బ్యాంక్ ఆఫ్ బరోడా : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.210
ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం 48 శాతం క్షీణించి రూ.598కోట్లకు తగ్గింది. కేటాయింపులు 58 శాతం పెరగడమే దీనికి కారణం. ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండటంతో వడ్డీయేతర ఆదాయం 15 శాతం పెరిగింది. రిటైల్, ఎస్‌ఎంఈ సెగ్మెంట్లకు సంబంధించిన రుణాల్లో వృద్ధి చెప్పుకోదగ్గ విషయం. క్యూ3తో పోల్చితే మొండి బకాయిలు తగ్గాయి.
మెటల్, ఇన్‌ఫ్రా కంపెనీలకు అధిక మొత్తంలో రుణాలివ్వడంతో అసెట్ క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడగలదని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 9 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. ఫీజు ఆదాయం ఆరోగ్యకరంగా ఉండడం, కాసా వృద్ధి కారణంగా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) మెరుగుపడే అవకాశాలు.. సానుకూలాంశాలు.
జూబిలంట్ ఫుడ్‌వర్క్స్ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.1,752 టార్గెట్ ధర: రూ.2,000
ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 25 శాతం వృద్ధితో రూ.542 కోట్లకు పెరిగాయి. సంవత్సరంన్నర కాలంలో ఇదే అత్యధికం. నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.31.5కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 150 డొమినోస్, 28 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 150 డొమినోస్, 30 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నది. డంకిన్ డునాట్స్ వ్యాపార విభాగం 2-3 ఏళ్లలో బ్రేక్‌ఈవెన్ సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.
కొత్తగా స్టోర్స్ ఏర్పాటు ద్వారా నెట్‌వర్క్ విస్తరిస్తోంది. వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. గత ఏడాది జూన్‌లో ఒకసారి, నవంబర్‌లో మరొకసారి 3 శాతం చొప్పున ధరలను పెంచింది. ఫలితంగా కంపెనీ ఆదాయం పెరిగింది. వచ్చే నెలలో మరోసారి ధరలను పెంచనున్నది. 2013-14 క్యూ4లో 18 శాతంగా ఉన్న ఆన్‌లైన్ ఆర్డర్లు 2014-15క్యూ4లో 29 శాతానికి పెరిగాయి. మూడేళ్లలో ఇవి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం.
గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.1,166 టార్గెట్ ధర: రూ.1,220
ఎందుకంటే: భారత ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో ప్రధన కంపెనీల్లో ఒకటి. పలు గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. గుడ్‌నైట్(దోమల నివారిణి), నంబర్ 1, సింధాల్ (సబ్బులు), గోద్రేజ్ ఎక్స్‌పర్ట్ రిచ్ క్రీమ్(హెయిర్ కలర్స్), ఎర్(ఎయిర్ ఫ్రెషనర్స్), గోద్రేజ్ ప్రోటెక్ట్( హెల్త్ అండ్ వెల్‌నెస్) బ్రాండ్లతో అమ్మకాలు సాధిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో విస్తరిస్తోంది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు బావున్నాయి. నికర అమ్మకాలు 8% వృద్ధితో రూ.2,092 కోట్లకు పెరిగాయి. భారత్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక ఇబిటా 13% వృద్ధితో రూ.406 కోట్లకు పెరిగింది. నికర లాభం 12% వృద్ధితో రూ.265 కోట్లకు పెరిగింది. ఘనాలోని డార్లింగ్ గ్రూప్‌లో వంద శాతం వాటాను, దక్షిణాఫ్రికాలోని ఫ్రికా హెయిర్ కంపెనీల్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్ట్స్ వ్యూ
Published Mon, May 18 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement