Godrej Consumer Products
-
సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా
భారతదేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకటి గోద్రెజ్ గ్రూప్. 2017లో నిసాబా ఆది గోద్రెజ్ కంపెనీ కీలక బాధ్యతలను నెత్తినవేసుకొని పెనుసవాళ్లను స్వీకరిస్తూ విజయబావుటా ఎగరేసిన ధీర. 13.9 బిలియన్ డాలర్లు విలువైన గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్‌ను గ్లోబల్‌గా తీర్చిదిద్దారు. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్(జీసీసీఎల్) ఆవిష్కారం, ప్రపంచవ్యాప్త కంపెనీగా తీర్చిదిద్దడంలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2007లో ఆమె ప్రారంభించిన ప్రాజెక్ట్ లీప్‌ఫ్రాగ్, జీసీసీఎల్ ఏకీకరణ ద్వారా ఆగ్రోలో సేంద్రీయ వృద్ధికి దారితీసింది. పలు విదేశాల్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్త కంపెనీగా మారింది. నెలల చంటిబిడ్డతోనే కుటుంబ వ్యాపారంలోకి ఆమె ప్రవేశం కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ, పని పట్ల మక్కువతో, నిబద్దతతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని, వ్యాపార విస్తరణలో నిసాబా తనను తాను నిరూపించుకున్నారు. ఎదురైనా ప్రతీ ఛాలెంజ్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు జన్మించిన ఒక నెలలోనే , తరచుగా పసిబిడ్డను ఆఫీసుకుని వెళ్లి మరీ పనిని తిరిగి ప్రారంభించారు. నిసాబా గోద్రెజ్ ఇండస్ట్రీస్, దాని సోదర కంపెనీల కోసం కార్పొరేట్ వ్యూహాన్ని కూడా నిసాబా నిర్వహిస్తారు. గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ Re 1 మస్కిటో రెపెల్లెంట్, హిట్ యాంటీ-రోచ్ జెల్ వంటి కొన్ని వినూత్నమైన , ప్రసిద్ధ ఉత్పత్తులను ఆమె పర్యవేక్షణలో వచ్చినవే. అలాగే అధునా భబానీ ఓష్ భబానీకి చెందిన సెలూన్ చైన్ BBluntలో 30 శాతం పెట్టుబడి పెట్టడంతో జీసీపీఎల్ సెలూన్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్రాండ్ పేరుతో ప్రత్యేకమైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను కూడా విడుదల చేశారు. సోషల్ సర్వీసులోనూ సామాజిక సేవలో కూడా నిసాబా ముందే ఉన్నారు. జీసీపీఎల్ , గోద్రెజ్ అగ్రోవెట్ టీచ్ ఫర్ ఇండియా బోర్డులలో ప్రాతినిధ్యం ఉన్న ఆమె తక్కువ-ఆదాయ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారు .కళాశాల గ్రాడ్యుయేట్లు పని చేసే నిపుణులను రెండు సంవత్సరాల పాటు పూర్తి సమయం ఉపాధ్యాయులుగా నియమిస్తోంది. అలాగే గోద్రెజ్ గ్రూప్ 'గుడ్ & గ్రీన్' CSR చొరవను కూడా నడుపుతున్నారు . గోద్రెజ్ ఫ్యామిలీ కౌన్సిల్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. నిసాబా గోద్రెజ్ ఎవరు? గోద్రెజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రెజ్ చిన్న కుమార్తె నిసాబా. నిసాబా సోదరి తాన్యా దుబాష్ వ్యాపారంలో ముఖ్యమైన సభ్యులు.1978లో జన్మించిన నిసాబా తన బాల్యాన్ని ముంబైలో తన తోబుట్టువులు తాన్యా దుబాష్ , పిరోజ్షా ఆది గోద్రెజ్‌లతో గడిపారు. నిసాబా 2000లో వార్టన్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పొందిన తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా పొందారు. నిసాబా 2013లో ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాను వివాహమాడారు. ఈ జంటకు జోరాన్, ఐడాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాగా 1.6 బిలియన్ల (సుమారు రూ. 9,600 కోట్లు) ఏకీకృత ఆదాయాన్ని కలిగి ఉన్న గోద్రెజ్‌లో నిసాబా సంస్థ అతి పిన్న వయసులోనే చైర్మన్ కావడం ఒక విశేషమైతే కంపెనీ బోర్డులో అత్యధికంగా ఐదుగురు మహిళా డైరెక్టర్లుండటం విశేషం. అంతేకాదు మహిళలకు సౌకర్యవంతమైన పని వేళలు, ఇంటినుండి పని చేసే అవకాశాలు, మిడ్మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన మహిళలు తిరిగి రావడానికి సహాయపడే ప్రోగ్రామ్‌ను అందించడం ద్వారా గోద్రెజ్ మహిళలకు ఉద్యోగాల్లో మరింత ప్రోత్సహిస్తుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం గోద్రెజ్ నికర విలువ దాదాపు రూ. 1.1 లక్షల కోట్లు . బాలీవుడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా 6 సంవత్సరాల వయస్సులో, నిసా 1986లో బాలీవుడ్ చిత్రం "జాన్బాజ్"లో ప్రారంభ సన్నివేశంలో N.A.G అక్షరాలతో ఉన్న గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు. -
గోద్రెజ్ కన్జూమర్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది. -
15 శాతం తగ్గిన సబ్బుల ధరలు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరిగిపోయిన సబ్బుల ధరలు కొంత దిగొచ్చాయి. సామాన్యుడికి కొంత ఊరట దక్కింది. ముడి పదార్థాల ధరలు క్షీణించడంతో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కంపెనీలు సబ్బుల ధరలను 15 శాతం వరకు తగ్గించాయి. సబ్బుల్లో ప్రధానంగా వినియోగించే పామాయిల్ ధరలు ఇటీవల గణనీయంగా తగ్గడం తెలిసిందే. లైఫ్‌బోయ్, లక్స్ సబ్బులను 5–11 శాతం మధ్య పశ్చిమాది ప్రాంతంలో తగ్గించినట్టు హెచ్‌యూఎల్ ప్రకటించింది. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్ తదితర బ్రాండ్లపై సబ్బులను విక్రయించే గోద్రేజ్ కన్జ్యూమర్ 13–15 శాతం మధ్య ధరలను తగ్గించింది. ధరలు తగ్గించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అధిక విక్రయాలు నమోదు కావచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. తొలి కంపెనీ మాదే..: గోద్రేజ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్‌వో సమీర్ షా మాట్లాడుతూ.. ‘‘కమోడిటీల ధరలు దిగిరావడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసిన మొదటి ఎఫ్ఎంసీజీ కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమరే. గోద్రేజ్ నంబర్ 1 బండిల్ ప్యాక్ (100 గ్రాముల ఐదు సబ్బులు) ధరను రూ.140 నుంచి రూ.120కు తగ్గించాం’’అని వివరించారు. హెచ్‌యూఎల్ అధికార ప్రతినిధి లైఫ్‌బోయ్, లక్స్ ధరల తగ్గింపును ధ్రువీకరించారు. అదే సమయంలో సర్ఫ్, రిన్, వీల్, డవ్ తదితర ఉత్పత్తుల ధరలపై స్పందించలేదు. ‘‘గడిచిన ఏడాది కాలంలో హెచ్‌యూఎల్ సబ్బుల గ్రాములను తగ్గించి, ధరలను పెంచడంతో విక్రయాలపై ప్రభావం పడింది. ఇప్పుడు ధరలు తగ్గించడం కలిసొస్తుంది’’అని ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ పేర్కొన్నారు. -
గోద్రెజ్‌లో కీలక పరిణామం, చైర్మన్ పదవికి ఆది గోద్రెజ్ రాజీనామా
న్యూఢిల్లీ: పాతతరం పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్ తాజాగా గోద్రెజ్ ఇండస్ట్రీస్(జీఐఎల్) చైర్మన్ పదవి నుంచి వైదొలగారు. అంతేకాకుండా కంపెనీ బోర్డు నుంచి సైతం తప్పుకున్నారు. తమ్ముడు నాదిర్ గోద్రెజ్‌కు కంపెనీ పగ్గాలు అప్పజెప్పారు. అక్టోబర్ 1నుంచి చైర్మన్‌గా నాదిర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ పేర్కొంది. 79ఏళ్ల ఆది గోద్రెజ్ ఇకపై గోద్రెజ్ గ్రూప్‌నకు చైర్మన్‌గా, జీఐఎల్‌కు గౌరవ చైర్మన్‌గానూ వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. నాదిర్ గోద్రెజ్ ప్రస్తుతం జీఐఎల్‌కు ఎండీగా పనిచేస్తున్నారు. తాజా మార్పులతో చైర్మన్, ఎండీ పదవులను నిర్వహించనున్నారు. కృతజ్ఞతలు.. జీఐఎల్‌కు ఆది గోద్రెజ్ దశాబ్దాల తరబడి సర్వీసులు అందించారు. నాలుగు దశాబ్దాలకుపైగా కంపెనీలో బాధ్యతలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. ఈ కాలంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు కంపెనీలో సమూల మార్పులను తీసుకువచ్చినట్లు తెలియజేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బోర్డుతోపాటు, టీమ్ సభ్యులు, బిజినెస్ భాగస్వాములు, వాటాదారులు, ఇన్వెస్టర్లు తదితరులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నాదిర్ సారథ్యంలో ఇకపై కంపెనీ మరింత పురోగాభివృద్ధిని సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా.. ఆది గోద్రెజ్ నాయకత్వం, విజన్, కంపెనీని మలచిన తీరు, విలువలు వంటి అంశాలపట్ల జీఐఎల్‌తోపాటు, బోర్డు తరఫున నాదిర్ గోద్రెజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.430 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో వచ్చిన నికర లాభం రూ.352 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి చెందిందని జీసీపీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,057 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.2,666 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ నిసాబా గోద్రేజ్ తెలిపారు. ఇబిటా 18 శాతం వృద్ధి చెందిందన్నారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.1 మధ్యంతర డివిడెండ్ (వంద శాతం) ఇవ్వనున్నామని తెలిపారు. 11 శాతం పెరిగిన ‘భారత’ ఆదాయం మొత్తం వ్యయాలు రూ.2,057 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగాయని నిసాబా వివరించారు. ప్రకటనలు, ప్రచార వ్యయాలు 18 శాతం పెరిగి రూ.226 కోట్లకు చేరాయని తెలిపారు. భారత కార్యకలాపాల ఆదాయం రూ.1,280 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,425 కోట్లకు, ఆఫ్రికా ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.599 కోట్లకు పెరిగాయని వివరించారు. అయితే ఇండోనేసియా కార్యకలాపాల ఆదాయం 8 శాతం తగ్గి రూ.364 కోట్లకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జీసీపీఎల్ షేర్ స్వల్పంగా పెరిగి రూ.1,061 వద్ద ముగిసింది. -
వారసురాలి చేతికి గోద్రెజ్
♦ కన్జూమర్ ప్రొడక్ట్స్ పగ్గాలు నిసాబాకు ♦ ఈ నెల 10న బాధ్యతల స్వీకరణ న్యూఢిల్లీ: మరో దిగ్గజ పారిశ్రామిక సంస్థ పగ్గాలు చేతులు మారుతున్నాయి. భారతదేశ వ్యాపార సంస్కృతిలో పెనవేసుకుపోయిన వినియోగ వస్తువుల దిగ్గజం గోద్రెజ్ గ్రూప్... తన కన్జూమర్ ఉత్పత్తుల విభాగ పగ్గాలను నిసాబా గోద్రెజ్‌కు అప్పగించనుంది. గ్రూపులో కీలక సంస్థయిన గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్) చైర్‌పర్సన్‌గా ఆది గోద్రెజ్ కుమార్తె నిసాబా ఈ నెల 10న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె ప్రస్తుతం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆది గోద్రెజ్ (75) ఇకపై గౌరవ చైర్మన్‌గా మాత్రం వ్యవహరిస్తారు. 39 ఏళ్ల వయసున్న నిసాబా... దేశీయంగా ఈ స్థాయి సంస్థ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కురాలు కానున్నారు. ఆది గోద్రెజ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె తాన్యా దుబాష్ గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా ఉండగా... చిన్న కుమార్తె నిసాబా ప్రస్తుతం కీలక పదవి చేపట్టబోతున్నారు. వారిద్దరికన్నా చిన్నయిన కుమారుడు పిరోజ్షా గోద్రెజ్... గోద్రెజ్ ప్రోపర్టీస్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘కంపెనీ మూలాలు పటిష్టంగా ఉన్నాయి. కొత్త చైర్‌పర్సన్‌కు అధికారాలు బదలాయించటానికి ఇదే సరైన సమయం. తను కంపెనీని మరింత వృద్ధిలోకి తీసుకొస్తుంది‘ అని ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. కన్జూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు తదితర రంగాల్లో గోద్రెజ్ గ్రూప్ కార్యకలాపాలు సాగిస్తోంది. దశాబ్దకాలంగా కంపెనీలో కీలక పాత్ర... ది వార్టన్ స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్ చేసిన నిసాబా.. అటుపైన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చదివారు. గడిచిన దశాబ్దకాలంగా జీసీపీఎల్ వ్యూహాల్లో నిసాబా కీలకపాత్ర పోషిస్తున్నారు. 2011 నుంచి జీసీపీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారు. ఇటు దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, కన్సాలిడేషన్‌తో ఎదుగుతూనే అటు అంతర్జాతీయంగా వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులతో గ్రూప్‌ను వృద్ధి పథంలో నడిపేందుకు 2007లో ఆవిష్కరించిన ప్రాజెక్ట్ లీప్ ఫ్రాగ్ రూపకర్త నిసాబానే. ఈ వ్యవధిలో జీసీపీఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20 రెట్లు ఎగసి రూ.3,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్ ఆదాయాల్లో సగభాగానికిపైగా విదేశీ మార్కెట్ల నుంచే వస్తోంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీసీపీఎల్ మొత్తం ఆదాయం రూ. 8,753 కోట్ల నుంచి రూ. 9,608 కోట్లకు పెరిగింది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి ప్రాజెక్టులకు నిసాబానే సారథ్యం వహిస్తున్నారు. గతంలో గోద్రెజ్ ఆగ్రోవెట్‌ను విజయవంతంగా లాభాల్లోకి మళ్లించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్పేష్ మెహతాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. ఒక షేర్‌కు మరో షేర్ బోనస్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. ఒక్కో షేర్‌కు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను, ఒక షేర్‌కు మరో షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నది. కంపెనీ నికర లాభం 3 రెట్లు (కన్సాలిడేటెడ్) పెరిగి రూ.390 కోట్లకు చేరింది. అన్ని కేటగిరీల్లో అమ్మకాల వృద్ధి జోరుగా ఉండడమే దీనికి కారణం. అంతక్రితం ఏడాది క్యూ4లో నికర లాభం రూ.125 కోట్లు. ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.2,480 కోట్లకు పెరిగింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,956ను తాకిన ఈ షేర్ చివరకు 10% లాభంతో రూ.1,929 వద్ద ముగిసింది. -
స్టాక్ట్స్ వ్యూ
బ్యాంక్ ఆఫ్ బరోడా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.210 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం 48 శాతం క్షీణించి రూ.598కోట్లకు తగ్గింది. కేటాయింపులు 58 శాతం పెరగడమే దీనికి కారణం. ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండటంతో వడ్డీయేతర ఆదాయం 15 శాతం పెరిగింది. రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్లకు సంబంధించిన రుణాల్లో వృద్ధి చెప్పుకోదగ్గ విషయం. క్యూ3తో పోల్చితే మొండి బకాయిలు తగ్గాయి. మెటల్, ఇన్ఫ్రా కంపెనీలకు అధిక మొత్తంలో రుణాలివ్వడంతో అసెట్ క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడగలదని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 9 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. ఫీజు ఆదాయం ఆరోగ్యకరంగా ఉండడం, కాసా వృద్ధి కారణంగా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) మెరుగుపడే అవకాశాలు.. సానుకూలాంశాలు. జూబిలంట్ ఫుడ్‌వర్క్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,752 టార్గెట్ ధర: రూ.2,000 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 25 శాతం వృద్ధితో రూ.542 కోట్లకు పెరిగాయి. సంవత్సరంన్నర కాలంలో ఇదే అత్యధికం. నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.31.5కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 150 డొమినోస్, 28 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 150 డొమినోస్, 30 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నది. డంకిన్ డునాట్స్ వ్యాపార విభాగం 2-3 ఏళ్లలో బ్రేక్ఈవెన్ సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. కొత్తగా స్టోర్స్ ఏర్పాటు ద్వారా నెట్వర్క్ విస్తరిస్తోంది. వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. గత ఏడాది జూన్‌లో ఒకసారి, నవంబర్‌లో మరొకసారి 3 శాతం చొప్పున ధరలను పెంచింది. ఫలితంగా కంపెనీ ఆదాయం పెరిగింది. వచ్చే నెలలో మరోసారి ధరలను పెంచనున్నది. 2013-14 క్యూ4లో 18 శాతంగా ఉన్న ఆన్లైన్ ఆర్డర్లు 2014-15క్యూ4లో 29 శాతానికి పెరిగాయి. మూడేళ్లలో ఇవి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,166 టార్గెట్ ధర: రూ.1,220 ఎందుకంటే: భారత ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రధన కంపెనీల్లో ఒకటి. పలు గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. గుడ్‌నైట్(దోమల నివారిణి), నంబర్ 1, సింధాల్ (సబ్బులు), గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్(హెయిర్ కలర్స్), ఎర్(ఎయిర్ ఫ్రెషనర్స్), గోద్రేజ్ ప్రోటెక్ట్( హెల్త్ అండ్ వెల్నెస్) బ్రాండ్లతో అమ్మకాలు సాధిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో విస్తరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు బావున్నాయి. నికర అమ్మకాలు 8% వృద్ధితో రూ.2,092 కోట్లకు పెరిగాయి. భారత్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక ఇబిటా 13% వృద్ధితో రూ.406 కోట్లకు పెరిగింది. నికర లాభం 12% వృద్ధితో రూ.265 కోట్లకు పెరిగింది. ఘనాలోని డార్లింగ్ గ్రూప్‌లో వంద శాతం వాటాను, దక్షిణాఫ్రికాలోని ఫ్రికా హెయిర్ కంపెనీల్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
12% పెరిగిన గోద్రెజ్ కన్సూమర్ నికర లాభం
- నికర అమ్మకాలు 8 శాతం అప్ - షేర్‌కు రూ.2.5 నాలుగో మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ: గోద్రెజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్(జీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.266 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.236 కోట్లు)తో పోల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.1,924 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,083 కోట్లకు పెరిగాయని గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.760 కోట్ల నుంచి రూ.907 కోట్లకు, నికర అమ్మకాలు రూ.7,583 కోట్ల నుంచి రూ.8,242 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌గా షేర్‌కు రూ.2.5 ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కంటే తర్వాతి ఆరు నెలల్లో మంచి పనితీరు కనబరిచామని వివరించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ వృద్ధి కారణంగా మంచి వ్యాపారం సాధించామని వివరించారు. నవ కల్పనలకు, బ్రాండ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామని, ఫలితంగా మంచి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ.1,098 వద్ద ముగిసింది. -
స్టాక్స్ వ్యూ
ఐడియా సెల్యులార్ బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ. 160 టార్గెట్ ధర: రూ.190 ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న భారత టెలికం కంపెనీ ఇది. మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది. 2010-14 కాలానికి టెలికం పరిశ్రమ రాబడి 6 శాతంగా ఉండగా, ఈ కంపెనీ రాబడి 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. 12కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రమైన పోటీ ఉన్న టెలికం పరిశ్రమలో నాలుగేళ్లలోనే మార్కెట్ వాటాను, రాబడులను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకోవడం కంపెనీ పనితీరును ప్రతిబింబిస్తోంది. కంపెనీ బ్రాండ్ బిల్డింగ్ సామర్థ్యానికి, పటిష్టమైన నిర్వహణ తీరుకు ఇదే నిదర్శనం. 2014 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్లో 2.4గా ఉన్న రుణ, ఇబిటా నిష్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కల్లా 1.32కు తగ్గింది. పుష్కలంగా ఉన్న నగదు నిల్వలు, ఈక్విటీ పెరగడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కంపెనీలు టారిఫ్‌లను పెంచుతున్నాయి. రెండేళ్లలో ఈ టారిఫ్‌లు 7% వరకూ పెరుగుతాయని అంచనా. భారత్‌లో వాయిస్, డేటా మార్కెట్ మరింతగా వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న ఈ కంపెనీకి మంచి ప్రయోజనాలు అందనున్నాయి. అందుకని ప్రస్తుతమున్న ధర స్థాయి నుంచి ఈ కంపెనీ షేర్ 15-18 శాతం రేంజ్లో పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 970 టార్గెట్ ధర: రూ.1,100 ఎందుకంటే: వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీ వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ రికవరీ అధికంగా ఉంది. ఆఫ్రికా, నైజీరియా, దక్షిణాఫ్రికాల్లో వ్యాపారం మందగమనంగా ఉన్నా ఇండోనేసియాలో జోరుగా ఉంది. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండటంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఆయా దేశాల కరెన్సీ మారక విలువల కారణంగా ప్రస్తుతం ఈ షేర్ డిస్కౌంట్‌కే ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో ముడి పదార్థాల ధరలు తగ్గి ఉత్పత్తి వ్యయాలు తగ్గనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు 50 శాతం వరకూ తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. దీంట్లో కొంత భాగాన్ని వినియోగదారులకు డిస్కౌంట్/ఉచిత వస్తువుల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఫలితంగా అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయి. కుదుటపడుతున్న ఆర్థిక ఫలితాల కారణంగా మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. డెంగ్యూ జ్వరంపై ఆందోళనల కారణంగా కంపెనీ హోమ్ ఇన్సెక్టిసైడ్స్ వ్యాపారం జోరుగా ఉంది. కంపెనీ అందిస్తున్న దోమలకు సంబంధించిన ఫాస్ట్కార్డ్ ఉత్పత్తి ఏడాది కాలంలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. సబ్బుల వ్యాపారం కూడా పుంజుకుంది. -
ఎఫ్ఎంసీజీలో 10% వృద్ధి
గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీవోవో సునీల్ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణి ఉత్పత్తులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగం దేశంలో రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుందని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రంగం పనితీరు గతేడాది కంటే బాగుందని కంపెనీ సీవోవో సునీల్ కటారియా తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణిలో అయిదు రకాల ఉత్పత్తులను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 10 శాతం వాటా లక్ష్యం: ప్రొటెక్ట్ శ్రేణిలో చేతులను శుభ్రం చేసుకునేందుకు వాడే నాలుగు రకాల ఉత్పత్తులతోపాటు దోమల నుంచి శరీరాన్ని రక్షించే స్ప్రే ‘బజ్ ఆఫ్’ ఉన్నాయి. వీటి ధరలు రూ.50 నుంచి ప్రారంభమవుతాయి. చిన్న పిల్లలు నురగను ఇష్టపడతారని, అందుకే భారత్‌లో తొలిసారిగా ఫోమ్ హ్యాండ్ వాష్‌ను ప్రవేశపెట్టినట్టు క ంపెనీ తెలిపింది.