643 కోట్లకు పెరిగాయి. బీఎస్‌ఈలో ఇమామి షేర్ స్వల్పంగా పెరిగి రూ.1,148 వద్ద ముగిసింది.

 రామ్‌కో సిమెంట్స్ లాభం రూ.156 కోట్లు
రామ్‌కో సిమెంట్స్ ఈ క్యూ1లో రూ.156 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం రూ.99 కోట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.947 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.972 కోట్లకు పెరిగింది. రామ్‌కో సిమెంట్స్ షేర్ బీఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ.536 వద్ద ముగిసింది.

 బెర్జర్ పెయింట్స్ రూ.1 డివిడెండ్
బెర్జర్ పెయింట్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 55 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో రూ.75 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.117 కోట్లకు పెరిగిందని బెర్జర్ పెయింట్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,126 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు పెరిగింది. ప్రతి ఐదు షేర్లకు రెండు షేర్లను బోనస్‌గా ఇవ్వాలన్న ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. బీఎస్‌ఈలో బెర్జర్ పెయింట్స్ షేర్ 2 శాతం క్షీణించి రూ.235కు పడిపోయింది.

 టాటా టెలి నష్టాలు మరింత పెరిగాయ్
టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర) నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.127 కోట్లకు పెరిగాయని టాటా టెలి తెలిపింది. మొత్తం ఆదాయం రూ.751 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.735 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ముంబై, గోవా టెలికం సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. బీఎస్‌ఈలో కంపెనీ షేర్ ఒక శాతం తగ్గి రూ.6 వద్ద ముగిసింది. 

 30 శాతం పెరిగిన తాన్లా లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే 30% పైగా పెరిగి రూ.4 కోట్లను నమో దు చేసింది. టర్నోవరు స్వల్పంగా తగ్గి రూ.102 కోట్ల నుంచి రూ.98 కోట్లకు వచ్చి చేరింది.

 గతి లాభం 20 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎక్స్‌ప్రెస్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్ సేవల్లో ఉన్న గతి లిమిటెడ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.12 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 2 శాతం అధికమై రూ.429 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం ఎగసి రూ.37 కోట్లుగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement