ముంబై: ఫెడ్ రేట్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో 8777 వద్ద క్లోజ్ అయింది. ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్ బ్యాంక్ ప్రకనటతో తిరిగి150 పాయింట్ల మేరకు లాభపడ్డాయి. ఇలా ఆరంభంనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ సెక్టార్ , ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లు నష్టపోగా మెటల్స్, రియల్టీ, ఆటో రంగాలు మార్కెట్లను ఆదుకున్నాయి. , ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
Published Wed, Sep 21 2016 3:50 PM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM
Advertisement
Advertisement