ఎఫ్‌ఎంసీజీలో 10% వృద్ధి
- గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీవోవో సునీల్
- మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణి ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంసీజీ) రంగం దేశంలో రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుందని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రంగం పనితీరు గతేడాది కంటే బాగుందని కంపెనీ సీవోవో సునీల్ కటారియా తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణిలో అయిదు రకాల ఉత్పత్తులను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
10 శాతం వాటా లక్ష్యం: ప్రొటెక్ట్ శ్రేణిలో చేతులను శుభ్రం చేసుకునేందుకు వాడే నాలుగు రకాల ఉత్పత్తులతోపాటు దోమల నుంచి శరీరాన్ని రక్షించే స్ప్రే ‘బజ్ ఆఫ్’ ఉన్నాయి. వీటి ధరలు రూ.50 నుంచి ప్రారంభమవుతాయి. చిన్న పిల్లలు నురగను ఇష్టపడతారని, అందుకే భారత్‌లో తొలిసారిగా ఫోమ్ హ్యాండ్ వాష్‌ను ప్రవేశపెట్టినట్టు క ంపెనీ తెలిపింది.