Stocks View
-
ఏడాది కాలానికి 3స్టాక్ సిఫార్సులు
షేరు పేరు: ఎస్బీఐ బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.218 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: ప్రస్తుత సంక్షోభ పరిస్థితిల్లో లయబిలిటీ రిస్క్‌లను ఎదుర్కోనే శక్తి సామర్థా్యలు ఎస్బీఐకు పుష్కలంగా ఉన్నాయి. సంస్థలో ప్రభుత్వం మెజార్టీ వాటాను కలిగి ఉండటం, డిపాజిట్లు క్రమంగా పెరుగుదల ఇందుకు సహకరిస్తున్నాయి. లోక్‌బుక్ నాణ్యత కారణంగా అసెట్ క్వాలిటీ విషయంలో అనేక ఇతర పెద్ద బ్యాంకుల కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి షేరును ప్రస్తుత మార్కెట్ ధర(రూ.189.55) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.152-157 పరిధి వరకు పడిన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: టెక్ మహీంద్రా బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.601 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: కోవిడ్-19 ప్రేరేపిత లాక్డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితులు ఐటీ రంగాన్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీలు నెట్వర్క్ వ్యవస్థపై ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. కనెక్టివిటీకి డిమాండ్ పెరగడం కూడా ఈ షేరుకు కలిసొచ్చే అంశంగా ఉంది. కమ్యూనికేషన్ వర్టికల్లో అగ్రస్థానానికి చేరుకునేందుకు టెక్ మహీంద్రాకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ షేరును రూ.500-508 శ్రేణిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.455-460 శ్రేణి వరకు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: జేకే సిమెంట్స్ బ్రోకరేజ్ పేరు: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.1450.00 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: వ్యాపార విస్తరణతో ద్వారా అమ్మకాలు, ఆదాయ వృద్ధి జరగుతుందని అంచనా. ఉత్తర, మధ్య భారత్‌లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా. కొత్తగా కంపెనీ పెట్టే వ్యయంతో ఉత్పాదక సామర్థ్యం పెరగుతుంది. తద్వారా కంపెనీ వార్షిక సగటు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రూ.1450.00 టార్గెట్ ధరతో ప్రస్తుత మార్కెట్ ధర(రూ.1419.95) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. -
కోవిడ్-19 దెబ్బ- చౌకగా మారిన షేర్లు
ప్రపంచ దేశాలతోపాటు దేశీయంగానూ కరోనా వైరస్ విస్తరించడంతో పలు రంగాలు కుదేలయ్యాయి. కోవిడ్-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డవున్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ మందగమన బాటపట్టింది. పలు బిజినెస్‌లకు డిమాండ్ పడిపోవడంతోపాటు.. ఉత్పత్తి, సరఫరా సమస్యలు తలెత్తాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాల కోతకు తెరలేచింది. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డవును అనుసరించడంతో దేశాల మధ్య ప్రయాణాలు రద్దయ్యాయి. వెరసి అటు టూరిజం, హోటళ్లు, విమానయానంతోపాటు.. ఇటు మల్టీప్లెక్స్‌లు, ఫ్యాషన్ రిటైలింగ్ తదితర రంగాలలో కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. దీంతో మార్చిలో ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీ మార్కెట్లు సైతం కుప్పకూలినప్పటికీ తదుపరి ఏప్రిల్‌లో బౌన్స్‌బ్యాక్ సాధించాయి. అయినప్పటికీ పలు రంగాలకు చెందిన కౌంటర్లు ఇప్పటికీ ఏడాది గరిష్టాలతో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్నాయి. మారిన పరిస్థితులలో ఇటీవల ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆర్బీఐ మారటోరియం విధించినప్పటికీ ఆర్థిక మందగమనం కారణంగా కొంతమేర ఎస్ఎంఈ, కార్పొరేట్ తదితర రుణాల నాణ్యత దెబ్బతినే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఎన్బీఎఫ్సీ, బ్యాంకింగ్ రంగ కౌంటర్లు సైతం బలహీనంగా కదులుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 20-50 శాతం డౌన్ లాక్‌డవున్ ప్రకటించిన మార్చి 24 నుంచి బీఎస్ఈ-500లోని పలు కంపెనీలు 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో పలు రంగాలు, కంపెనీలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా కొన్ని కౌంటర్లను పరిశీలిస్తే.. చాలెట్ హోటల్స్ 49 శాతం పతనమైంది. ఏడాది కాలంలో 71 శాతం కుప్పకూలింది. కంపెనీ ఆదాయంలో సగ భాగం విదేశీ టూరిస్టుల నుంచే సమకూరుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఇక లెమన్ ట్రీ హోటల్స్ గత రెండు నెలల్లో 33 శాతం క్షీణించగా.. గరిష్టం నుంచి 74 శాతం పడిపోయింది. ఇతర కౌంటర్లలో మల్టీప్లెక్స్ కంపెనీ పీవీఆర్ షేరు 38 శాతం నీరసించగా.. గరిష్టం నుంచి 71 శాతం తిరోగమించింది. మాల్స్‌పై లాక్‌డవున్ కొనసాగుతుండటం, ఓటీటీ ప్లాట్‌ఫామ్ పుంజుకోవడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫైనాన్స్ వీక్ కోవిడ్-19 ధాటికి ఫైనాన్షియల్ రంగ కౌంటర్లూ బలహీనపడ్డాయి. ఇటీవల కొంతమేర రికవర్ అయినప్పటికీ.. పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ కంఔటర్లు డీలాపడ్డాయి. పీఎన్బీ, ఆర్బీఎల్, డీసీబీ, బీవోబీలతోపాటు.. చోళమండలం ఫైనాన్షియల్, శ్రీరామ్ సిటీ యూనియన్, రెప్కో హోమ్ తదితరాలు గత రెండు నెలల్లో 22-33 శాతం మధ్య క్షీణించాయి. పెట్టుబడుల ఆవశ్యకత, మొండిబకాయిలు పెరగనున్న అంచనాలు ఇందుకు కారణంకాగా.. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఫ్యూచర్ రిటైల్, షాపర్స్ స్టాప్ సైతం 30-34 శాతం మధ్య వెనకడుగు వేశాయి. -
కొటక్ మహీంద్రా ,ఇన్ఫోసిస్‌లపై ఫోకస్
క్యూ4 ఫలితాలు: డాబర్, హెరిటేజ్ ఫుడ్స్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, కంప్యూకమ్ సాఫ్ట్వేర్, సన్ ఫార్మాసూటికల్స్, క్వెస్ కార్పొరేషన్, జేపీ అసోసియేట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వైభవ్ గ్లోబల్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి. కొటక్‌మహీంద్రా బ్యాంక్: రూ.7,500 కోట్ల నిధులు సమీకరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టీట్యూషనల్ ప్లేస్మెంట్ ఆఫర్‌ను ప్రకటించింది.ఇందులో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.1,147.75 గా నిర్ణయించింది. బ్లూడార్ట్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.30.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.12.24 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో బ్లూడార్ట్ తెలిపింది. పీఎఫ్సీ: రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించి నర్మదా బేసిన్ ప్రాజెక్ట్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తెలిపింది. న్యూజెన్ సాఫ్ట్వేర్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం పడిపోయి రూ.41.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.62.5 కోట్లుగా ఉంది. దీపక్ నైట్రైట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 88 శాతం పెరిగి రూ.172.3 కోట్లకు చేరిందని దీపక్ నైట్రేడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.91.46 కోట్లుగా ఉందని బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇన్ఫోసిస్: డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఎండ్టుఎండ్ వెల్త్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను అందించేందుకు అవాల్క్ కంపెనీతో బాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 96 శాతం క్షీణించి రూ.6.67 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.199.91 కోట్లుగా నమోదైంది. టొరంట్ ఫార్మాసూటికల్స్: కన్సాలిడేటెడ్ నికర లాభం క్యూ4లో రూ.314కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.70.91 కోట్లకు తగ్గినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 245.30 కోట్లుగా ఉంది. -
స్టాక్స్ వ్యూ
సన్ టీవీ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.608 టార్గెట్ ధర: రూ.835 ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. చందా ఆదాయం 21 శాతం వృద్ధి చెందింది. కానీ ప్రకటనల ఆదాయం 3 శాతమే పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఆదాయం 11 శాతమే వృద్ధి చెంది రూ.740 కోట్లకు పెరిగింది. ఇబిటా 12 శాతం పెరిగి రూ.550 కోట్లకు చేరింది. ఇబిటా వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, తరుగుదల తక్కువగా ఉండటం, ఇతర ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.350 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఆదాయం 28 శాతం, ఇబిటా 36 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున పెరిగాయి. మిగిలిన ఆరు నెలల కాలానికి ప్రకటనల ఆదాయం పది శాతానికి పైగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, ప్రకటనల ఆదాయం 12 శాతం, చందా ఆదాయం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. గత ఆరు నెలల కాలంలో ఈ షేర్ 30 శాతం క్షీణించింది.దీంతో కొనుగోళ్లకు ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కంపెనీ పెట్టిన పెట్టుబడిపై రాబడి (ఆర్ఓసీఈ) 31 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌పై సన్ నెక్స్ట్ట్ను అందుబాటులోకి తేవడం, బెంగాలీ చానల్‌ను ప్రారంభించనుండటం, సన్ లైఫ్ చానల్‌ను మళ్లీ తీసుకురావడం... వీటిపై పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రతిఫలాలు ఇవ్వడానికి మరికొంత కాలం పట్టనుండటం... ప్రతికూలాంశాలు. యాక్సిస్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.620 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలోని ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు బావున్నాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. ఈ క్యూ1లో రూ.4,337 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.2,777 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇటీవల రుణాల చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి ఈ బ్యాంక్ ఇచ్చిన రుణాలు రూ.825 కోట్ల మేరకు ఉన్నాయి. రుణాలు 11 శాతం వృద్ధి చెంది రూ.4,56,121కోట్లకు పెరిగాయి. రిటైల్ రుణాలు 20 శాతం వృద్ధి చెందాయి. గత కొన్ని క్వార్టర్లుగా అంతంత మాత్రం వృద్ది సాధించిన కార్పొరేట్ రుణాలు 21 శాతం పెరిగాయి. నిర్వహణ లాభం 8.4 శాతం వృద్ధితో రూ.4,094 కోట్లకు పెరిగింది. నికర లాభం 82 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. కేటాయింపులు తగ్గాయి. రుణాలు, లాభదాయకత విషయంలో మూడో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఇదే. రెండేళ్లలో రుణాలు 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.6,07,702 కోట్లకు పెరగగలవని అంచనా వేస్తున్నాం. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉన్నాయి. 2018–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్‌ను 3 శాతానికి పైగానే సాధిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 13 శాతానికి మించి ఉండగలదని, అలాగే రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1.1 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: కేఆర్ చోక్సీ ప్రస్తుత ధర: రూ. 1,138 టార్గెట్ ధర: రూ.1,461 ఎందుకంటే: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణాలు 21 శాతం వృద్ధితో రూ.1,849 కోట్లకు పెరిగాయి. రిటైల్రుణాలు 28 శాతం, కార్పొరేటర్ రుణాలు 17 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణం. నికర వడ్డీ ఆదాయం 16 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 4 శాతం) వృద్ధితో రూ.2,690 కోట్లకు పెరిగింది. నిధుల వ్యయం 16 బేసిస్ పాయింట్లు పెరగడంతో నికర వడ్డీ మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 4.2 శాతానికి చేరింది. ఫీజు ఆదాయం 26 శాతం ఎగసి రూ.1,020 కోట్లకు పెరిగింది. కేటాయింపులు 63 శాతం పెరిగి రూ.350 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే కేటాయింపులు 25 శాతం తగ్గాయి. ఇక నికర లాభం 15 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 11 శాతం) వృద్ధితో రూ.1,140 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 11.6 శాతంగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2 బేసిస్ పాయింట్లు తగ్గి 2.15 శాతంగా (రూ.4,030 కోట్లుగా) నికర మొండి బకాయిలు ఫ్లాట్‌గా 0.86 శాతంగా (రూ.1,500 కోట్లుగా)ఉన్నాయి. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. గత రెండేళ్లుగా బ్యాంక్ లాభదాయకత పెరుగుతోంది. మరోవైపు ఒత్తిడి రుణాలు తగ్గుతున్నాయి. రుణ వృద్ధి 20 శాతానికి మించి ఉండగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇటీవలనే ఈ బ్యాంక్ వినియోగ వస్తువులు, టూ వీలర్ల కొనుగోళ్లకు రుణాలందించడం ప్రారంభించింది. లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పోర్ట్‌ఫోలియోలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కోటక్ 811 (డిజిటల్ బ్యాంక్ ఖాతా)కు మంచి స్పందన లభిస్తోంది. అనుబంధ సంస్థలు–కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ సెక్యూరిటీస్, కోటక్ ప్రైమ్(కార్ ఫైనాన్సింగ్), కోటక్ ఏఎమ్‌సీల పనితీరు కూడా బావుంది. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణాలు 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.437 టార్గెట్ ధర: రూ.515 ఎందుకంటే: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారం జోరుగా ఉన్నా, మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. స్థూల మొండి బకాయిలు 10 శాతం పెరగడం(సీక్వెన్షియల్‌గా)నిరాశపరిచింది. సీక్వెన్షియల్‌గా వ్యక్తిగత రుణాలు 30 శాతం, ప్రాజెక్ట్ రుణాలు మూడు రెట్లు పెరిగాయి. మొత్తం మీద రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. ఇది ఇటీవల కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి. అధిక రాబడులు వచ్చే ఆస్తులు తనఖాగా రుణాలు, ప్రాజెక్ట్ రుణాలు పెరిగినప్పటికీ, నిధుల వ్యయం తగ్గినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ మెప్పించలేకపోయింది. ఈ క్యూ2లో నిధుల వ్యయం 8.3 శాతంగా ఉండటంతో నికర వడ్డీ మార్జిన్ 2.34 శాతంగా నమోదైంది. ఆస్తులు తనఖాగా రుణాలు 41 శాతం, ప్రాజెక్ట్ రుణాలు 83 శాతం పెరగడంతో నిర్వహణ ఆస్తులు 16 శాతం పెరిగాయి. రెండేళ్లలో నిర్వహణ ఆస్తులు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. కేటాయింపులు సీక్వెన్షియల్‌గా 36 శాతం వృద్ధితో రూ.221 కోట్లకు పెరిగాయి. దీంతో ప్రొవిజనల్ కవరేజ్ రేషియో 20 శాతం పెరిగి 52 శాతానికి ఎగసింది. బీమా దిగ్గజం ఎల్ఐసీ మాతృసంస్థ కావడం, విస్తృతమైన నెట్వర్క్, మార్జిన్లు కొనసాగించే సత్తా ఉండడం, రుణ నాణ్యత మెరుగుపడే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. లిక్విడిటీ సమస్యలు కారణంగా నిధులు వ్యయం పెరిగే అవకాశాలుండటం, ఫలితంగా మార్జిన్లపై ఒత్తిడి పడనుండటం, స్థూల మొండి బకాయిలు పెరుగుతుండటం ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
పీవీఆర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,297 టార్గెట్ ధర: రూ.1,650 ఎందుకంటే: మల్టీ ప్లెక్స్ స్క్రీన్ల కంపెనీ, పీవీఆర్.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. మూవీ ఎగ్జిబిషన్ వ్యాపారం మంచి వృద్ధి సాధించడంతో ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.650 కోట్లకు పెరిగింది. ఇబిటా 21 శాతం పెరిగి రూ.110 కోట్లకు, ఇబిటా మార్జిన్ 0.6 శాతం వృద్ధితో 16.9 శాతానికి పెరిగాయి. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.710 కోట్లకు, ఇబిటా 37 శాతం వృద్ధితో రూ.120 కోట్లకు, మార్జిన్ 1.2 శాతం వృద్ధితో 17.5 శాతానికి ఎగిశాయి. నికర లాభం 30 శాతం వృద్ధితో రూ.33 కోట్లకు పెరిగింది. నికర బాక్స్ ఆఫీస్ ఆదాయం 17 శాతం పెరిగి రూ.350 కోట్లకు, ఫుడ్, బేవరేజేస్ విభాగం ఆదాయం 25 శాతం పెరిగి రూ.180 కోట్లకు పెరిగాయి. ఇక ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆదాయం 18 శాతం, ఇబిటా 29 శాతం, నికర లాభం 22 శాతం, పెరగ్గా ఇబిటా మార్జిన్ 1.6 శాతం పెరిగి 18.6 శాతానికి పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆరు నెలల కాలంలో ఆదాయం 38 శాతం, ఇబిటా 51 శాతం, నికర లాభం 91 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. అలాగే రెండేళ్లలో ఇబిటా 30 శాతం, నికర లాభం 36 శాతం, ఆదాయం 23 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400–450 కోట్ల మూలధన పెట్టుబడుల ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. ఎస్పీఐ సినిమాస్ పూర్తి టేకోవర్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పూర్తి కానుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 90, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100 కొత్త స్క్రీన్లు జత కానుండటం, ప్రకటనల ఆదాయం పెరుగుతుండటం, చిన్న నగరాల్లో తక్కువ వ్యయ విధానంతో కూడిన సినిమా ఫార్మాట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి తేనుండటం... ఇవన్నీ సానుకూలాంశాలు. కోటక్ మహీంద్రా బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 1,159 టార్గెట్ ధర: రూ.1,400 ఎందుకంటే: కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ బ్యాంక్ నిర్వహణ పనితీరు నిలకడగా కొనసాగుతోంది. రుణ వృద్ధి 21% పెరిగి రూ.1,84 లక్షల కోట్లకు చేరడంతో నికర వడ్డీ ఆదాయం 16% పెరిగి రూ.2,689 కోట్లకు పెరిగింది. నికరవడ్డీ మార్జిన్ సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.1% తగ్గి 4.2%కి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు మంచి వృద్ధి సాధించడంతో కేటాయింపులకు ముందు నికరలాభం రూ.2,095 కోట్లకు చేరింది. కేటాయింపులు రూ.354 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 2.15% నిలకడగా ఉండగా, నికర మొండి బకాయిలు స్వల్పంగా తగ్గి 0.81%కి చేరాయి. వాణిజ్య వాహన రుణాలు 40%, గృహ రుణాలు 39%, చిన్న వాణిజ్య సంస్థలకు రుణాలు 23% చొప్పున పెరగడంతో బ్యాంక్ మొత్తం రుణాలు 21%కి పెరిగాయి. డిపాజిట్లు 24% పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్ రుణాలు ఈ బ్యాంక్ మొత్తం రుణాల్లో సగం వరకూ ఉండటంతో బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ నికరవడ్డీ మార్జిన్, 4.5–4.9% రేంజ్లో ఈ బ్యాంక్ కొనసాగిస్తోంది. రెండేళ్లలో డిపాజిట్లు 21% చక్రగతి వృద్ధితో రూ.2.80 లక్షలకోట్లకు, నికర లాభం 23% చక్రగతి వృద్దితో రూ.6,182 కోట్లకు పెరగగలవని అంచనా. పటిష్ట యాజమాన్యం, రుణ నాణ్యత నిలకడ, రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1.7%గా, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 12–14% రేంజ్లో ఉండటం, బ్యాంక్ అనుబంధ సంస్థలు–కోటక్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా ఓల్డ్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ల పనితీరు పటిష్టంగా ఉండటం... ఇవన్నీ సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఇన్ఫోసిస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.683 టార్గెట్ ధర: రూ.800 ఎందుకంటే: ఇన్ఫోసిస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. డాలర్ల పరంగా ఆదాయం 3 శాతం వృద్ధితో 292 కోట్ల డాలర్లకు పెరిగింది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ), రిటైల్ విభాగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది. రూపాయిల్లో చూస్తే ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.20,609 కోట్లకు పెరిగింది. పరిహార, సబ్‌కాంట్రాక్టింగ్ వ్యయాలతో పాటు వేతన వ్యయాలు కూడా పెరగడంతో రూపాయి క్షీణించిన ప్రయోజనం కంపెనీకి పెద్దగా దక్కలేదు. ఫ్లూయిడో సంస్థ విలీన ఫలాలు దక్కనుండటం, డిజిటల్ విభాగం జోరైన వృద్ధి, డీల్స్ పటిష్టంగా ఉండటం, ఉద్యోగుల వలస (ఆట్రీషన్) తగ్గడం కంపెనీకి కలసివచ్చింది. అయితే ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మార్జిన్లు అంచనాలను అందుకోలేకపోయాయి. ఒక్కో షేర్‌కు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. బీఎఫ్‌ఎస్‌ఐపై అమెరికా క్లయింట్లు మరికొన్ని క్వార్టర్ల పాటు వ్యయాలు కొనసాగించనున్నారని యాజమాన్యం ధీమాగా ఉంది. పటిష్టమైన డీల్స్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను ఈ కంపెనీ సునాయాసంగానే అందుకోగలదని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ఈ కంపెనీ భారీగానే మూలధన పెట్టుబడులు పెడుతోంది. రూపాయి పతనం ప్రయోజనంతో ఈ ఆర్థిక సంవత్సరం అంచనాలను అందుకునే అవకాశాలు అధికంగానే ఉన్నాయి. డిజిటల్ విభాగం జోరుగా వృద్ధి సాధిస్తుండటం, డీల్స్ ఎగ్జిక్యూషన్ పటిష్టంగా ఉండడం వల్ల మార్జిన్లు పుంజుకోగలవని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 21 రెట్ల ధరకు పోటీ కంపెనీ టీసీఎస్ షేర్ ట్రేడవుతోంది. దీంతో పోల్చితే ఇన్ఫోసిస్ షేర్.. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 16 రెట్ల ధరకే ట్రేడవుతోంది. ప్రస్తుత ధర... ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉంది. ట్రైడెంట్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.64 టార్గెట్ ధర: రూ.83 ఎందుకంటే: ట్రైడెంట్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(2018–19, క్యూ2) కాలంలో అన్ని విభాగాల్లో మంచి వృద్ధి కనబరిచింది. ఆదాయం 24% వృద్ధితో రూ.1,391 కోట్లకు పెరిగింది ఇబిటా 83% పెరిగి రూ.317 కోట్లకు చేరింది. ముడి పదార్ధాల, ఉద్యోగుల వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎబిటా మార్జిన్ 7.3 శాతం పెరిగి 22.8%కి చేరింది. నికర లాభం 195 శాతం వృద్ధితో రూ.148 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న రెండు క్వార్టర్లలో కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. గత క్యూ2లో 32 శాతంగా ఉన్న పన్ను రేటు ఈ క్యూ2లో 28.8 శాతానికి తగ్గడం కంపెనీకి కలసివచ్చింది. టెక్స్టైల్స్ విభాగం 25 శాతం, పేపర్ అండ్ కెమికల్స్ విభాగం 22 శాతం చొప్పున వృద్ది చెందాయి. వివిధ కారణాల వల్ల కాగితం(పేపర్) విభాగం మంచి వృద్ధి సాధించడం కంపెనీకి ప్రయోజనం చేకూర్చింది. కాపీయర్ పేపర్‌కు డిమాండ్ పెరగడం, చైనాలో పేపర్ మిల్లుల మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో కొరత ఏర్పడడం వల్ల పేపర్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పబ్లిషింగ్ సీజన్ ప్రారంభం కానుండటంతో పేపర్‌కు మరింతగా డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర రుణ భారం రూ.271 కోట్లు తగ్గి ఈ క్యూ2 చివరి నాటికి రూ.2,527 కోట్లకు తగ్గింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7% చొప్పున వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, నికర లాభం 32 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 4.6% పెరిగి 13.8 శాతానికి చేరుతుందని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.275 టార్గెట్ ధర: రూ.743 ఎందుకంటే: వాధ్వాన్ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ.. భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల వారికి రుణాలివ్వడంపై దృష్టి సారించే ఏౖMðక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఇదే. 352 నగరాల్లో రూ.1,20,900 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త గృహాల కొనుగోళ్లు, రీసేల్ హౌజ్ ప్రొపర్టీ, ఇళ్ల రిపేర్లకు, ఎక్స్టెన్సన్కు అవసరమైన రుణాలందిస్తోంది. ఇటీవల లిక్విడిటీ సమస్య కారణంగా కుదేలైన కంపెనీ షేర్లలో ఈ షేర్ కూడా ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ బాండ్లలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన డీఎస్పీ మ్యూచువల్ ఫండ్... ఇన్వెస్టర్ల నుంచి రిడంప్షన్ ఒత్తిడి అధికంగా ఉండటంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కమర్షియల్ పేపర్(సీపీ)ను డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో ఈ నెల 21న డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 42% పతనమైంది. అయితే ఈ కంపెనీ సమీకరించిన మొత్తం రుణాల్లో సీపీ ద్వారా సమీకరించిన రుణాలు 8 శాతం వరకూ మాత్రమే ఉన్నాయి. రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాలేదని, వచ్చే ఏడాది 2019 వరకూ చెల్లించే రుణాలకు చెల్లించడానికి అవసరమైన నిధులు ఉన్నాయని, ఎలాంటి లిక్విడిటీ సమస్య లేదని కంపనీ ధీమాను వ్యక్తం చేసింది. ఈ కంపెనీ నిధుల సమీకరణ వ్యయం 8.65 శాతంగా ఉంది. కంపెనీ ఇచ్చిన రుణాల్లో 99 శాతం వరకూ ఫ్లోటింగ్ రేట్ రుణాలు కావడంతో వడ్డీ రేట్లు పెరిగినా, వాటిని వినియోగదారులకు బదలాయించే వెసులుబాటు కంపెనీకి ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3–3.85 శాతం రేంజ్‌లోనే ఉంచేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ స్థాయిలో రుణ ఎగవేతలు, కలెక్షన్, రికవరీ టీమ్స్ పటిష్టంగా ఉండటం, రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, వివిధ మార్గాల ద్వారా రుణాల సమీకరణ కారణంగా నిధుల వ్యయం తగ్గుతుండటం, రుణ నాణ్యత నిలకడగా ఉండటం సానుకూలాంశాలు. టాటా కెమికల్స్ - కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.690 టార్గెట్ ధర: రూ.956 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే కిచిడి మిక్స్, చట్నీ తదితర ఐదు సెగ్మెంట్లలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. అయితే వీటిని ఆన్లైన్ ద్వారానే విక్రయిస్తోంది. టాటా సాల్ట్, టాటా సాల్ట్ లైట్, పప్పు ధాన్యాలు, శనగపిండి తదితర ఉత్పత్తులను సాధారణ కిరాణా దుకాణాల ద్వారా అందిస్తోంది. ఐ–శక్తి బ్రాండ్ కింద పప్పు ధాన్యాలను విక్రయిస్తోంది.టాటా సంపన్న్ బ్రాండ్ కింద ఐదు రకాలైన (సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, శనగపిండి, చట్నీలు, మిక్స్) ఉత్పత్తులను వివిధ వేరియంట్లలో అందిస్తోంది. మరో ఐదు రకాలైన సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. 17 లక్షల రిటైల్ అవుట్లెట్ల ద్వారా తన ఉత్పత్తులను అందిస్తోంది. ఉప్పు కాకుండా ఇతర ఉత్పత్తులతో కూడిన టాటా సంపన్న్ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. తక్కువ మార్జిన్లు వచ్చినప్పటికీ, అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత విలువాధారిత ఉత్పత్తులను కూడా అందించడం ద్వారా మార్జిన్లను పెంచుకోవాలనేది కంపెనీ వ్యూహం. టాటా కెమికల్స్ అందించే ఉత్పత్తుల ధరలన్నీ.. ఇతర కంపెనీల ఉత్పత్తుల ధరల కంటే 10–15% అధికం. కంపెనీకి కామధేనువు లాంటి సోడా యాష్, సోడియం బైకార్బొనేట్ల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెటింగ్‌పై పెట్టుబడులను రెట్టింపు చేస్తోంది. రెండేళ్లలో ఆదాయం, నికర లాభం చెరో 10% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్‌ప్రస్తుత ధర: రూ.1,621 టార్గెట్ ధర: రూ.2,025 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో మంచి వృద్ధినే కనబరిచింది. అదే జోరు రెండో క్వార్టర్లో కూడా కొనసాగవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కంపెనీ వృద్ధి అధికంగా ఉండనున్నది. పట్టణ అమ్మకాల కంటే గ్రామీణ అమ్మకాలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంటాయని అంచనా. విలువ పరంగా చూస్తే 1.3 రెట్లు అధికంగా ఉండొచ్చు. ఈ క్యూ2లో చోటు చేసుకున్న రవాణా సమ్మె, కేరళ వరదలు చెప్పుకోదగ్గ ప్రభావం చూపకపోవచ్చు. ఈ రెండు సమస్యల కారణంగా సరఫరా చైన్‌లో తలెత్తిన సమస్యలు పూర్తిగా సమసిపోయాయని చెప్పవచ్చు. రెండేళ్లలో అమ్మకాలు 6–8% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని కంపెనీ ధీమాగా ఉంది. ప్రకటనల కోసం అధికంగా వ్యయం చేస్తోంది. ఉత్పత్తుల ధరల పెంపు, వ్యయ నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ అధిక ప్రకటనల వ్యయ భారాన్ని తట్టుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో కొన్ని ఉత్పత్తుల ధరలను ఈ కంపెనీ 3–4% రేంజ్లో పెంచింది. ఆ ప్రభావం క్యూ2 ఆర్థిక ఫలితాల్లో కనిపించవచ్చు. ఆయుష్, ఇందులేఖలతో పాటు లక్స్, హమామ్, లైఫ్‌బాయ్ బ్రాండ్లలో అందుబాటులోకి తెచ్చిన నేచురల్ వేరియంట్ల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ‘విన్నింగ్ మెనీ ఇండియాస్’ వ్యూహంలో వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఉత్పత్తులను అందిస్తోంది. అవసరమైన టెక్నాలజీని అవసరమైన స్థాయిలో వినియోగిస్తోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే, అసంఘటిత రంగం నుంచి మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లుతుందనే భావన ఉండేది. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అసంఘటిత రంగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో మార్కెట్ సంఘటిత రంగానికి మళ్లలేదని చెప్పవచ్చు. దీనికి తోడు పోటీ తీవ్రత కొనసాగుతుండటం, అధిక ప్రకటనల వ్యయాల కారణంగా నిర్వహణ మార్జిన్లపై ప్రభావం పడనుండటం.. ప్రతికూలాంశాలు. హీరో మోటొకార్ప్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సెంట్రమ్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.3,166 టార్గెట్ ధర: రూ.4,009 ఎందుకంటే: ఈ కంపెనీ ఇటీవలనే 200 సీసీ కేటగిరిలో ఎక్స్ట్రీమ్ 200ఆర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లోకి ఈ బైక్ ద్వారా ఈ కంపెనీ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. రూ. 89,900(ఎక్స్ షోరూమ్) ధర గల ఈ బైక్ కారణంగా ఈ షేర్ ధర రీరేట్ కాగలదని భావిస్తున్నాం. ఈ సెగ్మెంట్లో అత్యంత చౌక అయిన బైక్ ఇదే. ఈ బైక్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. కంపెనీ బ్రాండ్ పటిష్టంగా ఉండటం, ధర చౌకగా ఉండటం వంటి కారణాల వల్ల మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లో ఈ బైక్‌తో కొంత మార్కెట్ వాటాను ఈ కంపెనీ కొల్లగొట్టగలదని భావిస్తున్నాం. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ఆపాచీ ఆర్టీఆర్ 300, ఎన్వీ బైక్‌ల ధరలతో పోల్చితే ఈ ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర 20–40% తక్కువగా ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ఇక ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్ ధర లభించే స్థాయిల్లోనే ఉన్న ఇతర కంపెనీల 150సీసీ–180 సీసీ బైక్‌లతో పోల్చితే సౌకర్యాలు, ఫీచర్లు ఎక్స్ట్రీమ్ 200ఆర్ బైక్‌లోనే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 100–125 సీసీ బైక్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు తదుపరి అప్‌గ్రేడ్ కోసం ఈ బైక్‌నే ఎంపిక చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇటీవలే తన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి క్రికెటర్ విరాట్ కోహ్లితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కోహ్లితో బ్రాండింగ్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటం... సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.520 టార్గెట్ ధర: రూ.640 ఎందుకంటే: భారత హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీ ఇది. వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు గృహ రుణాలందిస్తోంది. డెవలపర్లకు, బిల్డర్లకు నిర్మాణ రుణాలను కూడా అందిస్తోంది. మరోవైపు ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఎల్ఐసీ హౌసింగ్... హోమ్ లోన్ ఏజెంట్లతోనూ, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లతోనూ పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ రుణాలు ఈ క్యూ1లో 15 శాతం వృద్ధితో రూ.1.69 లక్షల కోట్లకు చేరాయి. ఇళ్ల తాకట్టు రుణాలు 42 శాతం, ప్రాజెక్ట్ రుణాలు 51 శాతం చొప్పున పెరగడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15 శాతం రేంజ్లో ఉండగలదని అంచనా. ఈ క్యూ1లో రుణ పంపిణీ 10 శాతం పెరిగి రూ.9,590 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ పంపిణీ 45 శాతం క్షీణించింది. పోటీ తీవ్రత పెరుగుతుండటంతో నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) స్వల్పంగా తగ్గింది. ›ప్రైమ్ లెండింగ్ రేట్(పీఎల్ఆర్)ను ఈ కంపెనీ జూన్, ఆగస్టుల్లో పెంచడంతో నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడగలదని భావిస్తున్నాం. స్థూల మొండి బకాయిలు 1.2 శాతానికి, నికర మొండి బకాయిలు 0.8 శాతానికి పెరిగాయి. అయితే ఈ క్యూ1లో రూ.40 కోట్ల మేర డెవలపర్ లోన్‌ను ఈ కంపెనీ వంద శాతం రికవరీ చేయగలిగింది. రుణ నాణ్యత మెరుగుపడగలదని కంపెనీ భావిస్తోంది. ఈ క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.980 కోట్లకు, ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.32 కోట్లకు పెరిగాయి. నికర లాభం 18 శాతం పెరిగి రూ.568 కోట్లకు పెరిగింది. రెరా అమలు కారణంగా ప్రాజెక్ట్ ఫైనాన్స్ సెగ్మెంట్ జోరు పెరుగుతుందని, ఇది ఈ కంపెనీకి ప్రయోజనకరమేనని భావిస్తున్నాం. నెస్లే ఇండియా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: 11,577 టార్గెట్ ధర: 12,000 ఎందుకంటే: కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం ద్వారా అమ్మకాలు మరింతగా పెంచుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆరోగ్య, పోషక సంబంధిత ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. కొత్త ఉత్పత్తుల కోసం తగిన స్థాయిల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇన్స్టంట్ నూడుల్స్, పాస్తా, ఇన్ఫాంట్ సెరియల్స్, టీ క్రీమర్, వైట్ అండ్ వేఫర్ చాక్లెట్స్, ఇన్స్టంట్ కాఫీ తదితర కేటగిరీల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. 2011–13 కాలంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్లాంట్ల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్య పెంపు ఫలితాలు అందడం మొదలైంది. ఫలితంగా రాబడి నిష్పత్తులు మరింతగా మెరుగపడనున్నాయి. ఆరోగ్యానికి హానికరమంటూ వార్తలు రావడంతో కంపెనీ బ్రాండ్ మ్యాగీ అమ్మకాలు గతంలో బాగా పడిపోయాయి. కంపెనీ తీసుకున్న వివిధ చర్యల కారణంగా మ్యాగీ తిరిగి తన పూర్వ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలిగింది. గత రెండేళ్లలో వివిధ కేటగిరీల్లో మొత్తం 39 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 16 శాతంగా ఉన్న ఎబిటా ఈ ఏడాది ఇదే కాలానికి 22 శాతానికి ఎగసింది. ముడి పదార్ధాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. పట్టణీకరణ వేగం పుంజుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల మాటకు విలువ పెరుగుతుండటం(ఈ కంపెనీ ఉత్పత్తులు మహిళలకు శ్రమను, కాలాన్ని తగ్గిస్తాయి) కలసి వచ్చే అంశాలు. రెండేళ్లలో ఆదాయం 13 శాతం, అమ్మకాలు 12 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. వృద్ధి జోరును పెంచడానికి ఉద్దేశించిన కన్సూమర్ క్లస్టర్ అప్రోచ్ (భారత్‌ను 15 క్లస్టర్లుగా విభజించింది) మంచి ఫలితాలనిస్తోంది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
యాక్సిస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.574 టార్గెట్ ధర: రూ.670 ఎందుకంటే: కొత్త తరం ప్రైవేట్ బ్యాంక్‌లకు సంబంధించి అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మార్చి నాటికి 3,703 బ్రాంచ్‌లతో, 13,814 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయ వృద్ధి నిలకడగా ఉండటంతో నికర లాభం రూ.701 కోట్లకు పెరిగింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా 9 శాతం) వృద్ధితో రూ.5,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13 బేసిస్ పాయింట్లు పెరిగి 3.46 శాతానికి చేరింది. కార్పొరేట్ ఫీజు ఆదాయం 24 శాతం తగ్గగా, రిటైల్ ఫీజు ఆదాయం 18 శాతం ఎగసింది. మొత్తం మీద ఫీజు ఆదాయ వృద్ధి 5 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాలు 21 శాతం, ఎస్ఎమ్ఈ రుణాలు 19 శాతం పెరగడంతో 14 శాతం రుణ వృద్ధి సాధించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా డిపాజిట్లు 1 శాతం తగ్గగా, టర్మ్ డిపాజిట్లు 13 శాతం పెరిగాయి. స్థూల, నికర మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా తగ్గాయి. మార్చి క్వార్టర్లో 6.77 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ జూన్ క్వార్టర్లో 6.52 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.4 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 83 శాతానికి ఎగసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి రుణ వృద్ధి జోరుగా పెరగవచ్చని భావిస్తున్నాం. టైర్–1 మూలధనం 13.2 శాతంగా ఉండటంతో వృద్ధికి తగిన పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఇతర కార్పొరేట్ బ్యాంక్‌లతో పోల్చితే రుణ నాణ్యత మెరుగుపడటం, మార్జిన్లు బాగా వచ్చే రిటైల్ రుణాలపై బ్యాంక్ దృష్టి పెట్టటం సానుకూలాంశాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.965 టార్గెట్ ధర: రూ.1,155 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. మెరుపులూ లేవు. అలాగని నిరాశాజనకంగానూ లేవు. అయితే డీల్స్ సాధించడం, భవిష్యత్తు ఆదాయ అంచనాలు ఆశావహంగా ఉన్నాయి. ఆదాయం 3 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9 శాతం) వృద్ధితో 205.5 కోట్ల డాలర్లకు పెరిగింది. పన్ను రేట్లు తక్కువగా ఉండటంతో సవరించిన నికర లాభం రూ.2,403 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో అత్యధిక డీల్స్(27) సాధించింది. కంపెనీ చరిత్రలో అత్యధిక డీల్స్ సాధించిన క్వార్టర్ ఇదే. మరిన్ని భారీ డీల్స్ రానున్న క్వార్టర్లలో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం మళ్లీ పుంజుకుంటోంది. డిజిటల్ విభాగం మంచి జోరు సాధించింది. హెల్త్‌కేర్, లైఫ్–సైన్సెస్, పబ్లిక్ సర్వీసెస్ విభాగాలు మినహా ఇతర విభాగాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.6 శాతం నుంచి 11.5 శాతం రేంజ్లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇబిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19.7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
సియట్ బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,390 టార్గెట్ ధర: రూ.1,899 ఎందుకంటే: ఆర్పీ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో అతి పెద్ద టైర్ల కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ అన్ని రకాల టైర్లను–ట్రక్, బస్సు, టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, తేలిక రకం వాణిజ్య వాహనాలు, వ్యవసాయ, స్పెషాల్టీ టైర్లను తయారు చేస్తోంది. అమ్మకాల్లో రీప్లేస్మెంట్ మార్కెట్ వాటా 61%, ఎగుమతులు 12 %గా ఉన్నాయి. 4,500 మంది డీలర్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 15% వృద్ధితో రూ.1,670 కోట్లకు పెరిగింది. టైర్ల అమ్మకాలు 18% పెరిగాయి. టూ వీలర్ల సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ల టైర్ల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చింది. స్థూల మార్జిన్ 5% ఎగసి 38.6%కి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, స్వల్పంగా (25 బేసిస్ పాయింట్లు) తగ్గింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ముడి పదార్థాల ధరలు 2 శాతం పెరిగినప్పటికీ, ఇబిటా 223 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరింది. నికర లాభం 307 శాతం వృద్ధితో రూ.78 కోట్లకు చేరింది. వచ్చే క్వార్టర్లో ముడి పదార్థాల ధరలు మరో 2–3 శాతం మేర పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.870 కోట్లుగా ఉన్న రుణభారం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది జూన్ నాటికి రూ.750 కోట్లకు తగ్గింది. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటంతో టైర్ల ధరలను ఈ కంపెనీ 1–2 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ముడి చమురు, రబ్బరు ధరలు మరింతగా పెరిగితే మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏబీబీ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ అమ్మొచ్చు ప్రస్తుత ధర: రూ.1,184 టార్గెట్ ధర: రూ. 990 ఎందుకంటే: విద్యుత్ ప్రసార, పంపిణీ, ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇబిటా మార్జిన్ 7.8% ఉండొచ్చని అంచనా వేయగా 7.2% మాత్రమే సాధించగలిగింది. ఇబిటా 33% వృద్ధితో రూ.196 కోట్లకు చేరింది. అయితే రూ.210 కోట్ల ఇబిటా సాధిస్తుందని అంచనాలున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల ఇబిటా అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ. 100 కోట్లకు చేరింది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,710 కోట్లకు పెరిగింది. కంపెనీ ఫలితాల్లో ఇదొక్కటే అంచనాలను అందుకోగలిగింది. స్థూల మార్జిన్ 2.7% తగ్గి 33.5%కి చేరింది. ఈ కంపెనీ నికర దిగుమతిదారు కాబట్టి రూపాయి పతనం ప్రతికూల ప్రభావం(ఈ క్యూ2లో రూ.10 కోట్ల ఫారెక్స్ నష్టాలు వచ్చాయి) చూపించడం, ముడి పదార్థాల ధరలు పెరగడం.. ఈ మూడు కారణాల వల్ల స్థూల మార్జిన్ తగ్గింది. సోలార్, రైల్, డిజిటలైజేషన్ వంటి కొత్త రంగాలపై దృష్టి కారణంగా ఆర్డర్లు 7% పెరిగి రూ.2,500 కోట్లకు చేరాయి. అయితే ఈ కంపెనీ ఈ క్యూ2లో భారీ ఆర్డర్లను ఏమీ సంపాదించలేకపోయింది. మార్జిన్లు తక్కువగా ఉండే ప్రాజెక్ట్ వ్యాపారం అమ్మకాలు అధికంగా ఉండటం, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం కారణంగా కంపెనీ ఆదాయ అంచనాలను ప్రస్తుత ఏడాదికి 8%, వచ్చే సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాం. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సర్వీస్ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సాకారం కావడానికి దీర్ఘకాలం పడుతుంది. ఈ షేర్ విలువ అధికంగా ఉందనే ఉద్దేశంతో అమ్మేయండి అనే రేటింగ్‌ను ఇస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఇండస్ఇండ్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్‌రాఠి సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,923 టార్గెట్ ధర: రూ.2,248 ఎందుకంటే: ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. తాజా మొండి బకాయిలు 1 శాతం తగ్గాయి. రుణ వ్యయాలు కూడా తగ్గాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఈ బ్యాంక్ రుణ నాణ్యత మరింతగా మెరుగుపడుతుందని భావిస్తున్నాం. కార్పొరేట్ రుణాలు 30 శాతం, వాహన, రిటైల్ రుణాలు 28 శాతం చొప్పున వృద్ధి చెందడంతో మొత్తం రుణ వృద్ధి 29 శాతానికి పెరిగింది. మధ్య కాలానికి బ్యాక్ రుణ వృద్ధి 26 శాతం రేంజ్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. 2008–18 కాలానికి ఇతర(వడ్డీయేతర) ఆదాయం 32 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందింది. మొత్తం ఆదాయంలో ఇతర ఆదాయం 28 శాతంగాఉంది. ఈ క్యూ1లో ట్రేడింగ్ ఆదాయం 29 శాతం తగ్గినా, ఇతర ఆదాయం 12 శాతం పెరిగింది. ప్రస్తుతం 60:40గా ఉన్న కార్పొరేట్, రిటైల్ రుణ నిష్పత్తిని 50:50 శాతంగా రీబ్యాలన్స్ చేయాలని, రిటైల్ రుణాలపై మరింతగా దృష్టి పెట్టాలని బ్యాంక్ యోచిస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో మంచి వృద్ధి అవకాశాలున్నాయి. ఈ క్యూ1లో నికర వడ్డీ మార్జిన్ 3.92 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాలు పెరుగుతుండటం, కాసా నిష్పత్తి (43.4 శాతంగా)పటిష్టంగా ఉండటంతో నికర వడ్డీ మార్జిన్ ఈ స్థాయి కంటే తగ్గకపోవచ్చు. కాసా నిష్పత్తి పటిష్టంగా ఉండటంతో రుణ వ్యయాలు తగ్గవచ్చు. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్ విలీనం సానుకూలాంశమే. కార్పొరేట్ రుణాల్లో తాజా మొండి బకాయిలు పెరిగే అవకాశాలు, భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ విలీనాంతరం సూక్ష్మ రుణ విభాగం నుంచి ఎదురయ్యే సమస్యల కారణంగా రుణ నాణ్యత తగ్గే అవకాశాలు... ఈ రెండు అంశాలు ప్రతికూలాంశాలు. గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.1,313 టార్గెట్ ధర: రూ.1,435 ఎందుకంటే: టాయ్‌లెట్ సోప్, హౌస్‌హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్, హెయిర్ కలర్ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీల్లో ఒకటి. హెయిర్ కలర్ సెగ్మెంట్లో అగ్రస్థానం ఈ కంపెనీదే. వివిధ రేంజ్ ధరల్లో విస్తృతమైన ఉత్పత్తులనందిస్తోంది. సబ్బుల మార్కెట్లో హిందుస్తాన్ యూనీలివర్ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. గోద్రేజ్ నంబర్ 1, సింథాల్, ఫెయిర్ గ్లో వంటి బ్రాండ్లతో 10–12 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీ సాధించింది. హౌస్‌హోల్డ్ ఇన్సెక్టిసైడ్స్ సెగ్మెంట్లో మూడు కేటగిరీల్లోనూ ఈ కంపెనీదే అగ్రస్థానం. అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరణలో భాగంగా వివిధ దేశాల్లో వివిధ కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి జోరు కొనసాగుతుందని కంపెనీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన పవర్ చిప్ మంచి అమ్మకాలు సాధిస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది. అంతర్జాతీయ వ్యాపారం రికవరీ అవుతుండటంతో రాబడి నిష్పత్తుల పెంపుపై కంపెనీ దృష్టి సారిస్తోంది. గోద్రేజ్ నంబర్ 1 సోప్‌ను తూర్పు ప్రాంతంలో, సింధాల్ సోప్‌కు సౌత్ మార్కెట్లోకి మరింతగా విస్తరించడం ద్వారా మార్కెట్ వాటా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి క్వార్టర్లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు కలసివచ్చే అంశం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 39 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఏడాది కాలంలో ఈ షేర్ వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 45 రెట్ల ధరకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రతికూలాంశాల పరంగా చూస్తే, వర్షాలు సరిగ్గా కురవకపోతే గ్రామీణ డిమాం డ్ తగ్గవచ్చు. రూపాయి, ఇండోనేషియా కరెన్సీ రూపయ్యా, అర్జెంటీనా పెసోలు బలహీనపడుతుండటం వల్ల లాభదాయకత తగ్గవచ్చు. ఐటీసీ, హెచ్‌యూఎల్, విప్రోల నుంచి సబ్బుల సెగ్మెంట్లో తీవ్ర పోటీ.. మార్కెట్ వాటాపై ప్రభావం చూపవచ్చు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
టాటా స్టీల్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ..554 టార్గెట్ ధర: రూ.903 ఎందుకంటే: 1907లో ఆరంభమైన ఈ కంపెనీ ఆసియాలోనే తొలి ఉక్కు ఫ్యాక్టరీ, భారత్‌లో రెండో అతి పెద్ద స్టీల్ కంపెనీ. యూరప్‌లోని కోరస్ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఆరో స్టీల్ కంపెనీగా అవతరించింది. తక్కువ ఖర్చుతో ఉక్కును తయారు చేసే కొన్ని ఉక్కు కంపెనీల్లో ఇది ఒకటి. చైనాలో ఉక్కు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్య విస్తరణపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశమే. టాటా స్టీల్‌కు ఒడిశాలోని కళింగనగర్ ప్లాంట్ ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఒక్కో టన్ను ఉక్కు ఉత్పత్తిపై రూ.10,000–11,000 నిర్వహణ లాభం వస్తుందని అంచనా. అనేక అనిశ్చితిలకు ముగింపు పెడుతూ థిసన్క్రప్ యూరప్ కార్యకలాపాలు టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాల విభాగంలో విలీనమవుతున్నాయి. ఈ విలీనంపై ఇప్పటిదాకా నీలినీడలు కమ్ముకోవడంతో గత కొన్ని వారాలుగా ఈ షేర్ క్షీణిస్తూ వస్తోంది. టాటా స్టీల్, థిసన్క్రప్ కంపెనీల యూరప్ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లో టాటా స్టీల్యూరప్కు చెందిన 250 కోట్ల యూరోల రుణ భారాన్ని బదిలీ చేసే అంశంపై అనిశ్చితి నెలకొన్నది. అయితే ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్నే ఇరు సంస్థలు ఖరారు చేశాయి. ఈ విలీనం వల్ల 40–50 కోట్ల యూరోల ప్రయోజనం లభిస్తుందని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. ఈ విలీనం వల్ల ఏర్పడే థిసన్క్రప్ టాటా స్టీల్ జేవీ యూరోప్ ఉక్కు మార్కెట్లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరిస్తుంది. మరోవైపు థిసన్క్రప్ కంపెనీ 400 కోట్ల యూరోల విలువైన ఆస్తులను ఈ జేవీకి బదిలీ చేస్తుంది. యూరప్ కార్యకలాపాల విషయానికొస్తే, ఉద్యోగుల పింఛన్ సంబంధిత సమస్యలు పరిష్కారం కానున్నాయి. పునర్వ్యస్థీకరణ ప్రయత్నాలు ఫలాలనివ్వనున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, చైనా నుంచి సరఫరాల అంచనాలు మారడం.. ప్రతికూలాంశాలు. బాటా ఇండియా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.830 టార్గెట్ ధర: రూ.871 ఎందుకంటే: ప్రపంచంలో రెండో అతి పెద్ద ఫుట్‌వేర్ మార్కెట్‌గా భారత్ నిలుస్తోంది. భారత ఫుట్‌వేర్ మార్కెట్లో అతి పెద్ద రిటైల్ కంపెనీగా బాటా ఇండియా అవతరించింది. భారత్‌లో వార్షిక పాదరక్షల ఉత్పత్తి ప్రస్తుతం 250 కోట్ల జతలుగా ఉంది. ఈ ఉత్పత్తి మరో రెండేళ్లలో 400 కోట్ల జతలకు పెరగవచ్చని అంచనా. బాటా కంపెనీ స్టోర్స్ అమ్మకాలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. మరోవైపు కొత్తగా స్టోర్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. చిన్న నగరాల్లో కొత్త స్టోర్స్ ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 7 శాతం వృద్ధితో 632 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు, నికర లాభం 45 శాతం వృద్ధితో రూ.52 కోట్లకు ఎగిశాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.2,634 కోట్లకు, నిర్వహణ లాభం 26 శాతం వృద్ధితో రూ.351 కోట్లకు, నికర లాభం 39 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు పెరిగాయి. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉండటం, కొత్త ప్రచార కార్యకలాపాలు, స్టోర్స్‌లోనే కాకుండా ఆన్లైన్లో కూడా అమ్మకాలు పెంచుకునే పటిష్టమైన మార్కెటింగ్ ప్రయత్నాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందింది. గత ఐదేళ్లలో కంపెనీ ఆదాయం 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీ రాబడి నిష్పత్తులు పటిష్టంగా ఉన్నాయి. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
రెప్కో హోమ్ ఫైనాన్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ.573 టార్గెట్ ధర: రూ.835 ఎందుకంటే: రెప్కో బ్యాంక్ ప్రమోటర్‌గా ఉన్న రెప్కో హోమ్ ఫైనాన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రుణ మంజూరీ 30 శాతం వృద్ధితో రూ.920 కోట్లకు పెరగ్గా, రుణ పంపిణి 28 శాతం వృద్ధితో రూ.850 కోట్లకు పెరిగాయి. నిర్వహణ ఆస్తులు 10 శాతం ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు క్వార్టర్లలో అంతంతమాత్రంగా ఉన్న కంపెనీ పనితీరు నాలుగో క్వార్టర్లో పుంజుకుంది. రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 3.2 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 2.9 శాతానికి తగ్గాయి. రుణ రికవరీపై దృష్టి పెట్టడం, పెద్ద మొత్తాల రుణాల జారీకి దూరంగా ఉండటం వల్ల స్థూల మొండి బకాయిలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి 11 రాష్ట్రాల్లో 129 కార్యాలయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పట్టించుకోని చిన్న నగరాలు, చిన్న పట్టణాల్లోని వేతన, స్వయం ఉపాధి కేటగిరి వినియోగదారులపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రెండేళ్లలో నికర లాభం 17–18 శాతం రేంజ్లో, ఆదాయం 18–20 శాతం రేంజ్లో చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. అలాగే రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 2.4 శాతానికి, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 17 శాతానికి పెరుగుతాయని భావిస్తున్నాం. కంపెనీ కార్యకలాపాలు అధికంగా ఉన్న తమిళనాడులో రిజిస్ట్రేషన్ సంబంధిత సమస్యలు సమసిపోవడం, అందుబాటు ధరల గృహాలకు డిమాండ్ పెరుగుతుండటం సానుకూలాంశాలు. రియల్ ఎస్టేట్ రంగం మందగించడం, నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) నిబంధనలను కఠినతరం చేయడం...ఈ అంశాలు చోటు చేసుకుంటే, కంపెనీ వృద్ధి, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.505 టార్గెట్ ధర: రూ.725 ఎందుకంటే: కొచ్చిన్ షిప్‌యార్డ్...నౌక నిర్మాణ ప్రభుత్వ రంగ కంపెనీ. నౌక నిర్మాణం, రిపేర్ల రంగాల్లో గుత్తాధిపత్యం ఉన్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. షిప్‌బిల్డింగ్ సెగ్మెంట్ ఇబిటా మార్జిన్లు సాధారణంగా 8–15 శాతం రేంజ్లో ఉంటాయి. కానీ ఈ కంపెనీ 27 శాతం మార్జిన్లు సాధించింది. షిప్ రిపేర్ సెగ్మెంట్ ఇబిటా మార్జిన్లు సాధారణంగా 25–35 శాతం రేంజ్లో ఉంటాయి. కానీ ఈ కంపెనీ 18 శాతం మార్జిన్లు మాత్రమే సాధించగలిగింది. ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.601 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో 5.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.115 కోట్లకు పెరిగింది. ఇక నికర లాభం 122 శాతం వృద్ధితో రూ.92 కోట్లకు ఎగిసింది. ఒక్కో షేర్‌కు రూ.12 డివిడెండ్‌ను ప్రకటించింది. షిప్ రిపేర్ సెగ్మెంట్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.623 కోట్లకు చేరింది. ఇప్పటికే యుద్ధవాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రిపేర్ ఆర్డర్లను సాధించడం, కొత్తగా ఆయిల్ రిగ్‌ల రిపేర్లను కూడా చేపట్టటం, షిప్ రిపేర్ల ప్లాంట్ల నిర్వహణ నిమిత్తం ముంబై, కోల్‌కత పోర్ట్ ట్రస్ట్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఇదే జోరు రానున్న రెండేళ్లలో కొనసాగనున్నది. జల రవాణా, కోస్టల్ షిప్పింగ్ వెస్సల్స్ తదితర రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గాను ఇటీవలనే హూగ్లీ డాక్ అండ్ పోర్ట్ ఇంజనీర్స్ సంస్థతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ జేవీ కోసం రూ.100 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇతర అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మూడేళ్లలో రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. నికర రుణ భారం రూ.123 కోట్లుగా, నగదు నిల్వలు రూ.3,500 కోట్లుగా.. కంపెనీ బ్యాలన్స్ షీట్ పటిష్టంగా ఉంది. కంపెనీ ఆర్డర్ బుక్ రూ.2,112 కోట్లుగా ఉంది. రెండేళ్లలో కనీసం రూ.18,950 కోట్ల ఆర్డర్లు సాధించే అవకాశాలున్నాయి. ఈ ఆర్డర్ల కారణంగా మూడేళ్లలో షిప్ బిల్డింగ్ సెగ్మెంట్ 19 శాతం, షిప్ రిపేర్ వ్యాపారం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. రెండేళ్లలో ఆదాయం 16 శాతం, నిర్వహణ లాభం 19 శాతం, నికర లాభం 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్) - అమ్మొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,454 ; టార్గెట్ ధర: రూ.900 ఎందుకంటే: డీ మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కానీ లైక్–ఫర్–లైక్ గ్రోత్ మాత్రం క్షీణించింది. ఆదాయం 22% వృద్ధితో రూ.3,810 కోట్లకు, ఇబిటా 42% వృద్ధితో రూ.290 కోట్లకు పెరిగాయి. ఇబిటా మార్జిన్ 1 శాతం వృద్ధితో 7.7 శాతానికి పెరిగింది. నికర లాభం 73 శాతం వృద్ధితో రూ.160 కోట్లకు ఎగసింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.15,000 కోట్లకు ఇబిటా 39% వృద్ధితో రూ.1,330 కోట్లకు, నికర లాభం 63 శాతం వృద్ధితో రూ.780 కోట్లకు పెరిగాయి. 2016–17లో 131గా ఉన్న మొత్తం స్టోర్స్ సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి 155కు పెరిగింది. అయితే లైక్ ఫర్ లైక్ గ్రోత్(ఎల్ఎఫ్ఎల్–రిటైల్ కంపెనీల వృద్ధిని కొలిచే కీలకమైన కొలమానాల్లో ఇది ఒకటి. ఈ విధానంలో గత ఏడాదిలో ఉన్న స్టోర్స్ అమ్మకాలను ఈ ఏడాదిలో ఉన్న స్టోర్స్ అమ్మకాలతో (కొత్తగా ఏర్పాటైన స్టోర్స్ అమ్మకాలను పరిగణనలోకి తీసుకోరు)పోల్చుతారు . 2016–17లో 21.2%గా ఉన్న లైక్ –ఫర్–లైక్ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 14.2%కి పడిపోయింది. జీఎస్టీ అమలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దీనికి కారణాలు. రెండేళ్లలో ఆదాయం 26%, నికర లాభం 32% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన)కు 86 రెట్ల ధరకు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 65 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. ఇది చాలా ఖరీదు. కజారియా సిరామిక్స్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.540; టార్గెట్ ధర: రూ.690 ఎందుకంటే: సెరామిక్, విట్రిఫైడ్ టైల్స్ తయారీలో అగ్ర స్థానంలో ఉన్న కజారియా సిరామిక్స్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కూడా నిరాశమయమైన ఫలితాలను వెల్లడించింది. ఆదాయం 4 శాతమే వృద్ధి చెందింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటంతో ఇబిటా మార్జిన్ 2 శాతం తగ్గి 16%కి పడిపోయింది. గ్లేజ్డ్ వెట్రిఫైల్ టైల్స్(జీవీటీ) ధరల్లో ఒత్తిడి, పోటీ తీవ్రంగా ఉండటం వంటి కారణాల వల్ల ఇబిటా రూ.120 కోట్లకు, నికర లాభం రూ.66 కోట్లకు పరిమితమయ్యాయి. ఇ–వే బిల్లు అమలు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 12–15% రేంజ్లో పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. గ్యాస్ ధరలు పెరుగుతుండటం, పోటీ తీవ్రమవుతుండటం వంటి కారణాల వల్ల మార్జిన్ 16–18% రేంజ్‌లోనే ఉండగలవని కంపెనీ భావిస్తోంది. జీఎస్టీ సమర్థవంతంగా అమలైతే సంఘటిత రంగంలోని ఇలాంటి కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. టైల్స్ రంగంలో అగ్రస్థానంలో ఉండటం, పటిష్టమైన నగదు నిల్వలు, రాబడి నిష్పత్తులు ఉన్నత స్థాయిలో ఉండటం(రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్–ఆర్ఓసీఈ 30%), ఏడు జాయింట్వెంచర్లలో ఒక్కో దాంట్లో ఈక్విటీ వాటాను 51% మేర పెంచుకోనుండటం, విస్తృతమైన ఉత్పత్తుల రేంజ్, పటిష్టమైన డీలర్ల నెట్వర్క్... ఇవన్నీ సానుకూలాంశాలు. రియల్టీ రంగం వృద్ధి మందగించే అవకాశాలు, పోటీ తీవ్రత పెరుగుతుండటం, టైల్స్ తయారీలో కీలకమైన నేచురల్ గ్యాస్ ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం, చైనా నుంచి చౌక టైల్స్ డంప్ అయ్యే అవకాశాలు... ప్రతికూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
హీరో మోటొకార్ప్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.3,660 టార్గెట్ ధర: రూ.4,052 ఎందుకంటే: మార్కెట్ వాటా పరంగా అతి పెద్ద భారత టూ వీలర్ కంపెనీ అయిన హీరో మోటొకార్ప్..గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,560 కోట్లకు, నికర లాభం 35 శాతం వృద్ధితో రూ.970 కోట్లకు పెరిగాయి. స్థూల మార్జిన్ 32.4 శాతంగా ఉండగా, మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండటంతో ఇబిటా మార్జిన్ 16 శాతంగానే నమోదైంది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో రెండు సార్లు ధరలు పెంచింది. హరిద్వార్ ప్లాంట్‌పై వస్తున్న పన్ను రాయితీల కాలం ముగిసింది. ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నుంచి కనిపిస్తుంది. హలోల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుబాటులోకి రానున్న ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ ఈ ప్రభావాన్ని కొంత వరకూ తగ్గించగలవు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. ఐదేళ్లలో ఈ కంపెనీ వాహన విక్రయాలు 9–10 శాతం రేంజ్లో చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 3.5 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. పటిష్టమైన డీలర్షిప్ నెట్వర్క్, గ్రామీణ మార్కెట్లలోకి విస్తృతంగా చొచ్చుకుపోవడం, వేగంగా వృద్ధి చెందుతున్న స్కూటర్ల, ప్రీమియమ్ బైక్ సెగ్మెంట్లలో మరిన్ని కొత్త మోడళ్ల ద్వారా విక్రయాల వృద్ధి పెరగనుండడం, గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, లీప్ 20 కార్యక్రమంలో భాగంగా వ్యయ నియంత్రణ చర్యలు మంచి ఫలితాలనిస్తుండటం.. సానుకూలాంశాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.930 టార్గెట్ ధర: రూ.1,000 ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.13,179 కోట్లకు పెరగ్గా, నికర లాభం రూ.2,227 కోట్లుగా నమోదైంది. సాధారణంగా క్యూ4లో సాఫ్ట్వేర్ బిజినెస్ బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రయోజనాలతో 19.6 శాతం ఇబిటా మార్జిన్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మార్జిన్ 19.5–20.5 శాతంగా ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఆదాయం వృద్ధి, అమెరికాలో కంటే యూరప్, ఇతర దేశాల్లో (ఆర్ఓడబ్ల్యూ) అధికంగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయ వృద్ధి యూరప్‌లో 3.6 శాతం, ఆర్ఓడబ్ల్యూలో 8.1 శాతంగా ఉంది. అమెరికాలో 0.7 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.5–11.5శాతం రేంజ్లో రాగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఒక రకంగా ఇది బలహీనమైన ‘గైడెన్స్’. కొత్తగా వస్తున్న టెక్నాలజీస్–డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తదితర సెగ్మెంట్లలలో తన స్థితిని పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. వివిధ క్లయింట్లతో కుదుర్చుకునే డీల్స్ సైజు పెరగగలదని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ ఏడాది మార్చి చివరి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు 157 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ డివిడెండ్‌ను ఇవ్వడం ఇది వరుసగా 61వ క్వార్టర్. -
స్టాక్స్ వ్యూ
స్పైస్‌జెట్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ప్రస్తుత ధర: 138 టార్గెట్ ధర: రూ. 166 ఎందుకంటే: వివిధ ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించుకుంది. కొత్త ప్రమోటర్ సారధ్యంలో టర్న్ అరౌండ్ సాధించిన ఈ కంపెనీ వరుసగా 12 క్వార్టర్ల పాటు లాభాలు(రూ.1,400 కోట్ల మేర) కళ్లజూసింది. రెండేళ్లలో రూ.200 కోట్ల రుణ భారం తగ్గించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి నికర నగదు కంపెనీగా నిలుస్తామని, 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.250 కోట్ల నగదు నిల్వలు సమకూర్చుకోగలమని కంపెనీ అంచనా వేస్తోంది. ఇప్పటిదాకా సాధారణ స్థాయికి రావడంపై దృష్టి పెట్టిన ఈ కంపెనీ ఇప్పుడు వృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ కంపెనీ విమాన ట్రాఫిక్ 22% పెరిగింది. ఉడాన్ స్కీమ్ వల్ల విమాన ట్రాఫిక్ మరింతగా పెరగగలదని అంచనా. చమురు ధరలు మెల్లమెల్లగా పెరుగుతుండటంతో దీనిని ఎదుర్కొనడానికి 8–9% రేంజ్లో వ్యయ నియంత్రణ సాధించే ప్రయత్నాలు చేస్తోంది. విస్తరణ కోసం విమానాల సంఖ్యను పెంచుకుంటోంది. లాభదాయకతలో మంచి వృద్ధి ధీమాతోనే ఈ కంపెనీ 205 విమానాలకు ఆర్డర్ చేసింది. వీటి డెలివరీ ఈ ఆగస్టు నుంచి మొదలవుతుంది. తక్కువ మెయింటెనెన్స్, ఇంధన ఆదాల కారణంగా నిర్వహణ వ్యయాలు 15% తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. 2017–20 కాలానికి ఒక్కో షేర్‌పై వచ్చే రాబడి(ఈపీఎస్) 37 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని భావిస్తున్నాం. కెపాసిటీకి తగ్గట్లుగా డిమాండ్ పెరుగుతుండడం, దేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం, ఎగువ మధ్య తరగతి మరింతగా విస్తరిస్తుండడం, ట్రావెల్, టూరిజమ్ మరింతగా పెరుగుతుండటం, విమానాశ్రయాల విస్తరణ.. ఇవన్నీ సానుకూలాంశాలు. మాజీ ప్రమోటర్లతో వారంట్ల వివాదం కొనసాగుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం ప్రతికూలాంశాలు. ఆర్బీఎల్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: 494 టార్గెట్ ధర: రూ. 650 ఎందుకంటే: ఒక ప్రాంతీయ స్థాయి రుణ సంస్థ నుంచి నవీన తరం సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందుతోంది. వ్యవసాయ రుణాల కారణంగా రుణ నాణ్యతలో సమస్యలు, సూక్ష్మ రుణాలకు సంబంధించిన వడ్డీ వ్యయాలు,..ఇలాంటి సమస్యలు రానున్న క్వార్టర్లలో తగ్గిపోవచ్చని యాజమాన్యం ధీమాగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 5.2%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలో 1%కి పడిపోవచ్చని అంచనా. అలాగే రుణ వృద్ధి 30–35 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నాం. క్రెడిట్ కార్డ్ బిజినెస్ మంచి వృద్ధి సాధిస్తోంది. క్రెడిట్ కార్డ్ సంబంధిత స్థూల మొండి బకాయిలు గత క్యూ3లో 1.1%గానే ఉన్నాయి. పరిశ్రమ సగటు(1.5–1.8%)తో పోల్చితే ఇది మెరుగైన స్థాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పది లక్షల క్రెడిట్ కార్డ్‌లు జారీ చేయాలని, 4–5 ఏళ్లలో క్రెడిట్ కార్డ్‌ల రంగంలో 4/5వ స్థానాన్ని సాధించాలని లక్ష్యాలుగా పెట్టుకుంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. డిపాజిట్ల రేట్ల తగ్గింపు, కాసా నిష్పత్తి మెరుగుపడడం, నిధుల సమీకరణ వ్యయం తక్కువగా ఉండనుండటం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) 3.9% రేంజ్లో కొనసాగించగలమని బ్యాంక్ భావిస్తోంది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయని భావిస్తున్న ఈ బ్యాంక్ 12–18 నెలల్లో రీఫైనాన్సింగ్ అవకాశాలు బాగా ఉంటాయని అంచనా వేస్తోంది. 15 ఏళ్ల కాలం పాటు ఉండే మౌలిక రంగ రుణాలను కాకుండా 2–3 ఏళ్ల కాలపరిమితి ఉండే మౌలిక రంగ రుణాలనే ఇవ్వనున్నది. రుణ వృద్ధి పరిశ్రమతో పోల్చితే 3–4 రెట్లు అధికంగా ఉండనుండటం, ఫీజు ఆదాయం పెరగనుండటం, తక్కువ వడ్డీ చెల్లించే డిపాజిట్ల సమీకరణ, రిటైల్ రుణాలు పెరుగుతుండడం.. సానుకూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
సన్ ఫార్మా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.502; టార్గెట్ ధర: రూ.600 ఎందుకంటే: దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా షేర్ ఇటీవల బాగానే పతనమైంది. సంస్థ 52 వారాల కనిష్ట–గరిష్ట స్థాయిలు రూ.432.70–రూ.709.65. తాజాగా ఈ కంపెనీకి చెందిన హలోల్ ప్లాంట్‌పై మళ్లీ తనిఖీ నిర్వహించిన అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ) మూడు అభ్యంతరాలను వెలిబుచ్చింది. ప్లాంట్ పరికరాలు, ఉద్యోగుల శిక్షణ, ఇంక్యుబేషన్ టెంపరేచర్ వంటి అంశాలపై ఈ అభ్యంతరాలు... సహజమైన విషయాలే కాబట్టి, వీటిని సులభంగా పరిష్కరించవచ్చు. 2016 నాటి తనిఖీలో అమెరికా ఎఫ్‌డీఏ వ్యక్తం చేసిన తొమ్మిది పరిశీలనలతో పోల్చితే తాజా పరిశీలనలు మూడో వంతుకు తగ్గాయి. ఇది కంపెనీకి ఊరటనిచ్చే విషయం. ఈ సమస్యలు సమసిపోతే, ఈ ప్లాంట్ నుంచి ఈ కంపెనీ చాలా కాంప్లెక్స్ జనరిక్స్ ఔషధాలను అమెరికా మార్కెట్లో విడుదల చేయగలుగుతుంది. అంతేకాక అమెరికా మార్కెట్లో ప్రస్తుతమున్న ఔషధాలను పునర్వ్యవస్థీకరించగలుగుతుంది. ఈ ప్లాంట్‌కు క్లియరెన్స్ పొందలేకపోతే, ఔషధాల ఆమోదాల్లో జాప్యం కారణంగా ఈ కంపెనీ చాలా మంచి అవకాశాలను కోల్పోతుంది. మరోవైపు ఇదే ప్లాంట్‌పై 2015లో జారీ అయిన వార్నింగ్ లెటర్ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయని మేం భావిస్తున్నాం. కరూర్ వైశ్యాబ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: సెంట్రమ్ ప్రస్తుత ధర: రూ.99; టార్గెట్ ధర: రూ.123 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రికవరీ కనిపించినా, మూడో క్వార్టర్లో మాత్రం ఈ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. అయితే రుణాలు 17 శాతం వృద్ధి చెందడం గమనించదగ్గ అంశం. 2015–17 క్యూ2 తర్వాత రుణ వృద్ధి ఇంత అధికంగా ఉండడం ఇదే మొదటిసారి. స్థూల మొండి బకాయిలు 1 శాతం పెరిగి 6 శాతానికి, నికర మొండి బకాయిలు 0.6 శాతం వృద్ధితో 3.88 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం ఫ్లాట్‌గా 8.5 శాతంగా నమోదైంది. ఇతర ఆదాయం 32% వృద్ధి చెందడంతో కేటాయింపులకు ముందు లాభం 28% ఎగిసింది. కేటాయింపులు పెరగడంతో నికర లాభం 38% తగ్గిపోయింది. వ్యాపారం 9% వృద్ధితో రూ.1,01,955 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 4% వృద్ధితో రూ.16,024 కోట్లకు ఎగిశాయి. మొండి బకాయిలు పెరుగుతున్నాయని, రానున్న రెండు క్వార్టర్లూ బలహీనంగా ఉంటాయని బ్యాంక్ అంటోంది. లాభదాయకత తక్కువ స్థాయిలో ఉండొచ్చు. భవిష్యత్తులో మొత్తం రుణాల్లో చిన్న స్థాయి రిటైల్ రుణాలు 70–80% మేర పెంచుకోవాలనేది బ్యాంక్ లక్ష్యం. ఫలితంగా రుణ డిఫాల్ట్‌లు తగ్గుతాయని, మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడుతుందని బ్యాంక్ భావన. రెండేళ్లలో వ్యాపారం 18% చొప్పున చక్రగతి వృద్ధితో రూ.1,48,338 కోట్లకు పెరుగుతాయని అంచనా. -
స్టాక్స్ వ్యూ
పేజ్ ఇండస్ట్రీస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.21,451 టార్గెట్ ధర: రూ.27,490 ఈ కంపెనీ పురుషుల, మహిళల లోదుస్తులు, స్పోర్ట్స్ వేర్లను అందిస్తోంది. ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్స్(ఈబీఓ)లను వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలోనే 80కు పైగా ఈబీఓలను ప్రారంభించనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 ఈబీఓలను అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది మార్చి నాటికి 360గా ఉన్న ఈబీఏలను వచ్చే ఏడాది మార్చి కల్లా 1,000 కు పెంచాలనేది కంపెనీ లక్ష్యం. ఈ ఈబీఏల ఏర్పాటు ఇటు కంపెనీకి, అటు ప్రాంఛైజీ సంస్థలకు కూడా ప్రయోజనకరమైనదే. ఇంత భారీగా ఈబీఓల విస్తరణ....అమ్మకాల వృద్ధి పట్ల ప్రాంచైజీలకు, కంపెనీకి గల ధీమాను సూచిస్తోంది. మొత్తం అమ్మకాల్లో ఈబీఓల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 40 శాతంగా ఉండనున్నది. 2017–20 కాలానికి రూ.200 కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. మూలధన ప్రణాళికల్లో భాగంగా అనంతపురం, ఓడిశాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 16–17 శాతంగా ఉన్న అవుట్ సోర్సింగ్ మాన్యుఫాక్చరింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 35 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. డిమాండ్ బాగా ఉండడమే దీనికి కారణం. డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను ప్రతి ఏడాది 10 శాతం చొప్పున పెంచుతోంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు పోటీ చాలా తక్కువగా ఉంది. వ్యాన్ హ్యూసెన్ కంపెనీ ఉత్పత్తులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మొత్తం అమ్మకాలు 2.6 శాతంగా ఉన్న ఆన్లైన్ అమ్మకాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. ఆర్థిక స్థితిగతుల పరంగా ట్రాక్‌రికార్డ్ చాలా బాగా ఉంది. వృద్ది, ఈపీఎస్ ప్రతి ఏడాదీ 15 శాతం కంటే ఎప్పుడూ తక్కువ వృద్ధి సాధించలేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్(ఆర్ఓసీఈ) 40 శాతంగా ఉంది. ఇప్పటిదాకా మహిళ, పురుషుల లో దుస్తులను మాత్రమే అందిస్తూ వచ్చిన కంపెనీ తాజాగా పిల్లల లోదుస్తుల రంగంలోకి కూడా ప్రవేశించింది. గత ఏడాది రంగ మార్కెట్లోకి తెచ్చిన బాలుర లో దుస్తులకు మంచి స్పందన లభించింది. ఇక ఈఏడాది బాలికల లోదుస్తుల సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించనున్నది. బ్రిటానియా ఇండస్ట్రీస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.4,840 టార్గెట్ ధర: రూ.5,300 ఈ కంపెనీ బిస్కెట్లు, బ్రెడ్లు, డైరీ ఉత్పత్తులు, కేక్‌లను అందిస్తోంది. కొత్త ఉత్పత్తుల జోరును పెంచుతోంది. పూర్తి ఫుడ్ కంపెనీగా మారే క్రమంలో ఈ ఆర్థిక సంవత్సంరో 50కు పైగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నది. ఇప్పుడున్న సెగ్మెంట్లతో పాటు కొత్త సెగ్మెంట్లలో కూడా కొత్త ఉత్పత్తులను అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర అమ్మకాలు 13 శాతం, ఇబిటా 27 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున వృద్ధి చెందాయి. పన్ను రేటు 33.7 శాతంగా ఉండటంతో నికర లాభం 20 శాతమే వృద్ధి చెందింది. స్థూల మార్జిన్లు 38.5 శాతంగా, ఇబిటా మార్జిన్ 15.5 శాతంగా ఉన్నాయి. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండగా, దేశీయ అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. బిస్కెట్ కేటగిరీ అమ్మకాలు ఊపందుకుంటాయని కంపెనీ అంచనా వేస్తోంది. రానున్న క్వార్టర్లలో ఈ సెగ్మెంట్ అమ్మకాలు 9–10 శాతం వృద్ధి సాధించగలదని కంపెనీ భావిస్తోంది. ఈ క్యూ3లో ఉత్పత్తి వ్యయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఉత్పత్తి వ్యయాలు 3–3.5 శాతం రేంజ్లో పెరగగలవని కంపెనీ భావిస్తోంది. నెట్వర్క్ విస్తరణ, కొత్త, భారీ ఫ్యాక్టరీల ఏర్పాటు, వృధా తగ్గించడం, వేల్యూ ఇంజినీరింగ్ వంటి చర్యల కారణంగా మొత్తం రూ.230 కోట్లు కంపెనీకి ఆదా అయ్యాయి. ట్రీట్ పేరుతో అందిస్తోన్న క్రీమ్ బిస్కెట్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. గుడ్డే, మేరీ గోల్డ్, టైగర్ 50:50 న్యూట్రి చాయిస్ బ్రాండ్ల మాదిరే ట్రీట్ కూడా పవర్ బ్రాండ్‌గా మారగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రూ.400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం స్థాయిని ఐదేళ్లలో నాలుగు రెట్లకు రూ.1,500 కోట్లకు పెంచుకోవాలనేది కంపెనీ లక్ష్యం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ ప్రస్తుత ధర: రూ.1,131 ; టార్గెట్ ధర: రూ.1,416 ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ ఇది. సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, వీఎస్ఎఫ్ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆల్ట్రాటెక్ సిమెంట్‌లో 60.3 శాతం, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో 56 శాతం చొప్పున వాటాలున్నాయి. వీఎస్ఎఫ్, సిమెంట్ సెగ్మెంట్ల నుంచి దాదాపు 90 శాతం ఆదాయం వస్తోంది. దుస్తుల తయారీలో వినియోగించే విస్కోస్ స్టేపుల్ ఫైబర్(వీఎస్ఎఫ్) సెగ్మెంట్లో ప్రపంచంలోనే అగ్రస్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఇబిటా (స్టాండోలోన్) రూ.870 కోట్లకు పెరిగింది. వీఎస్ఎఫ్ సెగ్మెంట్లో అమ్మకాలు,, డిమాండ్ జోరుగా ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడేళ్లలో 58 శాతం పెంచుకుంటోంది. దీని కోసం రూ.4,300 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. గుజరాత్‌లోని విలాయత్ వీఎస్ఎఫ్ ప్లాంట్ విస్తరణకు ఇటీవలనే పర్యావరణ ఆమోదం పొందింది. రసాయనాల సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ క్యూ3లో రూ.359 కోట్ల ఇబిటా సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక క్వార్టర్లీ ఇబిటా. గత ఏడాది డిసెంబర్ నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నగదు రూ.274 కోట్లుగా, నికర రుణ భారం రూ.14,460 కోట్లుగా ఉన్నాయి. స్టాండోలోన్ ప్రాతిపదికన రూ.600 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. వీఎస్ఎఫ్, కెమికల్స్ రంగాల్లో అగ్రస్థానంలో ఉండడం, సిమెంట్ రంగం వృద్ధి ఆశావహంగా ఉండడం, ఆర్థిక సేవల రంగం వ్యాపారం కూడా బాగా ఉండనుండడం సానుకూలాంశాలు. సిమెంట్, వీఎస్ఎఫ్ ధరలు బాగా తగ్గితే అది ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీఎస్ఎఫ్ సెగ్మెంట్ ఉత్పత్తి వ్యయాలు పెరగడం, దేశీయంగా, అంతర్జాతీయంగా ఇంధన వ్యయాలు అధికమయ్యే అవకాశాలు, ఆర్థిక సేవల రంగ సెగ్మెంట్ వృద్ధి అవకాశాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు. అశోక్ లేలాండ్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.134 ; టార్గెట్ ధర: రూ.158 ఎందుకంటే: హిందుజా గ్రూప్‌లో ప్రధానమైన కంపెనీ ఇది. బస్సుల తయారీలో భారత్‌లోనే అతి పెద్ద కంపెనీ. మధ్య, భారీ వాణిజ్య వాహన మార్కెట్లో 26 శాతం మార్కెట్ వాటాతో భారత్‌లో రెండవ అతి పెద్ద కంపెనీ ఇదే. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 47 శాతం వృద్దితో రూ.7,110 కోట్లకు పెరిగింది. వివిధ రకాల మోడళ్లను అందుబాటులోకి తేవడం, ఎగుమతులు పెరగడంతో ఇబిటా మార్జిన్ 2 శాతం పెరిగి 11.1 శాతానికి చేరింది. ఇబిటా 74 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. నికర లాభం 178 శాతం వృద్ధి చెంది రూ.450 కోట్లకు పెరిగింది. ఈ క్యూ3లో అమ్మకాలు 42 శాతం పెరిగాయి. పంత్ నగర్ ప్లాంట్ పన్ను ప్రోత్సాహకాలు తగ్గడం, భారీ డిస్కౌంట్ల కారణంగా స్థూల మార్జిన్ ఒకింత తగ్గింది. పన్ను రేటు అంచనాల కంటే అధికంగా ఉండటంతో ఇతర ఆదాయం రూ.38 కోట్లకు తగ్గింది. వాణిజ్య వాహన రంగం ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయి. ఈ కంపెనీ కూడా ఇదే స్థాయిలో వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. గత ఏడాది నవంబర్‌లో 1 శాతం, ఈ ఏడాది జనవరిలో 1–2 శాతం చొప్పున వాహనాల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చే అంశం. కీలకం కాని ఆస్తుల విక్రయం, మూలధన పెట్టుబడులపై నియంత్రణ, తదితర చర్యల కారణంగా రుణ భారం తగ్గించుకోవాలని, నగదు నిల్వలను పెంచుకోవాలని యోచిస్తోంది. ఏడాది కాలంలో 6–7 కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓవర్ లోడింగ్‌పై నిషేధం కారణంగా అమ్మకాలు పుంజుకోనుండడం, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయనుండడం, వ్యయ నియంత్రణపై కంపెనీ గట్టిగా దృష్టి పెట్టడం సానుకూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
పీవీఆర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రసుత్త ధర: రూ.1,308 టార్గెట్ ధర: రూ.1,596 ఎందుకంటే: మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను నిర్వహిస్తున్న పీవీఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ కంపెనీ రూ.618 కోట్ల ఆదాయంపై రూ.121 కోట్ల ఇబిటా, 19.7 శాతం చొప్పున ఇబిటా మార్జిన్ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. కానీ ఆదాయం 5 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.5,57 కోట్లకు పెరిగింది. ఇబిటా 25 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు ఎగసింది. మార్జిన్ 3 శాతం వృద్ధితో 18 శాతానికి పెరిగింది. అద్దె వ్యయాలు 1 శాతం తగ్గడం, నిర్వహణ, ఇతర వ్యయాలు 4.4 శాతం చొప్పున తగ్గడంతో నికర లాభం 21 శాతం వృద్ధి చెంది రూ.28.9 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ దక్షిణ భారతదేశంలో విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్యూ3లో ఘజియాబాద్‌లో మూడు స్క్రీన్లను ఏర్పాటు చేయగా, బెంగళూరులో 12 స్క్రీన్లను ప్రారంభించింది. ముంబైలో పీవీఆర్ ఓబెరాయ్‌ను మళ్లీ ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కొత్తగా 36 స్క్రీన్లను ఏర్పాటు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మరో 31 కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నది. దీంట్లో 28 స్క్రీన్లు దక్షిణ భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి. మొత్తం స్క్రీన్లలో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న దక్షిణాది స్క్రీన్ల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 26.4 శాతానికి చేరుతుంది. వివిధ వివాదాల కారణంగా క్యూ3లో రిలీజ్ కావలసిన పద్మావతి సినిమా క్యూ4లో రిలీజ్ కావడం, విడుదలై మంచి వసూళ్లను సాధించడం, మరిన్ని సినిమాలు క్యూ4లో విడుదల కానుండటంతో ఈ క్యూ4లో ఈ కంపెనీ మంచి ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నాం. ఫుడ్ అండ్ బేవరేజేస్పై జీఎస్టీని 18% నుంచి 5 శాతానికి తగ్గించడం(ఇన్పుట్ క్రెడిట్ లేకుండా) సానుకూలాంశం కాగా, పన్ను రేట్లలో మార్పులతో ఫిల్మ్హైర్ ఛార్జీలపై ప్రభావం పడనుండడం ప్రతికూలాంశం. ఇంజినీర్స్ ఇండియా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రసుత్త ధర: రూ.167 టార్గెట్ ధర: రూ.195 ఎందుకంటే: ప్రభుత్వ రంగంలోని ఇంజినీర్స్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వివిధ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం, ఆర్డర్ల అమలు కారణంగా ఈ క్యూ3లో ఈ కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలను సాధించింది. ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.473 కోట్లకు పెరిగింది. దీంట్లో కన్సల్టెన్సీ విభాగం వాటా 81 శాతం ఉండగా, టర్న్ కీ సెగ్మెంట్ వాటా 19 శాతంగా ఉంది. ఈ రెండు విభాగాల్లో మంచి పనితీరు సాధించడంతో ఇబిటా మార్జిన్ 28.5 శాతానికి పెరిగింది. ఇక ఇబిటా 67 శాతం వృద్ధితో రూ.135 కోట్లకు ఎగసింది. ఇబిటా మంచి వృద్ధిని సాధించినా, ఇతర ఆదాయం 30 శాతం తగ్గడంతో కంపెనీ నికర లాభం 28 శాతమే వృద్ధి చెంది రూ.108 కోట్లకు పెరిగింది. క్యూ3లో రూ.114 కోట్ల విలువైన ఆర్డర్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆర్డర్ల బుక్ విలువ రూ.8,301 కోట్లకు పెరిగింది. ఈ ఆర్డర్లతోనే మూడేళ్ల వరకూ మంచి వృద్ధిని సాధించే అవకాశాలు ఈ కంపెనీకి ఉన్నాయి. అయితే రెండేళ్లలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచే భారీ ఆర్డర్లు రానున్నాయి. రూ.700–1,200 కోట్ల హెచ్‌పీసీఎల్ బామర్ ప్రాజెక్ట్, రూ.600 కోట్ల ఐఓసీ గుజరాత్ రిఫైనరీ విస్తరణకు సంబంధించిన కన్సల్టెన్సీ ఆర్డర్ ఈ కంపెనీకే దక్కనున్నాయి. అంతేకాకుండా ఐఓసీకే చెందిన కోయాలి, బరౌని, మధుర రిఫైనరీల విస్తరణ ఆర్డర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో ఇంజినీర్స్ ఇండియాకే లభించవచ్చు. గెయిల్–కాకినాడ పెట్రో కెమికల్ ప్రాజెక్ట్, బీపీసీఎల్–నుమాలీఘర్ విస్తరణ ప్రాజెక్ట్ ఆర్డర్లు కూడా ఈ కంపెనీకి దక్క అవకాశాలున్నాయి. కంపెనీ నగదు నిల్వలు రూ.2,150 కోట్లు. రుణభారం లేదు. రెండేళ్లలో ఇబిటా మార్జిన్ 25 శాతం, నికర అమ్మకాలు 18 శాతం, నికర లాభం 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. -
స్టాక్స్ వ్యూ
ఫెడరల్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.103 టార్గెట్ ధర: రూ.152 ఎందుకంటే: ఈ మిడ్‌సైజ్ ప్రైవేట్ రంగ బ్యాంక్ కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, ఢీల్లీ, ఎన్సీఆర్లతో పాటు 4 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో సేవలందిస్తోంది. ఐడీబీఐతో కలిసి జాయింట్‌వెంచర్‌గా బీమా, ఎన్బీఎఫ్సీ వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. 1,252 బ్రాంచ్‌లు, 1,679 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఎస్ఎంఈ, రిటైల్ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంక్ రుణాల్లో ఎస్ఎంఈ రుణాలు 22 శాతంగా, రిటైల్ రుణాలు 38 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ3లో రుణాలు 22 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) 3.3 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 35 శాతానికి ఎగసింది. ఈ జోరు కొనసాగుతుందని బ్యాంక్ అంచనా వేస్తోంది. 18 నెలల కాలంలో 50 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటోంది. టైర్–1 మూలధనం 13.8 శాతంగా ఉండడం, స్థూల నికరర్థ రుణాలు, రీస్ట్రక్చరింగ్, తదితర రుణాలన్నీ 5 శాతంలోపే ఉండటం, డిజిటల్ బ్యాంకింగ్ జోరు పెంచుకోవడానికి తీసుకున్న చర్యల ఫలాలు భవిష్యత్తులో అందనుండటం, సానూకూల అంశాలు. 2019–20 కల్లా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 1 శాతంగానూ, ఆర్ఓఈ(రిటర్న్ ఆన్ ఈక్విటీ) 12.3 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 27 శాతం, ఆర్ఈఓ 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఈ బ్యాంక్ డిపాజిట్లు అధికంగా ప్రవాస భారతీయుల నుంచే వస్తున్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో ఎన్నారైల వాటా 48 శాతంగా ఉంది. హిందుస్తాన్ యూనిలీవర్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రిలయన్స్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,363 టార్గెట్ ధర: రూ.1,514 ఎందుకంటే: ఈ ఎఫ్ఎమ్సీజీ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత క్యూ3లో పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తక్కువగా ఉండడం వల్ల వృద్ధి కాస్త మందగించింది. ఈ లో–బేస్ ఎఫెక్ట్‌కు పెరుగుతున్న వృద్ధి జోరు జత కావడంతో ఈ క్యూ3లో మంచి ఫలితాలను ఈ కంపెనీ సాధించింది. నికర అమ్మకాలు రూ.8,320 కోట్లకు, ఇబిటా 24% వృద్ధితో రూ.1,680 కోట్లకు పెరిగాయి. అనుబంధ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ కారణంగా ఇతర ఆదాయం రూ.150 కోట్లు పెరిగి, నికర లాభం 83% ఎగసింది. హోమ్‌కేర్ సెగ్మెంట్ 20 శాతం, పర్సనల్ కేర్ సెగ్మెంట్ 17% చొప్పున వృద్ధి చెందాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తొలగిపోయి డిమాండ్ పుంజుకుంటుండటంతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండటంతో స్థూల మార్జిన్లు 3 శాతం పెరిగి 53.1 శాతానికి చేరాయి. జీఎస్టీ సంబంధిత సమస్యలు సమసిపోతుండటంతో రానున్న క్వార్టర్లలో వృద్ధి జోరుగా పెరగగలదని భావిస్తున్నాం. కంపెనీ ఆదాయంలో దాదాపు 40% వరకూ గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. గత రెండేళ్లుగా వర్షాలు విస్తారంగా కురియడం, కీలక పంటల మద్దతు ధరలు పెరగడం, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కారణంగా గ్రామీణ మార్కెట్ల నుంచి డిమాండ్ బాగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆయుర్వేద విభాగంలో మరింతగా విస్తరిస్తోంది. ప్రీమియమ్ ఉత్పత్తుల జోరు పెంచుతోంది. ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 12%, నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందనున్నాయని అంచనా వేస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,705 టార్గెట్ ధర: రూ.2,076 ఎందుకంటే: ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.940 కోట్లకు పెరిగింది. కార్పొరేట్ రుణాలు 26 శాతం, రిటైల్ రుణాలు 24 శాతం, క్రెడిట్ కార్డ్ రుణాలు 55 శాతం చొప్పున వృద్ధి సాధించడంతో మొత్తం రుణాలు 25 శాతం పెరిగాయి. దీంతో నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 3.99 శాతం నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎమ్) సాధించింది. ట్రెజరీ ఆదాయం అంతంత మాత్రమే ఉండగా, ఇతర ఆదాయం ఒకింత తగ్గింది. మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్ రుణాలు 41%గా ఉన్నాయి. రుణ నాణ్యత స్వల్పంగా తగ్గింది. స్థూల మొండిబకాయిలు 1.16%కి, నికర మొండి బకాయిలు 0.46%కి పెరిగాయి. కాసా జోరు కొనసాగడంతో కాసా నిష్పత్తి 43%కి ఎగసింది. 2019–20 కల్లా వాహనేతర రిటైల్ రుణాల వాటా పెంచుకోవాలనే లక్ష్య సాధనపై ఈ బ్యాంక్ దృష్టి పెట్టింది. 25–30 శాతం రేంజ్లో రుణ వృద్ధి సాధించాలనేది బ్యాంక్ నిర్దేశించుకున్న కీలక లక్ష్యాల్లో ఒకటి. దీని కోసం, బ్రాంచ్ విస్తరణ కొనసాగిస్తోంది. భారత ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విలీనం చేసుకోవడం వల్ల బ్యాంక్ రాబడి నిష్పత్తులు పెరుగుతాయి. మార్కెట్ వాటా పెరుగుతుండడం, కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాలైన రుణాలను ఇవ్వడం, ప్రస్తుతం 1,320గా ఉన్న బ్రాంచ్‌లను 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా 2,000కు పెంచుకోనుండటం... తదితర కారణాల వల్ల రుణ వృద్ధి 26 శాతానికి మించి చక్రగతి వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యుత్తమ స్థాయిలో మూలధన నిధులున్న బ్యాంక్ ఇదే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ ఫైనాన్షియల్ ప్రస్తుత ధర: రూ.405 టార్గెట్ ధర: రూ.480 ఎందుకంటే: ఆస్తుల పరంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటిష్ ఎమ్ఎన్సీ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్‌ల జాయింట్ వెంచర్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. 521 కార్యాలయాలతో, పదివేలకు పైగా ఉద్యోగులతో, లక్ష మందికి పైగా ఏజెంట్లతో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎల్ఐసీ తర్వాత అత్యధిక మంది ఏజెంట్లు ఉన్నది ఈ సంస్థకే. అంతేకాకుండా నిర్వహణ ఆస్తులు అత్యధికంగా ఉన్న ప్రైవేట్ రంగ బీమా కంపెనీ కూడా ఇదే. జీవిత బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సంబంధిత విస్తృతమైన, విభిన్నమైన పాలసీలను అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా రంగంలో ప్రైవేట్ కంపెనీల మార్కెట్ షేర్ 22 శాతంగా ఉండగా, దీంట్లో 12 శాతం వాటా ఈ కంపెనీదే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 22 శాతంగా, ఆర్ఓఈవీ(రిటర్న్ ఆన్ ఎంబెడెడ్ వేల్యూ–ప్రస్తుత వ్యాపారం ద్వారా భవిష్యత్తులో వచ్చే లాభాలు–బీమా కంపెనీ విలువ మదింపులో ఇది ఒక అంశం) 15 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. కొత్త వ్యాపారం మార్జిన్లు ఆరోగ్యకరంగా ఉండడం, అండర్ రైటింగ్ కార్యకలాపాలు బాగా ఉండటం, కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ రాబడి నిష్పత్తులు పటిష్టంగానే కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. విస్తృతంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కారణంగా కొత్త వినియోగదారులను సాధించడం ఈ బీమా సంస్థకు సులువైన పని. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త వ్యాపారం 62% వృద్ధి చెందింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 2.8% సాల్వెన్సీ రేషియో(కనీసం 1.5% ఉండాలి)ను సాధించింది. -
స్టాక్స్ వ్యూ
అజంతా ఫార్మా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,524 టార్గెట్ ధర: రూ.1,792 ఎందుకంటే: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని కంపెనీ భావిస్తోంది. దేశీయ ఫార్ములేషన్ వ్యాపారంలో జీఎస్టీ సంబంధిత సమస్యలు ఇప్పుడిప్పుడే సమసిపోతున్నాయి. గువాహటిలో ఈ కంపెనీ ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా అవుట్ సోర్సింగ్ తగ్గి, నిర్వహణ సామర్థ్యం పెరగడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. దేశీయ ఫార్ములేషన్స్ విభాగంలో 13 ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఐదు అండా(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లనే అమెరికా ఎఫ్‌డీఏకు సమర్పించినప్పటికీ, మిగిలిన ఆరు నెలల్లో 10–15 అండాలు దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్యూ2లో అమెరికా మార్కెట్లో అమ్మకాలు ఒకింత తగ్గాయి. ఇటీవలే 22 ఔషధాలకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తుది ఆమెదాలు పొందింది. దీంతో రానున్న క్వార్టర్లలో అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీ అంచనా వేస్తోంది. మలేరియా చికిత్సలో ఉపయోగపడే ఔషధాలను సరఫరా చేయడానికి గ్లోబల్ ఫండ్ ఎంపిక చేసిన కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు గత 10 నెలల కాలంలో నిలకడగా ఉండటంతో ఈ కేటగిరీ లాభదాయకతపై పెద్దగా రిస్క్ ఉండదు. ఇటీవలే ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో కొన్ని బ్రాండెడ్ జనరిక్స్ ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం రూ.175 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టింది. ఇంకా రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రేంజ్లో (రూ.300 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నది. 2016–18 మధ్య కాలానికి అమ్మకాలు 9 శాతం, నికర లాభం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగా, రానున్న రెండేళ్లలో అమ్మకాలు 14 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో వ్యాపార పరిస్థితులు మెరుగుపడడమే దీనికి ప్రధాన కారణం. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.1,274 టార్గెట్ ధర: రూ.1,700 ఎందుకంటే: ఆర్పీ–సంజీవ్ గోయెంకా గ్రూప్(సీఈఎస్సీ ప్రమోటర్ గ్రూప్ ఇదే)కు చెందిన ఈ కంపెనీ టైర్ల తయారీలో ఉపయోగపడే కార్బన్ బ్లాక్‌ను తయారు చేస్తోంది. ఈ సెగ్మెంట్లో 40 శాతం మార్కెట్ వాటాతో ఉన్న అతి పెద్ద కంపెనీ ఇదే. విజయవంతంగా టర్న్ అరౌండ్ బాట పట్టిన ఈ కంపెనీ 16 శాతం ఇబిటా మార్జిన్‌ను సాధిస్తోంది. వాహన రంగం నుంచి డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో ఉత్పత్తి తగ్గి సరఫరాలు తగ్గుతుండడం.. కార్బన్ బ్లాక్ తయారు చేసే ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. ముడి పదార్ధాలైన కమోడిటీ, ముడి చమురు ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకుల కారణంగా గతంలో ఈ కంపెనీ లాభాలపై ఒత్తిడి తీవ్రంగానే వుండేది. ఈ చర వ్యయాలను బట్టే ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కీలకమైన కస్టమర్లతో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకని ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం గతంలో లాగా కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపించే అవకాశాల్లేవు. డిమాండ్ పుంజుకోవడం, నిర్వహణ సామర్థ్యం మెరుగుదల కారణంగా లాభదాయకత పెరిగి కంపెనీ నికర రుణ భారం తగ్గింది. మొత్తం మీద రెండేళ్లలో అమ్మకాలు 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.73 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ..210 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.241 కోట్లకు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.335 కోట్లకు పెరగవచ్చని అంచనా. కార్బన్ బ్లాక్ తయారు చేసే రెండు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు–ఓరియన్ కార్బన్, కార్బొట్ కార్ప్‌లు.. కార్బన్ బ్లాక్ పరిశ్రమకు మంచి రోజుల చాలా కాలం కొనసాగనున్నాయని వెల్లడించడం సానుకూలాంశం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
దిలిప్ బిల్డ్‌కాన్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: నిర్మల్‌బంగ్ ప్రస్తుత ధర: రూ.904 టార్గెట్ ధర: రూ. 1,324 ఎందుకంటే: భారత్‌లోని రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ), రాష్ట్ర ప్రభుత్వాలు, కోల్ ఇండియా వంటి కంపెనీల రోడ్డు ప్రాజెక్ట్‌లను చేపట్టి, తక్కువ వ్యయంతో, మంచి నాణ్యతతో సకాలంలో పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీ సొంతం. ఈ కంపెనీ ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, మైనింగ్ తదితర రంగాల్లోకి డైవర్సిఫై అయింది. ఈ కంపెనీ 24 ప్రాజెక్ట్‌లను రూ.1,600 కోట్లకు విక్రయించడానికి ఇటీవలనే శ్రీరామ్ గ్రూప్‌కు చెందిన చత్వాల్ గ్రూప్ ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. చేపట్టిన ప్రాజెక్ట్‌లను షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసిన ట్రాక్ రికార్డ్ ఈ కంపెనీది. ఇలా ముందుగానే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం వల్ల వివిధ సంస్థల నుంచి ఇప్పటిదాకా రూ.345 కోట్ల ఎర్లీ కంప్లీషన్ బోనస్‌ను ఈ కంపెనీ సాధించింది. ఈ కంపెనీ.. వివిధ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్, అమలుపై సరైన దృష్టి పెడుతుండటంతో ఇతర కంపెనీల కన్నా అధిక నిర్వహణ మార్జిన్లను, తద్వారా రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ)లను సాధిస్తోంది. ఎన్హెచ్ఏఐ, భారతమాల పరియోజన స్కీమ్ ద్వారా కేంద్రం రహదారుల నిర్మాణానికి రూ.6.92 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. వీటిల్లో అధిక భాగం ఆర్డర్లను దిలిప్ బిల్డ్‌కాన్ వంటి కంపెనీలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలోని విజయవంతంగా ప్రాజెక్ట్‌లను నిర్వహించిన తీరు. సొంత ఎక్విప్మెంట్, నిధులు పుష్కలంగా ఉండడం, రుణాలు సమీకరించే సత్తా అధికంగా ఉండడం....దీనికి ప్రధాన కారణాలు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.5,075 కోట్లకు, ఇబిటా 45 శాతం వృద్ధితో రూ.992 కోట్లకు, నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.361 కోట్లకు పెరిగాయి. రెండేళ్లలో ఆదాయం 30 శాతం, ఇబిటా 28 శాతం, నికర లాభం 41 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 19.5 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 2019–20 ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి పెరుగుతుందని అంచనా. భూ సమీకరణ తదితర సమస్యల వల్ల ప్రాజెక్ట్‌ల అమల్లో జాప్యం కారణంగా కంపెనీ ఆదాయ, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశాలుండడం.. ప్రతికూలాంశం. ఒబెరాయ్ రియల్టీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.476 టార్గెట్ ధర: రూ. 580 ఎందుకంటే: ముంబై కేంద్రంగా రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియమ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ ఇది. సకాలంలో మంచి నాణ్యతతో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం వల్ల గత 20 ఏళ్లుగా రియల్టీ రంగంలో మంచి బ్రాండ్‌గా ఎదిగింది. ఫలితంగా 50 శాతానికి పైగా ఇబిటా మార్జిన్లు సాధిస్తోంది. ఇటీవలే అందుబాటు గృహాల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఫలితంగా పన్ను ప్రోత్సాహకాలు పొందనున్నది. రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్) అమలు కారణంగా రియల్టీ రంగంలో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి. పటిష్టమైన ఆర్థిక స్థితిగతులు ఉన్న కంపెనీగా ఇది ఒబెరాయ్ రియల్టీకి ప్రయోజనం కలిగించే అంశమే. బొరివలి, వర్లిలో రెండు మాల్స్‌ను, ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లుగా ఉన్న లీజింగ్ ఆదాయం 2020–21 కల్లా రూ.800 కోట్లకు పెరుగుతాయని అంచనా. అంతేకాకుండా కంపెనీ ఆదాయానికి నిలకడ లభిస్తుంది.ముంబై, ధానేల్లో ఖరీదైన ప్రాంతాల్లో ఈ కంపెనీకి భూములున్నాయి. 10–12 ఏళ్లలో అభివృద్ధి చేయడానికి 25 ఎకరాల స్థలాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా మూడు నెలల్లోనే 20 శాతానికి పైగా బుకింగ్స్ పూర్తి కావడం, కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టటానికి కావలసిన నిధులు పుష్కలంగా ఉండడం, పటిష్టమైన బ్రాండ్ కారణంగా తన ఉత్పత్తులను ప్రీమియమ్ ధరలకు విక్రయించుకోగల సత్తా.. సానుకూలాంశాలు. రుణ, ఈక్విటీ నిష్పత్తి 0.1 గానే ఉండడం చెప్పుకోదగ్గ మరో విషయం. మూడేళ్లలో ఆదాయం 47 శాతం, నికర లాభం 56 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 2019–20 కల్లా 18 శాతానికి పెరగగలదని, అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్(ఆర్ఓసీఈ) 6 శాతం నుంచి 14 శాతానికి చేరుతుందని భావిస్తున్నాం. రియల్టీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చేర్పులు, నిర్మాణ రంగ కార్మికులు సమ్మెకు దిగే అవకాశాలు, ఒక్క ముంబై నగరంపైననే దృష్టి కేంద్రీకరించడం, ప్రొపర్టీ ధరలు పడిపోయే అవకాశాలు... ఇవన్నీ ప్రతికూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
ప్రస్తుత ధర: రూ.332 ; టార్గెట్ ధర: రూ.380 ఎందుకంటే: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, రుణ నాణ్యత విషయమై సానుకూలమైన వాతావరణం చోటు చేసుకుంది. మొండి బకాయిల ఖాతాలకు అంచనాలకు మించి రూ.6,000 కోట్లు కేటాయింపులు జరపాల్సి వచ్చింది. దీంతో నికర లాభం రూ.1,580 కోట్లకే పరిమితమైంది. ఎన్సీఎల్టీకి నివేదించిన మొత్తం మొండి బకాయిలు మొత్తం రూ.72,000 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ1లో రూ.26,300 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.9,000 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, ఈ క్యూ1లో 5.4 శాతంగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.9 శాతానికి తగ్గాయి. దీంతో ఈ క్యూ2లో మొత్తం స్థూల మొండి బకాయిలు 9.8 శాతానికి, నికర మొండి బకాయిలు 5.4 శాతానికి తగ్గాయి. ఎస్బీఐ లైఫ్‌లో వాటా విక్రయం కారణంగా రూ.5,400 కోట్లు రావడంతో ఇతర ఆదాయం పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. రుణ వృద్ధిలో పెద్దగా పురోగతి లేకపోయినా, కాసా నిష్పత్తి 45 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యధికంగా ప్రయోజనం పొందే బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. (ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ బాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా చూసినా) బ్యాంక్‌కు మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి, అనుబంధ బ్యాంక్‌ల విలీనం ఫలితాలు అందనుండడం, ఎస్‌సీఎల్‌టీ ఖాతాల విషయం త్వరగా పరిష్కారం కానుండడం, సాధారణ బీమా, ఇతర కీలకం కాని ఆస్తుల్లో వాటా విక్రయం కారణంగా నిధులు అందనుండడం,.. ఇవన్నీ సానుకూలాంశాలు. పీసీ జ్యువెల్లర్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.383 ; టార్గెట్ ధర: 490 ఎందుకంటే: 2006లో ఒక చిన్న కంపెనీగా మొదలైన పీసీ జ్యువెల్లర్ ప్రస్తుతం తనిష్క్(టైటాన్ కంపెనీ) తర్వాత రెండో అతి పెద్ద జ్యువెల్లర్ రిటైల్ కంపెనీగా ఎదిగింది. నల్లధనం నిరోధం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీఎస్టీ అమలు భారత జ్యువెల్లరీ రంగంలో వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశాలు. బ్రాండ్ విశ్వసనీయత, టెక్నాలజీ వినియోగం, అత్యంత ప్రభావవంతమైన హెడ్జింగ్ విధానాలు, విస్తృతమైన శ్రేణిలో వెరైటీలు అందించడం, మార్కెటింగ్ వ్యూహాలు.. వీటన్నింటి దన్నుతో పీసీ జ్యువెల్లర్ వంటి జాతీయ స్థాయి కంపెనీల అమ్మకాలు పుంజుకోనున్నాయి. ఉత్తర భారతదేశంలో పటిష్టంగా ఉన్న ఈ కంపెనీ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఫ్రాంచైజీ విధానంలో కూడా విస్తృతంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా వైవిధ్యమైన ఆభరణాలను అందించనుండడం, బ్రాండ్ ప్రచారానికి భారీగా పెట్టుబడులు పెడుతుండడం, వెడ్డింగ్, డైమండ్ జ్యూయలరీపై ప్రధానంగా దృష్టి సారిస్తుండడం సానుకూలాంశాలు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విక్రయాలు 30 శాతం వృద్ధి చెందగా, మరో మూడేళ్లలో ఇవి దాదాపు రెట్టింపుకానున్నాయని అంచనా. మూడేళ్ల కాలానికి అమ్మకాలు 21 శాతం, స్థూల లాభం 24 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతంగా ఉ్న రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్(ఆర్ఓసీఈ) 2019–20 కల్లా 19.5 శాతానికి పెరుగుతుందని అంచనా. పుత్తడి ధరల్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉండడం, నిబంధనల కఠినతరం కానుండడం, డిమాండ్‌లో మందగమనం చోటు చేసుకుంటే కొత్త స్టోర్ల ఏర్పాటులో జాప్యం ఉండే అవకాశాలు. ఇవన్నీ ప్రతికూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
హిందుస్తాన్ యూనిలీవర్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. రూ.1,240 టార్గెట్ ధర: రూ. 1400 ఎందుకంటే: జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని, అయితే పూర్తి ప్రతికూల ప్రభావం ఇంకా తొలగిపోలేదని యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాది, పశ్చిమ భారత ప్రాంతాల్లో హోల్‌సేల్ అమ్మకాలు సాధారణ స్థాయికి వచ్చాయని, ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకోలేదని పేర్కొంది. కంపెనీ డిస్ట్రిబ్యూటర్లలో అధిక భాగం జీఎస్టీ విధానానికి ఇప్పడిప్పుడే అలవాటు పడుతున్నారు. జీఎస్టీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో మారడానికి కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చు. మొత్తం మీద జీఎస్టీ కారణంగా వ్యవస్థీకృత రంగంలోని ఈ తరహా పెద్ద కంపెనీలకు ప్రయోజనకరమే. జీఎస్టీ పూర్తి ప్రభావం ఈ ఏడాది రెండో క్వార్టర్లో కనిపించవచ్చు. జీఎస్టీ ప్రయోజనాల బదిలీతో టర్నోవర్ ఒకింత తగ్గవచ్చు. జీఎస్టీ అకౌంటింగ్ కారణంగా మార్జిన్లు పెరిగే అవకాశాలు అధికం. వస్తువుల ధరల్లో చెప్పుకోదగ్గ స్థాయి మార్పులు, చేర్పులు లేవు. గత మూడేళ్లలో నికర లాభం 6%, గత ఐదేళ్లలో 11%, గత పదేళ్లలో 11% చొప్పున చక్రగతిన వృద్ది చెందగా, రానున్న రెండేళ్లలో నికర లాభం 18% చొప్పున చక్రగతిన వృద్ధి చెందవచ్చు. వేదాంత లిమిటెడ్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ. రూ.308 టార్గెట్ ధర: రూ. 362 ఎందుకంటే: లండన్‌లో లిస్టైన వేదాంత రిసోర్సెస్‌కు భారత్‌లో అనుబంధ కంపెనీ ఇది. ఇనుము కాకుండా ఇతర లోహాలకు సంబంధించి భారత్‌లో అతి పెద్ద కంపెనీ ఇదే. ఆయిల్, గ్యాస్, జింక్, లెడ్, సిల్వర్, రాగి, ఖనిజాల సంబంధిత ఉత్పత్తితో పాటు విద్యుదుత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి హిందుస్తాన్ జింక్‌లో 64.9 శాతం, చమురు రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కెయిర్న్ ఇండియాలో 38.8 శాతం చొప్పున వాటాలున్నాయి. ఒడిశాలోని జర్సుగూడలోని వేదాంత కంపెనీకి చెందిన మూడు విద్యుత్‌ప్లాంట్లపై నిషేధాన్ని ఒడిశా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తొలగించింది. ఈ ప్లాంట్లపై నిషేధం తొలగడంతో ఉత్పత్తి కార్యకలాపాల కోసం అదనంగా విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన భారం వేదాంత కంపెనీకి తప్పింది. మంచి నాణ్యత గల జింక్ గనుల కారణంగా ప్రపంచంలోనే అతి తక్కువ వ్యయాలతో జింక్‌ను ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కెయిర్న్ చమురు అన్వేషణ విజయవంతం, బాల్కో, హిందుస్తాన్ జింక్ల్లో మిగిలిన ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసే అవకాశం, బాక్సైట్, డోలమైట్ మైనింగ్ లైసెన్స్‌ల పొందడం... ఇవన్నీ భవిష్యత్తులో షేర్ ధరను పెంచే ట్రిగ్గర్లు కానున్నాయి. -
స్టాక్స్ వ్యూ
క్రెడిట్ ఎనాలసిస్ అండ్ రీసెర్చ్ బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ ప్రస్తుత ధర: రూ.1,454 టార్గెట్ ధర: రూ.1,770 ఎందుకంటే: రేటింగ్ సర్వీసులందజేసే రెండో అతిపెద్ద భారత కంపెనీ ఇది. మాల్దీవులు, హాంగ్‌కాంగ్, నేపాల్, మారిషస్‌లకు కూడా తన సేవలను విస్తరించింది. బ్రెజిల్, పోర్చుగల్, మలేషియా, దక్షిణాఫ్రికా దేశాల్లో రేటింగ్ సర్వీసులందజేయడానికి ఆయా దేశాలకు చెందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రీసెర్చ్ సర్వీసులు కూడా అందిస్తోంది. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించింది. రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించనున్నది. భారత్‌లో ఆర్థిక పరిస్థితుల మెరుగుపడుతుండటంతో కార్పొరేట్ డెట్ రేటింగ్స్, బ్యాంక్‌లోన్ రేటింగ్స్‌కు డిమాండ్ పెరుగుతుందని అంచనా. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 7 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ పుంజుకుంటుండటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, మౌలిక, గృహ నిర్మాణ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల రుణ వృద్ధి పుంజుకోగలదని కేర్ అంచనా వేస్తోంది. ఫలితంగా కంపెనీ అమ్మకాలు రెండేళ్లలో 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. క్యూ1లో కొత్తగా 817 క్లయింట్లు లభించారు. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 15,222కు పెరిగింది. రెండేళ్లలో ఇబిటా 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా. ఈ కంపెనీ రేటింగ్ అంచనాలు తప్పితే కంపెనీ విశ్వసనీయత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ మొత్తం ఆదాయంలో రేటింగ్ ఆదాయం 97 శాతంగా ఉంది. పోటీ కంపెనీలైన క్రిసిల్, ఇక్రాల ఆదాయంలో వివిధీకరణ సాధించాయి. వ్యయాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగం కారణంగా ఈ కంపెనీకి నిర్వహణ మార్జిన్లు అధికంగా ఉన్నాయి. కొత్త విభాగాల్లోకి, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం.. మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఎన్బీసీసీ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.205 టార్గెట్ ధర: రూ.227 ఎందుకంటే: ఎన్బీసీసీ.ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీల్లో ఒకటి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయ వృద్ది ఆంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వ్యయాలు తక్కువగా ఉండడం, ఇబిటా మార్జిన్లు అధికంగా ఉండటంతో నికర లాభం 24% వృద్ది చెందింది. పీఎంసీ వ్యాపారం 3% పెరగ్గా, రియల్ ఎస్టేట్‌వ్యాపారం 49%, ఈపీసీ వ్యాపారం 10% చొప్పున క్షీణించాయి. ఇబిటా మార్జిన్లు 160 బేసిస్ పాయింట్లు వృద్ది చెంది 5.1 శాతానికి పెరిగాయి. వడ్డీ వ్యయాలు తగ్గడంతో నికర లాభం 24 శాతం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మార్జిన్ 7 శాతానికి చేరగలదని అంచనా. పూర్తి చేయాల్సిన ఆర్డర్లు రూ.75వేల కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల మేర ఆర్డర్లు వస్తాయని అంచనా. రీడెవలప్మెంట్ ఆర్డర్లు భారీగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి ఆదాయ వృద్ధి మరింతగా మెరుగుపడగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 38 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. భారీ ప్రాజెక్టుల అమలులో నైపుణ్యం, పోటీ తక్కువగా ఉండడం, ఆర్డర్ బుక్ భారీగా ఉండడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. ఇటీవలనే పది రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ కాంట్రాక్ట్‌ను ఈ కంపెనీ సాధించింది. రానున్న కొన్నేళ్లలో మరో 40–50 రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లను సాధించే అవకాశాలున్నాయి. ఒక్కో రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ విలువ రూ.400–500కోట్ల రేంజ్లో ఉంటుంది. రూ.25,000–40,000 కోట్ల విలువ ఉండే ముంబైలోని ధారవి మురికివాడ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఈ కంపెనీకే దక్కవచ్చు. -
స్టాక్స్ వ్యూ
సియట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,695 ; టార్గెట్ ధర: రూ.2,029 ఎందుకంటే: ఆర్పీజీ గోయంకా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ... ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల కంపెనీ. రోజుకు 95 వేల టైర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా పటిష్టమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఉండగా, నికర లాభం, ఇబిటా అంచనాలను అందుకోలేకపోయాయి. ఆదాయం 1% క్షీణించి రూ.1,628 కోట్లకు తగ్గింది. ముడిపదార్ధాల వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగడంతో గత క్యూ1లో రూ.185 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ1లో రూ.55 కోట్లకు తగ్గింది. ఫలితంగా నికర లాభం రూ.104 కోట్ల నుంచి 99% క్షీణించి రూ.కోటికి పడిపోయింది. సహజ రబ్బరు ధరలు 30%, సింథటిక్ రబ్బర్ ధరలు 50% పెరగడం బాగా ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇప్పటికే సగటు ముడి పదార్ధాల వ్యయాలు 10% తగ్గాయి. ఇవి మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. దీంతో మార్జిన్లు పుంజుకుంటాయని భావిస్తున్నాం. పంక్చర్ లెస్, మైలేజీ అధికంగా ఇచ్చే వంటి వినూత్నమైన టైర్లను మార్కెట్లోకి తెస్తుండటంతో ప్రయాణికుల సెగ్మెంట్ టైర్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తెచ్చిన ట్రక్, బస్ రేడియల్(టీబీఆర్) టైర్ల సెగ్మెంట్ 70–80 % వృద్ధి సాధించగా, భవిష్యత్తులో మరో 10–15% వృద్ధికి అవకాశాలున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాలు ధరలు తగ్గుతుండడం, జీఎస్టీ అమలు తర్వాత రికవరీ జరిగే అవకాశాలు, చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధింపు కారణంగా దేశీయ టైర్ల కంపెనీల మార్కెట్ వాటా పెరిగే అవకాశాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 8 శాతం, నికర లాభం 17% చొప్పున చక్రగతిన వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ రిటైల్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.443 ; టార్గెట్ ధర: రూ.560 ఎందుకంటే: ఫ్యూచర్ రిటైల్ సంస్థ–బిగ్‌బజార్, ఫుడ్‌హాల్, ఫుడ్ బజార్, ఈజీ డే ఫార్మాట్ స్టోర్స్‌ను, ఎఫ్‌బీబీ, హోమ్ టౌన్(హోమ్ అండ్ ఫర్నిషింగ్స్), ఈజోన్(ఎలక్ట్రానిక్స్ రిటైల్) స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. 2005–10 కాలంలో భారీగా విస్తరించడం, సంబంధం లేని వ్యాపారాల్లోకి ప్రవేశించిండం వంటి కారణాల వల్ల కంపెనీ రుణ భారం పెరిగిపోయింది. 2011–12 ఏడాది నుంచి పునర్వ్యస్థీకరణ చేపట్టింది. పాంటలూన్స్ సంస్థను విక్రయించింది. బిగ్‌బజార్ స్టోర్స్‌ను పునర్వ్యస్థీకరించింది. వీటన్నింటి ఫలితంగా ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిగతులతో.. భారత్‌లో అగ్రస్థాయి మల్టీ ఫార్మాట్ రిటైలర్ కంపెనీగా అవతరించింది. చౌక ధరల్లో ఉత్పత్తులందించే రిటైల్ చెయిన్‌గా 2001లో ప్రారంభమైన బిగ్‌బజార్‌ను పూర్తి స్థాయి వెరైటీ డిపార్టమెంటల్ స్టోర్‌గా పునర్వ్యస్థీకరించింది. యువతను ఆకర్షించేందుకు బిగ్‌బజార్ జెన్ నెక్స్ట్ పేరుతో కొత్త స్టోర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాషన్ బిగ్ బజార్(ఎఫ్‌బీబీ)ను కూడా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా మార్పుచేర్పులు చేసింది. ఈజీ డే, హెరిటేజ్ రిటైల్ స్టోర్స్‌ను కొనుగోలు చేసి, స్మాల్ ఫార్మాట్ స్టోర్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంది. స్వంత బ్రాండ్ కొర్యొ ఉత్పత్తుల విక్రయాల పెంపుపై దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్లుగా ఉన్న నికర రుణ భారం వచ్చే ఏడాది కల్లా పూర్తిగా తగ్గిపోగలదన్న అంచనాలున్నాయి. పాంటలూన్స్లో మెజారిటీ వాటాను విక్రయించడం, క్యాపిటల్ ఫస్ట్‌లో పూర్తి వాటాను అమ్మేయడం, జెనరాలి సంస్థతో ఏర్పాటు చేసిన రెండు బీమా జేవీల్లో వాటాలను కూడా విక్రయించి రుణభారాన్ని తగ్గించుకుంది. హోమ్, ఫర్నిషింగ్స్ విభాగం హోమ్ టౌన్‌ను డీమెర్జ్ చేయాలని యోచిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.4 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 5.5 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్వేస్ బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.615 ఎందుకంటే: జెట్ ఎయిర్వేస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 4% వృద్ధితో రూ.5,730 కోట్లకు పెరిగింది. ఇంధన వ్యయాలు పెరగడంతో ఇబిటార్(ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్, రిస్ట్రక్చరింగ్ లేదా రెంట్ కాస్టŠస్) మార్జిన్ 13 శాతానికి తగ్గింది. దీంతో నికర లాభం 95 శాతం క్షీణించి రూ.2.3 కోట్లకు పరిమితమైంది. కంపెనీ నికర రుణ భారం రూ.470 కోట్లు తగ్గింది. వ్యయనియంత్రణ కోసం కంపెనీ తీసుకున్న చర్యలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఫలితాలనిచ్చాయి. అయితే ఇంధన వ్యయాలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది (2015–16) క్యూ4లో 19 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు గత ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో 30 శాతానికి పెరిగాయి. సిబ్బంది వ్యయాలు17% పెరిగాయి. ఫలితంగా 2015–16 క్యూ4లో 27 శాతంగా ఉన్న ఇబిటార్ మార్జిన్ 13%కి తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆదాయం 2 శాతం పెరగ్గా, ఇబిటా 22 శాతం తగ్గింది. రుణ భారం రూ.1,700 కోట్లు తగ్గింది. మొత్తం కంపెనీ వ్యయాల్లో విమానయాన ఇంధనం వ్యయాలు 43%గా ఉంటాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. ముడి చమురు ధరలు తగ్గితే కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. దేశీయ విమానయాన మార్కెట్లో ఈ కంపెనీ వాటా 24%. పదేళ్లలో దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ 11 శాతం, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ కార్యకలాపాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టిపెడుతోంది. లాభదాయకత మెరుగుపడుతుండడడం, ఇంధనేతర వ్యయాలు తగ్గుతుండడం, రుణభారం కూడా దిగివస్తుండడం కంపెనీకి కలసి వచ్చే అంశాలు. మహీంద్రా అండ్ మహీంద్రా బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,376 టార్గెట్ ధర: రూ.1,565 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల అమ్మకాలు జోరుగా ఉండొచ్చని, వాహన విక్రయాలు మాత్రంత అంతంతమాత్రంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. గత కొన్నేళ్లుగా కంపెనీ యుటిలిటి వెహికల్స్(యూవీ) అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. యూవీ సెగ్మెంట్లో రెండేళ్లలో నాలుగు కొత్త మోడళ్లను, ప్రస్తుతమున్న మోడళ్లలో అప్డేట్ వేరియంట్లను అందుబాటులోకి తేనుండడంంతో రానున్న కొన్నేళ్లలో యూవీ అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయి. వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాల కారణంగా ట్రాక్టర్లకు డిమాండ్ పెరుగుతుంది. రైతుల ఆదాయం పెంపుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం, రైతు రుణాల మాఫీ... ట్రాక్టర్ డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ట్రాక్టర్ల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ వాటా 43 శాతానికి ఎగసింది. గత 34 ఏళ్లలో ఇదే అత్యధిక మార్కెట్ వాటా. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో స్వరాజ్ బ్రాండ్ కింద కొత్త ట్రాక్టర్ మోడళ్లను అందించనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఇక జీఎస్టీ అమలు కారణంగా స్కార్పియో, ఎక్స్‌యూవీ500 తదితర పెద్ద ఎస్‌యూవీల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా ఈ వాహనాలకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. వాణిజ్య వాహనాల విభాగం పనితీరు కూడా మెరుగుపడవచ్చు. చిన్న వాణిజ్య వాహనాల సెగ్మెంట్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం పెరిగాయి. ఈ సెగ్మెంట్లో సగం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. భారీ వాణిజ్య వాహనాల సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నది. వ్యయ నియంత్రణ పద్ధతులను కొనసాగించడం, అధిక మార్జిన్లు ఉన్న ట్రాక్టర్ల విభాగం డిమాండ్ పుంజుకుంటుండంతో మార్జిన్లు మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. -
స్టాక్స్ వ్యూ
వోల్టాస్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.499 ; టార్గెట్ ధర: రూ.400 టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.2,040 కోట్లకు, ఇబిటా 23 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు పెరిగాయి. మార్జిన్ 120 బేసిస్ పాయింట్లు పెరిగి 10.9 శాతానికి చేరింది. నికర లాభం 46 శాతం వృద్ధితో రూ.200 కోట్లకు పెరిగింది. యూసీపీ(యూనిటరీ కూలింగ్ ప్రోడక్ట్స్) అమ్మకాలు 28 శాతం వృద్ధితో రూ.1,090 కోట్లకు పెరిగాయి. ఈ రంగంలో 21 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ సెగ్మెంట్ ఇబిటా మార్జిన్ నిలకడగా 16.4 శాతంగా ఉంది. అయితే ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్(ఈఎంపీ) విభాగం ఆదాయం 9 శాతం తగ్గి రూ.830 కోట్లకు చేరింది. కొన్ని ప్రాజెక్ట్‌ల ప్రగతి అంచనాల కంటే మందకొడిగా ఉండడమే దీనికి కారణం. తక్కువ మార్జిన్లు వచ్చే ఆర్డర్లను వదిలివేసి, ఎక్కువ మార్జిన్లు వచ్చే కొత్త ఆర్డర్లను చేపట్టడంతో ఈ సెగ్మెంట్ ఇబిటా మార్జిన్ 5.7 శాతంగా ఉంది. ఈ కంపెనీ టర్కీకి చెందిన ఆర్సెలిక్ కంపెనీ అనుబంధ సంస్థ, బెకోతో ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఇటీవలే దీనికి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ జేవీలో భాగంగా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్ వంటి గృహోపకరణాలను వొల్టాస్ బేకో బ్రాండ్ కింద తయారు చేసి, విక్రయించనున్నారు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, రూ.400 టార్గెట్ ధరకు ఈ షేర్‌ను ప్రస్తుత ధరలో అమ్మేయాలంటూ సిఫార్సు చేస్తున్నాం. ఎందుకంటే, ఏసీ సెగ్మెంట్లో తీవ్ర పోటీ కారణంగా మార్జిన్లు బాగా తగ్గే అవకాశాలున్నాయి. కెనరా బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఇండియా ఇన్ఫోలైన్ ప్రస్తుత ధర: రూ.360 ; టార్గెట్ ధర: రూ.497 ఇటీవలి మొండి బకాయిల సంబంధిత ఆర్డినెన్స్ కారణంగా ఈ బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడే అవకాశాలున్నాయి. ఫలితంగా రెండేళ్లలో స్థూల మొండి బకాయలు 211 బేసిస్ పాయింట్లు తగ్గి 7.5 శాతానికి దిగిరావొచ్చని అంచనా వేస్తున్నాం. ఒత్తిడి గల రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 23 బేసిస్ పాయింట్లు తగ్గి 13.45 శాతానికి చేరాయి. మరో రెండేళ్ల పాటు ఈ ఒత్తిడి గల రుణాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని బ్యాంక్ అంచనా వేస్తోంది. లఘు, చిన్న, మద్య తరహా, రిటైల్, వ్యవసాయ రంగ రుణాలపై దృష్టిని కొనసాగిస్తోంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్ రుణాలను పెంచుకోవాలని బ్యాంక్ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 61 శాతంగా ఉన్న మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటాను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా 65 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాసా వాటా గత ఆర్థిక సంవత్సరంలో 738 బేసిస్ పాయింట్లు పెరిగి 33 శాతానికి చేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా దీనిని 35 శాతానికి పెంచుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం చివరికి స్థూల మొండి బకాయిలు 9.6 శాతం, నికర మొండి బకా>యిలు 6.3 శాతంగా ఉన్నాయి. రెండేళ్లలో రుణాలు 10.5 శాతం చొప్పున చక్రగతి వృద్ధితో రూ.4.2 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. రుణ నాణ్యత మెరుగుపడుతుండడం, నికర వడ్డీ మార్జిన్లు పెరిగే అవకాశాలు, వడ్డీయేతర ఆదాయం పెరుగుతుండడంతో బ్యాంక్ లాభదాయకత మెరుగుపడగలదని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
హెచ్డీఎఫ్సీ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ టార్గెట్ ధర: రూ.1,750 ; ప్రస్తుత ధర: రూ.1,547 ఎందుకంటే: దేశంలో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. బ్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, గృహరుణాల్లో ఎస్బీఐ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోల్చితే 20 శాతం వృద్ధితో రూ.2,044 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.2,761 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ నిలకడగా 4 శాతంగా ఉంది. మొత్తం రుణాల్లో 69 శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు 14 శాతం, కార్పొరేట్ రుణాలు 16 శాతం చొప్పున వృద్ధి సాధించడంతో మొత్తం రుణాలు 14 శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగేళ్లలో పరిశ్రమ 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తే, ఈ కంపెనీ 18% చొప్పున వృద్ధి సాధించింది. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, తన అగ్రస్థానాన్ని నిలుపుకునే సత్తా ఈ కంపెనీకి ఉంది. కంపెనీకున్న బ్రాండ్ విలువ, విస్తృతమైన నెట్వర్క్, పటిష్టమైన వ్యాపార విధానాలు దీనికి ప్రధాన కారణాలు. పోటీ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, సాధారణ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ బ్యాంక్ రుణ వృద్ధి రెండేళ్లలో 16% చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. కొంతకాలంగా వడ్డీరేట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 3.5% రేంజ్లో సాధిస్తోంది. కార్పొరేట్ రుణాలు మందగమనంగా ఉన్నప్పటికీ, నిమ్ ఇదే రేంజ్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న కంపెనీల్లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 0.79%గా ఉన్నాయి. వంద శాతం ప్రొవిజన్ కవరేజ్ రేషియో కారణంగా నికర మొండి బకాయిలు దాదాపు లేవు. రెండేళ్లలో నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇండస్ఇండ్ బ్యాంక్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: వెంచురా సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.2,008 ; ప్రస్తుత ధర: రూ.1,408 ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న ప్రైవేట్ బ్యాంకుల్లో ఇదొకటి. 1,200 బ్రాంచీలు, 2,036 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. కార్పొరేట్ రుణాలు 30 శాతం, వినియోగదారుల రుణాలు 28 శాతం చొప్పున పెరిగాయి. ఫలితంగా మొత్తం రుణాలు 28 శాతం వృద్ధితో రూ.1,13,081 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.6,068 కోట్లకు చేరింది. కాసా డిపాజిట్లు 42 శాతం పెరగ్గా, స్థూల మొండి బకాయిలు 0.93 శాతంగా, నికర మొండి బకాయిలు 0.39 శాతంగా ఉన్నాయి. గ్రామీణ, వ్యవసాయ రంగాలపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించేందుకు గాను ఇటీవలే రూరల్ బ్యాంకింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంత విస్తరణపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం బ్యాంక్‌కు 95 లక్షల మంది ఖాతాదారులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవ్వగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్‌లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 1 శాతంలోపే ఉన్నాయి. 2019–20 నాటికి స్థూల మొండి బకాయిలు 1.15 శాతంగా, నికర మొండి బకాయిలు 0.55 శాతంగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. ఆర్థికంగా ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, గత పదేళ్లలో నిలకడైన వృద్ధిని సాధించింది. ఇదే జోరు మరో మూడేళ్లపాటు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రుణాలు 23 శాతం, నికర వడ్డీ ఆదాయం 20 శాతం, డిపాజిట్లు 24 శాతం, కాసా డిపాజిట్లు 28 శాతం, ఫీజు ఆదాయం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా నికర వడ్డీ ఆదాయం 17% వృద్ధి చెంది రూ.9,594 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
ఎన్టీపీసీ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.157 టార్గెట్ ధర: రూ.189 ఎందుకంటే: భారత్‌లో అతి పెద్ద విద్యుదుత్పత్తి కంపెనీ ఇది. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 47,178 మెగావాట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అధిక విద్యుదుత్పత్తి కారణంగా ఆదాయం 11 శాతం వృద్ధి చెందింది. కానీ ఇంధన వ్యయాలు 14 శాతం పెరగంతో ఇబిటా మార్జిన్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 27.1 శాతానికి తగ్గింది. గత క్యూ3లో కేవలం 4 శాతంగానే ఉన్న పన్ను రేటు ఈ క్యూ3లో 20 శాతానికి పెరగడంతో నికర లాభం 8 శాతం మేర క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,000–4,500 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి 1,300 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సాధించగా, చివరి మూడు నెలల్లో కనీసం 3,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తిని సాధించే అవకాశాలున్నాయి. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సంరలో కూడా 4,500 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత క్యూ3లో 78.23 శాతంగా ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)ఈ క్యూ3లో 77.21 శాతానికి తగ్గింది. అలాగే గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్ల పీఎల్ఎఫ్ 28.47 శాతం నుంచి 23.85 శాతానికి తగ్గింది. అయితే ఉత్పాదక సామర్థ్యం పెంపు కారణంగా రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. రెండేళ్లలో అదనపు విద్యుదుత్పత్తి 8 శాతం చొప్పున చక్రగతిన పెరుగుదల సాధిస్తుందని భావిస్తున్నాం. నియంత్రిత వ్యాపార విధానం, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) పటిష్టంగా ఉండడం, సెక్యూర్డ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు.. ఇవన్నీ కంపెనీ వృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందించేవే. జిందాల్ స్టీల్ అండ్ పవర్ బ్రోకరేజ్ సంస్థ: మెతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.126 టార్గెట్ ధర: రూ.180 ఎందుకంటే: జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి చెందిన అంగుల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సజావుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 2 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ ప్లాంట్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని 5 మిలియన్ టన్నులకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఏడాదికి 3 మిలియన్‌టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మరో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో కంపెనీ మొత్తం ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యం ఏడాదికి 8 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3 మిలియన్ టన్నుల ఉక్కు అమ్మకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఈ అమ్మకాలు 31 శాతం చక్రగతి వృద్ధిన 5.8 మిలియన్ టన్నులకు చేరవచ్చని భావిస్తున్నాం. రెండేళ్లలో కన్సాలిడేటెడ్ ఇబిటా 32 శాతం వృద్ధితో రూ.7,800 కోట్లకు పెరగవచ్చని, అలాగే స్టాండోలోన్ ఇబిటా 35% వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. దేశీయంగా ఉక్కుకు డిమాండ్ క్రమానుగతంగా పెరగగలదని అంచనా. పెద్ద ఉక్కు కంపెనీలు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్సార్ తది తర స్టీల్ కంపెనీలు ‘లాంగ్ ప్రోడక్ట్స్’ను తక్కువగా ఉత్పత్తి చేయడంతో ఈ ఉత్పత్తుల విషయంలో ఈ కంపెనీదే పై చేయి కానున్నది. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి రానుండడం, ఉక్కు ధరలు పెరిగే అవకాశాలుండడం తది తర కారణాల వల్ల మార్జిన్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం. సొంత ఇనుప, బొగ్గు గనులు ఉండడం, శారద ఐరన్ ఓర్స్‌తో సరఫరా ఒప్పందంతో ముడి పదార్ధాల ధరలు తక్కువగా ఉండనుండడం.. ఇవ్వన్నీ సానుకూలాంశాలు. , ఆస్తుల పునర్వ్యస్థీకరణ కారణంగా తరుగుదల పెరిగి నికర లాభం రుణాత్మకంగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నాం. ఉక్కు ధరలు క్షీణించే అవకాశాలు, రుణ భారం పునర్వ్యస్థీకరణ కారణంగా వడ్డీ వ్యయాలు పెరిగే అవకాశాలుండడం ప్రతికూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
అంబుజా సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.226 టార్గెట్ ధర: రూ.277 ఎందుకంటే: హోల్సిమ్ గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ భారత్‌లో మూడో అతి పెద్ద సిమెంట్ కంపెని. సిమెంట్‌ను తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తున్న కొన్ని కంపెనీల్లో ఇదొక్కటి. భారత్ నుంచి అత్యధికంగా సిమెంట్‌ను ఎగుమతి చేస్తున్న కంపెనీ కూడా ఇదే. సిమెంట్‌కు డిమాండ్ బాగా ఉన్న ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, భవిష్యత్ వృద్ధి దృష్ట్యా ఈ షేరు కొనుగోలుకు అనువైనదని భావిస్తున్నాం. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7 శాతం తగ్గి రూ.2,190 కోట్లకు చేరింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు 7 శాతం తగ్గాయి. ఇబిటా 3 శాతం తగ్గి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధితో) రూ.290 కోట్లకు చేరింది. దీంతో మార్జిన్ 13 శాతంగా నమోదైంది. నికర లాభం 28 శాతం వృద్ధితో (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 37 శాతం క్షీణించి) రూ.176 కోట్లకు చేరింది. ఇంధన వ్యయాలు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 15 శాతం తగ్గాయి. అలాగే రవాణా వ్యయాలు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 3 శాతం తగ్గాయి. 2015–17 సంవత్సరాల్లో అమ్మకాలు 4 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. త్వరలో ఉత్తర భారత ప్రాంతంలో ధరలు పెంచనున్నది. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మంచి వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. నిర్వహణ సమర్థవంతంగా ఉండడం, ఇంధనం, రవాణాకు సంబంధించి వ్యయ నియంత్రణ పద్ధతులు పటిష్టంగా ఉండడం, రూ.2,000 కోట్ల నికర నగదు నిల్వలు, 45–50 శాతం రేంజ్లో డివిడెండ్లు చెల్లించడం, మరో దిగ్గజ సిమెంట్ కంపెనీ ఏసీసీని విలీనం చేసుకునే అవకాశం ఉండడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. స్పైస్‌జెట్ బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.74 టార్గెట్ ధర: రూ.99 ఎందుకంటే: దేశీయ చౌక విమానయాన సంస్థల్లో అగ్రగామి కంపెనీ ఇది. ప్రస్తుతం ఆర్థిక పునర్వ్యస్థీకరణ దశలో ఉంది. తాజాగా పెట్టుబడులు సమీకరిస్తోంది. లీజుకు తీసుకున్న 17 బీ737–800 విమానాలతో సర్వీసులను నిర్వహిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం 12% వృద్ధితో రూ.1,640 కోట్లకు పెరిగింది. నికర లాభం 41% తగ్గి రూ.140 కోట్లకు పడిపోయింది. కెపాసిటీ 27 శాతం పెరిగినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 91.2 శాతంగా ఉన్న సీట్ లోడ్ ఫ్యాక్టర్ ఈ క్యూ3లో 90.7 శాతానికి తగ్గింది. ఇతర వ్యయాలు 4 శాతం తగ్గాయి. అయితే ఇంధన వ్యయాలు మాత్రం 2 శాతం పెరిగాయి. దీంతో ఇబిటాఆర్ (ఎర్నింగ్స్ బిఫోర్ ఇంటరెస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అండ్ రిస్ట్రక్చరింగ్(రెంట్)వ్యయాలు) స్వల్పంగా తగ్గి 25.4 శాతానికి చేరాయి. ఈ ఏడాది జనవరిలో 205 విమానాల డెలివరీకి సంబంధించి బోయింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 2,200 కోట్ల డాలర్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద వాణిజ్య వైమానిక ఒప్పందం. ఈ 205 విమానాల్లో 155 విమానాలు బోయింగ్ 737–8 మ్యాక్స్ మోడల్‌వి. ఈ మ్యాక్స్ విమానాల వల్ల ఇంధన వ్యయాలు 20 శాతం తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఇబిటా 17 శాతం, నికర లాభం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. విమానయాన ఇంధనం ధరలు పెరిగితే అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. మొత్తం నిర్వహణ వ్యయాల్లో 40 శాతం వరకూ ఈ ఇంధన వ్యయాలే ఉంటాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తే, కార్పొరేట్, లీజర్ ట్రావెల్ డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా లోడ్ ఫ్యాక్టర్ తగ్గి లాభదాయకత క్షీణిస్తుంది. ప్రభుత్వ నియమనిబంధనల్లో అనిశ్చితి, డాలర్‌తో రూపాయి మారకంలో ఒడిదుడుకులు.. ఇవన్నీ ప్రతికూలాంశాలు. -
స్టాక్స్ వ్యూ
ఫైనాన్షియల్ బేసిక్స్.. లిక్విడ్ ఫండ్స్ చిన్న ఇన్వెస్టర్లకు అనువేనా? దేశంలో లిక్విడ్ ఫండ్స్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో పెద్ద, సంస్థాగత ఇన్వెస్టర్లే వాటిల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారు. గతంలో వీటిని రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ చేద్దామనే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. లిక్విడ్ ఫండ్స్ అందిస్తోన్న పలు సౌలభ్యాలు, ప్రయోజనాల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉండటం, ఆన్లైన్ బ్యాంకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడం, లిక్విడ్ ఫండ్స్ అందిస్తున్న ప్రయోజనాలు, డైరెక్ట్ ప్లాన్లు తేవటం, లిక్విడిటీ వంటి పలు అంశాల వల్ల చిన్న ఇన్వెస్టర్లు లిక్విడ్ ఫండ్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. నెఫ్ట్, డైరెక్ట్ డెబిట్/క్రెడిట్, స్వైప్ వంటి పలు ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసుల వల్ల వీటి దైనందిన ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలు సులభతరమయ్యాయి. లిక్విడ్ ఫండ్స్ ప్రత్యేకతలు ఇవి డెట్ మ్యూచువల్ ఫండ్స్ కిందకు వస్తాయి. ఈ ఫండ్స్ మన డబ్బుల్ని ట్రెజరీ బిల్లులు, గవర్నమెంట్ సెక్యూరిటీస్, వాణిజ్య పత్రాలు వంటి స్వల్పకాలిక మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో రిస్క్, ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయి. ఎగ్జిట్‌లోడ్ భారం ఉండదు. తక్కువ మెచ్యూరిటీ కాలం వల్ల వీటికి ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో లాకిన్ పీరియడ్ ఉండదు. సియట్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.1,130 టార్గెట్ ధర: రూ.1,406 ఎందుకంటే: ఆర్పీ గోయెంకా గ్రూప్‌లో ప్రధాన కంపెనీ. ఆదాయం పరంగా భారత్‌లో నాలుగో అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ ఇదే. 4,500కు పైబడిన డీలర్లతో, 33 రీజినల్ ఆఫీసులతో, 400కు పైగా ఫ్రాంచైజీలతో, 6 ప్లాంట్లతో, 250కు పైగా డిస్ట్రిబ్యూటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్జిన్లు తక్కువగా ఉండే బస్సు, ట్రక్కు టైర్ల తయారీ నుంచి మార్జిన్లు అధికంగా ఉండే టూ వీలర్, ప్రయాణికుల వాహన టైర్ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. మార్కెటింగ్, బ్రాండింగ్‌పై అధికంగా వ్యయం చేసింది. దీంతో 2010–11లో 8 శాతంగా ఉన్న 2వీలర్ టైర్ల మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతానికి (ఎంఆర్ఎఫ్ తర్వాత రెండో స్థానం ఈ కంపెనీదే), ప్రయాణికుల వాహన టైర్ల మార్కెట్ వాటా 4 శాతం నుంచి 9 శాతానికి పెరిగాయి. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయంలో టూ వీలర్ టైర్ల వాటా 38 శాతానికి, ప్రయాణికుల వాహన టైర్ల వాటా 49 శాతానికి పెరుగుతాయని అంచనా. ఫలితంగా రబ్బర్ ధరల్లో ఒడిదుడుకులు వచ్చినా, మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ రెండు సెగ్మెంట్లలో(టూ వీలర్, ప్రయాణికుల వాహనాలు) చైనా టైర్ల నుంచి పోటీ తక్కు వగా ఉండడం కంపెనీకి కలసివస్తోంది. మార్జిన్లు అధికంగా ఉండే ఆఫ్–వే టైర్స్(ఓహెచ్‌టీ) సెగ్మెంట్లో ఇటీవలే ప్రవేశించింది. ఈ ఆఫ్–వే టైర్ల వల్ల కంపెనీ ఎగుమతులు బాగా పెరుగుతాయని, మార్జిన్లు మరింతగా మెరుగుపడతాయని భావిస్తున్నాం. శ్రీలంక అనుబంధ కంపెనీ ఏసీహెచ్ఎల్కు ఆ దేశంలో టైర్ల మార్కెట్లో 50 శాతం వాటా ఉంది. ఇబిటా మార్జిన్ 25 శాతంగా ఉంది. రెండేళ్లలో కంపెనీ మొత్తం ఆదాయం 11 శాతం, నికర లాభం 25 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. నెస్లే ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.6,254 టార్గెట్ ధర: రూ.7,417 ఎందుకంటే: ఇన్స్టంట్ నూడుల్స్, చిన్న పిల్లల ఆహార పదార్ధాల సెగ్మెంట్లలలో నెస్లే ఇండియా కంపెనీదే అగ్రస్థానం. ఇన్స్టంట్ కాఫీ, చాక్లెట్ల సెగ్మెంట్లో రెండో స్థానంలో ఉంది. పెద్ద కరెన్సీ నోట్ల ప్రభావం అధికంగానే ఉన్నప్పటికీ, నెస్లే ఇండియా గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో మంచి ఆర్థిక ఫలితాలనే ప్రకటించింది. ఆదాయం 16% వృద్దితో రూ.2,261 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు 36% పెరగడం, న్యాయ వివాదాల పరిష్కారం కోసం రూ.81 కోట్ల కేటాయింపులు కారణంగా నికర లాభం రూ.215 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్ మ్యాగీ నూడుల్స్‌లో మోతాదుకు మించిన సీసం ఉందనే అంచనాలతో 2015 జూన్‌లో నిషేధం విధించారు. మ్యాగీ సురక్షితమేనని వివిధ లేబరేటరీల్లో తేలడంతో అదే ఏడాది నవంబర్‌లో నెస్లే కంపెనీ మ్యాగీ ఉత్పత్తులను మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. దాదాపు ఏడాది తర్వాత కోల్పోయిన మార్కెట్ వాటాను మళ్లీ సాధించింది. గత ఏడాది చివరి ఆరు నెలల్లో నెస్లే కంపెనీ– మ్యాగీ, పాలు, చాక్లెట్ల కేటగిరీల్లో 30 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. మరో ఐదు కొత్త కేటగిరిల్లోకి– నెస్ప్రెస్సో(కాఫీ మెషీన్), డాల్సే గస్టో(కాఫీ క్యాప్సూల్ సిస్టమ్), పెట్‌కేర్, హెల్త్‌కేర్, స్కిన్ కేర్ల్లోకి ప్రవేశిస్తోంది. బ్రాండ్ ఇమేజ్, ప్రచారానికి అధికంగా నిధులు ఖర్చు చేయడం వంటి అంశాల కారణంగా ఈ సెగ్మెంట్లలలో కూడా నెస్లే నిలదొక్కుకోగలదని భావిస్తున్నాం. చాక్లెట్ల కేటగిరిలో క్యాడ్బరీస్ నుంచి, పాల ఉత్పత్తుల కేటగిరిలో అమూల్, బ్రిటానియాల నుంచి పోటీ పెరుగుతుండడం ప్రతికూలాంశం. మధ్య తరగతి, అధికాదాయం గలవారే అధికంగా ఈ కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నందున ఉత్పత్తుల ధరలను పెంచినా, అమ్మకాలు తగ్గకపోవడం కంపెనీకి కలసివచ్చే అంశం. -
స్టాక్స్ వ్యూ
హిందాల్కో బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.172 టార్గెట్ ధర: రూ.234 ఎందుకంటే: హిందాల్కో.. పటిష్టమైన బిజినెస్ మోడల్ కంపెనీ సొంతం. మైనింగ్ కార్యకలాపాలు, వాహనాలకు, బేవరేజేస్ క్యాన్లకు అవసరమయ్యే అల్యూమినియం ఉత్పత్తులందిస్తోంది. స్పెషల్ గ్రేడ్ అల్యూమినాను తయారు చేస్తోంది. కంపెనీ పూర్తి రుణభారాన్ని తీర్చివేయగలిగే స్థాయిలో స్పెషల్ గ్రేడ్ అల్యూమినా వ్యాపారం ఉంది. దేశీయంగా బొగ్గు, బాక్సైట్ సరఫరాలు మెరుగుపడడం వల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల వల్ల రవాణా వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం.. వల్ల అల్యూమినియం వ్యాపారానికి బాగా ప్రయోజనం కలుగుతోంది. సొంత బాక్సైట్ గనులు, అల్యుమినా రిఫైనరీ, విద్యుత్ ప్లాంట్ల కోసం గతంలో పెట్టిన 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఫలాలు ఇప్పుడు కంపెనీకి అందుతున్నాయి. అధిక మార్జిన్లు వచ్చే వాహన విడిభాగాల కోసం అమెరికాలో డిమాండ్ పెరగడం వల్ల హిందాల్కో అనుబంధ కంపెనీ, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నొవాలిస్ వార్షిక ఇబిటా 110 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత్‌లో బెంచ్‌మార్క్ వడ్డీరేట్లు తగ్గుతుండడం వల్ల, అమెరికాలో బాండ్ల రీఫైనాన్స్ వల్ల కంపెనీ రుణ, వడ్డీ భారాలు తగ్గనున్నాయి. ఇప్పటికే నొవాలిస్ కంపెనీ 250 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేసింది. దీంతో 5.5 కోట్ల డాలర్ల వడ్డీ ఆదా అయింది. మరో 200 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేయనున్నది. ఫలితంగా మరో 2.5 కోట్లు డాలర్లు ఆదా కానున్నాయి. వడ్డీరేట్ల తగ్గుదల వల్ల భారత్‌లో 3 కోట్ల డాలర్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. పదేళ్ల తర్వాత కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్, తరుగుతున్న రుణ, వడ్డీ భారాలు ఈక్విటీ విలువను పెంచుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడం, అధిక లాభాలు వచ్చే వాహన కంపెనీలకు హిందాల్కో అనుబంధ కంపెనీ నొవాలిస్ అమ్మకాలు పెరగడం, మూలధన కేటాయింపుల్లో గట్టి క్రమశిక్షణ, జోరుగా ఉన్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్(ఎఫ్‌సీఎఫ్), రుణాలను రీ ఫైనాన్స్ చేయడం ద్వారా బాగా తగ్గుతున్న వడ్డీ భారం (ఏడాదికి 11 కోట్ల డాలర్ల వడ్డీ వ్యయాలు ఆదా అవుతాయని అంచనా)... ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ బీఎన్పీ పారిబా ప్రస్తుత ధర: రూ.1,248 టార్గెట్ ధర: రూ.1,400 ఎందుకంటే: ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోల్చితే మంచి స్థాయిలో ఉంది. దేశవ్యాప్తంగా 2,400 నగరాలు, పట్టణాలకు అందుబాటులో ఉండేలా 285 కార్యాలయాలతో సేవలందిస్తోంది. గత రెండేళ్లుగా దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తక్కువ మొండి బకాయిలతో ఆరోగ్యకరమైన పనితీరును సాధించింది. వ్యక్తిగత రుణ సెగ్మెంట్లో మంచి వ్యాపారం సాధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. రుణ నాణ్యత నిలకడగా ఉంది. స్థూల మొండి బకాయిలు 1 బేసిస్ పాయింట్ మాత్రమే పెరిగి 0.8%కి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో నిర్వహణ ఆస్తులు 17% వృద్ధి చెందాయి. అయితే రియల్టీ రంగంలో మందగమనం కారణంగా కార్పొరేట్ రుణ వృద్ధి 13%గానే ఉంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా రియల్టీ ధరలు తగ్గడం వల్ల కంపెనీపై ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. మొత్తం లోన్‌బుక్‌లో ఆస్తుల తనఖాగా ఇచ్చిన రుణాలు 5%గా ఉండడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర వడ్డీ ఆదాయం 11% వృద్ధి చెందింది. పోటీ పెరగడం, అధిక మార్జిన్లు వచ్చే కార్పొరేట్ రుణ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ 7 బేసిస్ పాయింట్లు తగ్గి 3.1%కి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో రుణ వృద్ధి మందగించినా, ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండడంతో దీర్ఘకాలంలో హెచ్‌డీఎఫ్‌సీకి ఢోకా లేదని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో హౌసింగ్ ఫైనాన్స్ రంగంపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశాలే ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి వృద్ధి, మార్జిన్లు నిలకడగా వృద్ధి సాధిస్తుండడం, రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉండడం సానుకూలాంశాలు. అనుబంధ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గృహ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాలు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నాయి. రెండేళ్లలో నికర వడ్డీ ఆదాయం 12%, నికర లాభం 14% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. రెండేళ్లలో స్థూల మొండి బకాయిలు 1%గానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. -
స్టాక్స్ వ్యూ
పెట్రోనెట్ ఎల్ఎన్జీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.368 టార్గెట్ ధర: రూ.411 ఎందుకంటే: గెయిల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ కంపెనీల జాయింట్‌వెంచర్‌గా పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా 2015లో 245 మిలియన్‌టన్నుల(ఎంఎంటీ) ఎల్ఎన్జీ ట్రేడయింది. 142 ఎంఎటీ వార్షికోత్పత్తి సామర్త్యం గల ఎల్ఎన్జీ టెర్మినల్లు వివిధ దశల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఎల్ఎన్జీ కాంట్రాక్టులకు సంబంధించి డిస్టినేషన్ క్లాజ్‌ను జపాన్ ఫెయర్ ట్రేడ్ కమిషన్ తొలగిస్తే మార్కెట్లోకి మరింతగా ఎల్ఎన్జీ సరఫరాలు పెరుగుతాయి. దీంతో డిమాండ్ మందగమనంగా ఉండే అవకాశాలున్నాయి. ముడి చమురు ధరలు పెరిగినా కానీ, దీర్ఘకాలం పాటు ఎల్ఎన్జీ ధరలు బలహీనంగా ఉండే అవకాశాలున్నాయి. జీఎస్పీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియమ్ కార్పొరేషన్)ముంద్రా టెర్మినల్, ఇండియన్ ఆయిల్ ఎన్నోర్ టెర్మినల్ల నుంచి ఈ కంపెనీకి తీవ్రమైన పోటీ ఎదురుకానున్నది. అయితే జీఎస్పీసీ ముంద్రా టెర్మినల్ ఈ ఏడాది జూలైకల్లా అందుబాటులోకి వచ్చినప్పటికీ, పైప్‌లైన్ కనెక్టివిటీ మరో రెండేళ్ల దాకా సమస్యాత్మకంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎన్నోర్ టెర్మినల్ 2018కు గానీ పూర్తవదు. ఈ టెర్మినల్‌కు సంబంధించి పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో కూడా పెద్దగా పురోగతి లేదు. ఇక పెట్రోనెట్ ఎల్ఎన్జీకి చెందిన దహేజ్ టెర్మినల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 15 ఎంఎంటీకు పెరగనున్నది. కోచి–మంగళూర్ పైప్‌లైన్ పనులు మొదలయ్యాయి. ఈపైప్‌లైన్ త్వరలోనే పూర్తవగలదని అంచనా. మరోవైపు విదేశాల్లో కూడా ఎల్ఎన్జీ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. గత నెలలో ఈ షేర్ 8 శాతం వరకూ తగ్గింది. ఈ షేర్ ఈ స్థాయిలో తగ్గడంతో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది మంచి అవకాశమని భావిస్తున్నాం. ఇండియన్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.221 టార్గెట్ ధర: రూ.275 ఎందుకంటే: మిడ్‌సైజ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫండమెంటల్స్పరంగా పటిష్టంగా ఉన్న బ్యాంక్ ఇది. ఆరోగ్యకరమైన స్థాయలో మూలధనం(14.3 శాతం), 2.64 స్థాయిలో నికర వడ్డీ మార్జిన్లు ఆర్జించగలిగే సత్తా, తక్కువ వ్యయమయ్యే డిపాజిట్లు(34 శాతం) ఈ బ్యాంక్‌కు ఉన్న సానుకూలాంశాలు. ఒత్తిడి అధికంగా ఉండే రంగాలకు రుణాలు తక్కువగా ఇవ్వడం ఈ బ్యాంక్‌కు కలసివచ్చే అంశం. టైర్ వన్మూలధనం 13 శాతంగా ఉండటంతో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండగలదని అంచనా. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇదే కీలకాంశం. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల్లోకి భారీగా డిపాజిట్లు వచ్చాయి. అధిక స్థాయిలో (2,597) బ్రాంచ్‌లు ఉండటంతో ఈ డిపాజిట్ల ద్వారా ప్రయోజనం పొందే బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. ట్రెజరీ లాభాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 12–18 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నాం. 2015 వరకూ రుణవృద్ధి 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇది పరిశ్రమ సగటు కన్నా అధికం. ప్రస్తుతం రూ.1,22,563 కోట్ల రుణాలు ఇచ్చింది. వీటిల్లో కార్పొరేట్ రంగ రుణాలు 47 శాతంగా, ఎంఎస్ఎంఈ రంగం 16 శాతం, వ్యవసాయం 20 శాతం, రిటైల్ రంగ రుణాలు 16 శాతంగా ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్ల రుణాలపై అధికంగా దృష్టి పెడుతోంది. ఫలితంగా వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం రుణాలు 10% చక్రగతి వృద్ధితో రూ.1,56,493 కోట్లకు పెరుగుతాయని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా నికర వడ్డీ మార్జిన్లు 2.5–2.6 శాతం రేంజ్లో ఉండగలవని అంచనా వేస్తున్నాం. అలాగే నికర లాభం 51 శాతం చక్రగతి వృద్ధితో రూ.1,621 కోట్లకు చేరగలదని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అడ్జెస్ట్డ్ బుక్‌వేల్యూ(ఏబీవీ)కి 1.1 రెట్ల ధరను టార్గెట్ ధరగా నిర్ణయించాం. -
స్టాక్స్ వ్యూ
కోల్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్, ప్రస్తుత ధర: రూ.288 టార్గెట్ ధర: రూ.340 ఎందుకంటే: కోల్ ఇండియా..ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటి. అపారంగా బొగ్గు నిల్వలున్నాయి. 88.4 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ప్రస్తుతం 413 గనులను నిర్వహిస్తోంది. విద్యుత్తు, ఉక్కు, సిమెంట్, రక్షణ, ఎరువులు, తదితర రంగాలకు బొగ్గు సరఫరా చేస్తోంది. భారత్‌లో ఉత్పత్తవుతున్న బొగ్గులో 85 శాతం వాటా, అమ్మకాల్లో 65 శాతం వాటా ఈ కంపెనీదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఉద్యోగుల వ్యయాలు అధికంగా ఉండడం, ఈ–వేలం ఆశించిన స్థాయిలో లేకపోవడం దీనికి కారణాలు. ఈ కంపెనీ రూ.16,212 కోట్ల నికర నిర్వహణ ఆదాయం ఆర్జించింది. ఇబిటా రూ.743 కోట్లుగా ఉంది. రూ.711 కోట్ల ప్రత్యేక కేటాయింపుల కారణంగా ఉద్యోగుల వ్యయాలు పెరిగాయి. నికర లాభం 77 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 80 శాతం)క్షీణించి రూ.600 కోట్లకు తగ్గింది. సాధారణంగా రెండో క్వార్టర్ సీజనల్‌గా బలహీనంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం, వచ్చే ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు రావచ్చని అంచనా. బొగ్గు దిగుమతులు బాగా తగ్గించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంపై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా మూడేళ్లలో బొగ్గు ఉత్పత్తి 6 శాతం చక్రగతి వృద్ధితో 605 మిలియన్ టన్నులకు, బొగ్గు అమ్మకాలు కూడా 6 శాతం చక్రగతి వృద్ధితో 600 మిలియన్ టన్నులకు పెరగవచ్చని అంచనా. ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండడం, డివిడెండ్ చెల్లింపులు బాగా ఉండడం, బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండడం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండడం తదితర కారణాల వల్ల దీర్ఘకాలానికి ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. జాగరణ్ ప్రకాశన్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్, ప్రస్తుత ధర: రూ.165 టార్గెట్ ధర: రూ.215 ఎందుకంటే: జాగరణ్ ప్రకాశన్..ప్రాంతీయ ప్రింట్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. దైనిక్ జాగరణ్ (భారత్‌లో అత్యధిక రీడర్షిప్ ఉన్న పత్రిక) నయీ దునియా, (ఈ రెండూ హిందీ వార్తాపత్రికలు)ఇంక్విలాబ్(ఉర్దూ), పంజాబీ జాగరణ్, మిడ్ డే(సాయంకాల ఇంగ్లిష్ పత్రిక) దినపత్రికలు ఈ సంస్థ నుంచే ప్రచురణ అవుతున్నాయి. ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. నికర వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండడమే దీనికి కారణం.రాబడి 5 శాతం వృద్ధితో రూ.459 కోట్లకు పెరిగింది. ప్రకటనల ఆదాయం 5 శాతం పెరిగింది. . సర్క్యులేషన్ రాబడి 6 శాతం వృద్ధి చెందింది. ఈ క్యూ2లో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 37% పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రేడియో సిటీ ప్రకటనల ఆదాయం 35 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. వ్యయాలు పెరగడంతో ఇబిటా మార్జిన్లు 230 బేసిస్ పాయింట్లు తగ్గి 26.4 శాతానికి చేరాయి. ఉద్యోగ వ్యయాలు 10 శాతం, ఇతర వ్యయాలు 18 శాతం చొప్పున పెరిగాయి. రెండేళ్లలో ప్రకటనల రాబడి 10%, సరŠుక్యలేషన్ రాబడి 8 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, దీంతో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ముడి పదార్థాల వ్యయాలు తగ్గాయి. న్యూస్‌ప్రింట్ వ్యయాలు టన్నులకు 2–3% రేంజ్లో పెరగవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ఆదాయం 11% వృద్ధి చెందగలదని గతంలో ఆంచనా వేశాం. కానీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రకటనల ఆదాయం 9% మాత్రమే వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ షేర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 15 రెట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 13 రెట్ల చొప్పున ట్రేడవుతోంది. -
స్టాక్స్ వ్యూ
టెక్ మహీంద్రా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యస్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.430 టార్గెట్ ధర: రూ.520 ఎందుకంటే: టెక్ మహీంద్రా ఆదాయం డాలర్ల పరంగా 4 శాతం, రూపారుుల్లో 5 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన) వృద్ధి చెందింది. వివిధ సంస్థల కొనుగోళ్ల కారణంగా కంపెనీ ఈ క్యూ2లో మంచి వృద్ధిని సాధించింది. పునర్వ్యస్ఠీకరణ వ్యయాల కారణంగా మార్జిన్లు మాత్రం ఫ్లాట్‌గా 16శాతంగా ఉన్నాయి. ఇతర ఆదాయం భారీగా తగ్గడంతో నికర లాభం 17 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 14 శాతం) క్షీణించింది. ఈ క్యూ2లో 32 కోట్ల డాలర్ల విలువైన మూడు పెద్ద డీల్స్‌ను కంపెనీ సాధించింది. డీల్స్ విషయమై క్లయింట్లతో చర్చలు జరుపుతున్నామని, ఈ కారణంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న కమ్యూనికేషన్సవిభాగం రికవరీ సాధించగలదని యాజమాన్యం ఆశిస్తోంది. అలాగే ఎంటర్‌ప్రెజైస్ విభాగం కూడా నిలకడైన వృద్ధిని సాధించగలదని కంపెనీ భావిస్తోంది. కమ్యూనికేషన్స విభాగంలో కంపెనీల కొనుగోళ్లకారణంగా ఈ విభాగం మంచి వృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఎంటర్‌ప్రెజైస్ విభాగంలో కొనసాగుతున్న వృద్ధి, తయారీ, బీఎఫ్ఎస్ఐ విభాగాల్లో వృద్ధి, వ్యయ నియంత్రణ పద్ధతులు, అనుబంధ సంస్థల పనితీరు మెరుగుపడడం తదితర కారణాల వల్ల మార్జిన్లు మెరుగుపడే అవకాశాలున్నారుు. ఇటీవల కాలంలో ఈ షేర్కొంత కరెక్షన్కు గురై ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలోనే లభిస్తోందని భావిస్తున్నాం. కమ్యూనికేషన్ విభాగంలో జోరు కారణంగా టెలికం రంగంలో తన అగ్రస్థానాన్ని కంపెనీ కొనసాగించవచ్చు. డిజిటల్ విభాగంలో కంపెనీ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలాలు త్వరలో అందనున్నాయి. మార్జిన్లు మెరుగుపడడం, కంపెనీ కొనుగోలు చేసిన సంస్థల పనితీరు కూడా మెరుగుపడడం వంటి కారణాల వల్ల దీర్ఘకాలంలో కంపెనీ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం. కరెన్సీ ఒడిదుడుకులు, టెలికం విభాగానికి సంబంధించిన డీల్స్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశాలుండడం ప్రతికూలాంశాలు. మారుతీ సుజుకీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.5,715 టార్గెట్ ధర: రూ.6,765 ఎందుకంటే: భారత కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఇది. 2013-14లో 42 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 47 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.17,843 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్లు 218 బేసిస్పారుుంట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ప్రతికూలమైన కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ముడి పదార్ధాల వ్యయాలు 40 బేసిస్ పాయింట్లు పెరిగినప్పటికీ, నికర లాభం 60 శాతం వృద్ధితో రూ.2,398 కోట్లకు పెరిగింది. తగ్గుతున్న వడ్డీ రేట్లు, వర్షాలు విస్తారంగా కురియడం, ఏడవ వేతన సంఘం సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం, జీఎస్టీ అమలు కారణంగా కార్ల వ్యయాలు 4-5 శాతం వరకూ తగ్గే అవకాశాలుండడం,.. వివిధ మోడళ్లలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లను అందించనుండడం, స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా అందుబాటులోకి తేనుండడం, డిమాండ్ పెరుగుతుండటంతో డిస్కౌంట్ల భారం తగ్గనుండడం, గుజరాత్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే, (ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభం కావచ్చు) లాజిస్టిక్స్వ్యయాలు తగ్గే అవకాశాలుండడం... ఇవన్నీ కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశాలు. కార్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 16 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎగుమతులు మాత్రం ఫ్లాట్‌గా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.308 ఉంటుందని అంచనాలతో ఏడాది కాలంలో ఈ షేర్ రూ.6,765కు చేరగలదని అంచనా వేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
సన్ ఫార్మా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.868 టార్గెట్ ధర: రూ.940 ఎందుకంటే: డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 258 శాతం వృద్ధితో రూ.1,400 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,070 కోట్లకు పెరిగింది. గ్లాక్సోస్మిత్‌లైన్(జీఎస్కే) నుంచి కొనుగోలు చేసిన ఓపియేట్స్ వ్యాపారం కన్సాలిడేట్ అవుతుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. లాభదాయకం కాని విదేశీ ప్లాంట్లను మూసేసింది. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం 156 అండాలు(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్) పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన గ్లీవెక్ ఔషధానికి పోటీ తక్కువగా ఉండడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. ఈ ఔషధానికి అమెరికాలో 200 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. ర్యాన్‌బాక్సీ విలీన ఫలాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీకి అందనున్నాయి. హలోల్ ప్లాంట్‌పై యూఎస్ఎఫ్డీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఈ షేర్ 30 శాతం తగ్గింది. ఇప్పుడు ఈ హలోల్ ప్లాంట్‌ను ఈ కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో హలోల్ ప్లాంట్‌ను మళ్లీ తనిఖీ చేయాల్సిందిగా యూఎస్‌ఎఫ్‌డీఏను సన్ ఫార్మా ఆహ్వానిస్తోంది. రానున్న కాలంలో భారత్‌లో విక్రయాలు పుంజుకోనున్నాయి. మూడేళ్లలో ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. 2017-18 అంచనా ఈపీఎస్‌కు 25 రెట్లు అయిన రూ.940 టార్గెట్ ధరను ఏడాది కాలంలో ఈ షేర్ చేరుతుందని భావిస్తున్నాం. నీల్కమల్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1.102 టార్గెట్ ధర: రూ.1,215 ఎందుకంటే: మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీలో, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థ. వివిధ సెగ్మెంట్లలో విభిన్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోంది. హోమ్ బ్రాండ్ కింద లైఫ్‌స్టైల్ ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, యాక్సెసరీలను విక్రయిస్తోంది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.8 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 139 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది. అలాగే ఆదాయం రూ.422 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.428 కోట్లకు ఎగిసింది. గత క్యూ3లో రూ.5.67గా ఉన్న ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ఈ క్యూ3లో 13.53కు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో నికర లాభం 243 శాతం వృద్ధి చెంది రూ.71 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.20 కోట్లుగా ఉంది. ఏడాది కాలానికి హోమ్ బ్రాండ్ టర్నోవర్ 13 శాతం వృద్ధిని సాధించింది. షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.78గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. రెండేళ్లలో నికర లాభం 39 శాతం, నికర అమ్మకాలు 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. జమ్మూ ప్లాంట్ విస్తరణ పూర్తయి, ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభం కావడం కంపెనీకి కలసివచ్చే అంశం. మధ్య, దీర్ఘకాలినికి రూ.1215 టార్గెట్ ధరకు ప్రస్తుత ధరలో ఈ స్క్రిప్ను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
జెట్ ఎయిర్వేస్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.558 టార్గెట్ ధర: రూ.790 ఎందుకంటే: ప్యాసింజర్ ట్రాఫిక్ 21 శాతం పెరగడం, విమానయాన ఇంధనం ధరలు 31 శాతం తగ్గడంతో మూడో త్రైమాసిక కాలానికి జెట్ ఎయిర్వేస్ కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,880 కోట్లకు పెరిగింది. విమాన ఇంధనం ధరలు బాగా పడిపోవడంతో గత క్యూ3లో రూ.171 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో రూ.929 కోట్లకు పెరిగింది. జెట్‌లైట్ ఇన్వెస్ట్మెంట్స్ విలువ తగ్గిపోవడంతో వచ్చిన రూ.47 కోట్ల నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ నికర లాభం రూ.515కోట్లకు పెరిగింది. అందుకనే గత రెండేళ్లలో దేశీయ ట్రాఫిక్ అంతంత మాత్రం వృద్ధి సాధిస్తున్నా, అంతర్జాతీయ ట్రాఫిక్ దన్నుతో జెట్ ఎయిర్వేస్ మంచి రాబడి సాధిస్తోంది. అంతేకాకుండా కరెన్సీ ఒడిదుడుకులకు సహజమైన హెడ్జింగ్‌గా అంతర్జాతీయ సెగ్మెంట్ పనిచేస్తోంది. గత నాలుగేళ్లలో దేశీయ రూట్ల ఆదాయం 8 శాతం చక్రగతిన వృద్ధి సాధించగా, అంతర్జాతీయ సెగ్మెంట్ ఆదాయం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను ఎతిహాద్ కంపెనీ కొనుగోలు చేయడం అంతర్జాతీయ సెగ్మెంట్ వృద్ధికి తోడ్పడింది. ఎతిహాద్‌తో కుదుర్చుకున్న కొత్త కోడ్-షేరింగ్ ఒప్పందం జెట్ ఎయిర్వేస్కు ప్రయోజనం కలిగించనున్నది. దీర్ఘకాలంలో కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. దేశీయ సెగ్మెంట్లో కొత్త కంపెనీల రాకతో పోటీ తీవ్రమవుతోంది. అయితే విమానయాన ఇంధనం ధరలు బాగా తగ్గడం కలసివస్తోంది. రెండేళ్లలో ఆదాయం 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఏడాది కాలానికి ఈ షేర్ రూ.790కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేస్తున్నాం. అశోక్ లేలాండ్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.91 టార్గెట్ ధర: రూ.111 ఎందుకంటే: భారత్‌లో వాణిజ్య వాహనాలు తయారు చేసే రెండో అతి పెద్ద కంపెనీ. మధ్య, భారీ తరహా వాణిజ్య వాహన(ఎంహెచ్‌సీవీ) మార్కెట్లో కంపెనీ మార్కెట్ వాటా 28 శాతంగా ఉంది. మూడో త్రైమాసిక కాలానికి ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. వాహన విక్రయాలు 23 శాతం పెరగడంతో ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.4,085 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.430 కోట్లకు వృద్ధి చెందింది. రూ.205 కోట్ల నికర లాభం సాధించింది. వరుసగా నాలుగో క్వార్టర్లోనూ మార్జిన్లలో రెండంకెల వృద్ధి సాధించింది. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటం, డీజిల్ ధరలు తగ్గుతుండటంతో లాభదాయకత పెరుగుతుండడం, మౌలిక, మైనింగ్ రంగాల్లో జోరు పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకుంటుండటంతో రవాణా, ట్రక్కు ఆపరేటర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. దీంతో ఎంహెచ్‌సీవీ సెగ్మెంట్ రెండంకెల వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో సన్‌షైన్ పేరుతో ప్యాసింజర్ వేరియంట్‌ను, గురు పేరుతో గూడ్స్ క్యారియర్‌ను అందించనున్నది. తక్కువ స్థాయిల్లో ఉన్న కమోడిటీ ధరలు మరికొంత కాలం కొనసాగుతాయని, ఫలితంగా ముడిసరుకు వ్యయాలు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది కాలానికి ఈ షేర్ రూ.111కు ధరను చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
యస్ బ్యాంక్: కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ. 724 టార్గెట్ ధర: రూ.805 ఎందుకంటే: భారత్‌లో ప్రైవేట్‌రంగంలోని ఐదవ అతి పెద్ద బ్యాంక్. ఖాతాదారుడే కేంద్రంగా అత్యున్నత స్థాయి సేవలందిస్తోంది. కార్పొరేట్, ఇన్స్టిట్యూషన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, బ్రాంచ్ బ్యాంకింగ్, బిజినెస్ అండ్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్.. తదితర రంగాల్లో సేవలందిస్తోంది. 2020 కల్లా అత్యున్నత స్థాయి సేవలందించే భారతీయ బ్యాంక్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 700 బ్రాంచీలు, 1,371 ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 29 శాతం వృద్ధితో రరూ.856 కోట్లకు, నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.610 కోట్లకు పెరిగాయి. కరంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్లు(కాసా) డిపాజిట్లు 40 శాతం పెరిగాయి. బాసెల్ త్రి నిబంధనల కింద క్యాపిటల్ అడెక్వసీ రేషియో 14.9 శాతంగానూ, టైర్ వన్ క్యాపిటల్ 10 శాతంగానూ ఉన్నాయి. డిపాజిట్లు 24 శాతం వృద్ధితో రూ.99,344 కోట్లకు, రుణాలు 29 శాతం వృద్ధితో రూ.80,015 కోట్లకు పెరిగాయి. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం ఇటీవలనే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందింది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ(గిఫ్ట్) సిటీలో ఐఎఫ్ఎస్సీ బ్యాంక్ యూనిట్‌ను ప్రారంభించింది. స్థూల మొండి బకాయిలు 0.61 శాతంగానూ, నికర మొండి బకాయిలు 0.2 శాతంగానూ ఉన్నాయి. రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ) కోసం బ్లూ డార్ట్, స్నాప్‌డీల్ సంస్థలతో ఇటీవలనే ఒప్పందాలు కుదుర్చుకుంది. రెండేళ్లలో నికర ఆదాయం 15 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మార్కెట్ ధరకు, పుస్తక ధరకు మధ్య వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలో 2.14గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.82 గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. ఇంద్రప్రస్థ గ్యాస్: కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ. 513 టార్గెట్ ధర: రూ.580 ఎందుకంటే: వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందంటూ, ఢిల్లీలో కొంత కాలం వరకూ డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు పదేళ్ల కాలం మించిన డీజిల్ వాహనాలను రెన్యూవల్‌కు అనుమించవద్దని జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ గుండా ప్రయాణించే తేలిక, మధ్య, భారీ రకం వాణిజ్య వాహనాలపై పర్యావరణ పరిహార చార్జీని సుప్రీం కోర్టు దాదాపు రెట్టింపు చేసింది. దీంతో ఈ వాహనాల సంఖ్య తగ్గి సీఎన్జీతో నడిచే వాహనాల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఈ అంశాల కారణంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీ సీఎన్జీ విక్రయాలు పెరుగుతాయని అంచనా. సీఎన్జీ ఇంధనంతో నడిచే పదివేల ఆటో రిక్షాలకు అనుమతివ్వడానికి చర్యలు తీసుకోవడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీఎన్జీతో నడిచే సిటీబస్సుల కొనుగోళ్లకు ఆమోదం లభించనుండడం.. వంటి అంశాల వల్ల భవిష్యత్తులో సీఎన్జీ అమ్మకాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ కంపెనీకి 326 సీఎన్జీ అవుట్లెట్లు ఉన్నాయి. రెండేళ్లలో వంద కొత్త సీఎన్జీ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేయడం ద్వారా తన నెట్‌వర్క్‌ను కంపెనీ 30 శాతం విస్తరిస్తోంది. కంపెనీ మొత్తం విక్రయాల్లో 75 శాతం వాటా సీఎన్జీ విభాగానిదే. మార్జిన్లు కూడా ఈ విభాగం నుంచే అధికంగా వస్తున్నాయి. డిమాండ్ పెరిగితే అమ్మకాలూ, మార్జిన్లు పెరుగుతాయ్. మరోవైపు దేశీయంగా గ్యాస్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో మార్జిన్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఐదేళ్లుగా సీఎన్జీ విక్రయాలు 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రెండేళ్లలో ఈ విక్రయాలు రెండంకెల వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఎన్బీసీసీ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,017 టార్గెట్ ధర: రూ.1,145 ఎందుకంటే: నేషనల్ బిల్డింగ్స్ కన్స్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1960 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. 2014లో నవరత్న హోదా సాధించింది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్(ఈపీసీ), రియల్ ఎస్టేట్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రూ.843గా ఉన్న నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 36 శాతం వృద్ధి చెంది రూ.1,149 కోట్లకు పెరిగాయి. నికర లాభం రూ.32 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.43 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం. జౌళి మంత్రిత్వ శాఖ నుంచి వారణాసిలో ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసే రూ.197 కోట్ల ప్రాజెక్ట్‌ను ఇటీవలనే సాధించింది. వివిధ క్లయింట్ల నుంచి ఈ సంస్థ సాధించిన వ్యాపారం ఈ ఏడాది ఆగస్టులో రూ.387 కోట్లుగానూ, గత నెల్లో రూ.277 కోట్లుగానూ ఉంది. ఈ కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. 132 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయి వ్యాపారాన్ని సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళ్లలో ఈ కంపెనీ నికర అమ్మకాలు 16 శాతం, నికర లాభం 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.1,145 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను రికమెండ్ చేస్తున్నాం. కోల్గేట్ పామోలివ్ బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.904 టార్గెట్ ధర: రూ.811 ఎందుకంటే: గత పదేళ్లలో భారత టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఈ కంపెనీకి పోటీ అంతకంతకూ తీవ్రమవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి కేటగరీలో అగ్రస్థానంలో ఉండగా, కోల్గేట్-పామోలివ్ కంపెనీ మాత్రం ఒక్క కేటగిరీ(టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్‌ల)పై మాత్రమే దృష్టిసారిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ అనిశ్చితిగా ఉండటంతో అమ్మకాల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండగలదని భావిస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్‌లోని కంపెనీ ప్లాంట్లకు లభించే ద్రవ్య ప్రోత్సాహకాల కాలపరిమితి ముగింపునకు వచ్చింది. గత ఐదేళ్లలో 13% చొప్పున వృద్ధి సాధించిన టూత్‌బ్రష్, టూత్ పేస్టుల మార్కెట్ రానున్న ఐదేళ్లలో 10% లోపే చక్రగతిన వృద్ధి సాధిస్తుందని యూరోమానిటర్ సంస్థ అంచనా వేస్తోంది. కంపెనీ ఆదాయంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో 18%గా ఉన్న టూత్‌పేస్ట్‌ల ఆదాయం 2014-15లో 12%కి తగ్గింది. టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌ల మార్కెట్ సంతృప్త స్థాయికి చేరడంతో కంపెనీలు తమ తమ మార్కెట్ వాటా పెంచుకోవడం కొంచెం కష్టసాధ్యమైన విషయమే. పోటీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ పెప్పొడెంట్, క్లోజప్ల్లో కొత్త కొత్త ఉత్పత్తులను తీసుకురావడమే కాకుండా ప్రచారం భారీగా చేస్తోంది. ఈ విషయంలో కోల్గేట్ పామోలివ్ వెనకబడి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. హిందుస్తాన్ యూనిలివర్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.785 టార్గెట్ ధర: రూ.1,017 ఎందుకంటే: సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మార్కెట్లో సర్ఫ్, లైఫ్‌బాయ్, లక్స్, లిరిల్, రెక్సోనా, డవ్, పియర్స్, హమామ్, వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ వంటి బ్రాండ్లతో, సన్‌సిల్క్, లిప్టన్ గ్రీన్ టీ, బ్రూ గోల్డ్, ఫ్లేవర్డ్ టీ బ్యాగ్స్ వంటి బ్రాండ్లతోనూ వ్యాపారం నిర్వహిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్, లాక్మే, క్లినిక్ ప్లస్, క్లోజప్, తదితర బ్రాండ్లతో ఓరల్, హెయిర్, స్కిన్ కేర్ సెగ్మెంట్లతో తన మార్కెట్ వాటాను మరింత పటిష్టం చేసుకుంటోంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. నికర అమ్మకాలు 5 శాతమే పెరగ్గా, నికర లాభం 2.6 శాతం క్షీణించింది. పన్ను ప్రయోజనాలు తొలగిపోవడం, ఆర్థిక వృద్ధి మందగమనం ఫలితాలపై ప్రభావం చూపా యి. అయితే అమ్మకాలు 7%, నిర్వహణ మార్జిన్లు 41 బేసిస్ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరాయి. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో ఉత్పత్తుల ధరలను కొంత మేర తగ్గించింది. అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నా, ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ కంపెనీకే అధిక ప్రయోజనమని భావిస్తున్నాం. మూడేళ్లలో అమ్మకాలు 14%. నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో నిర్వహణ మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 18%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18.5% మెరుగుపడతాయని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.722 టార్గెట్ ధర: రూ.840 ఎందుకంటే: ప్రైవేట్ రంగంలో రెండో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కంపెనీ ఆస్తులు రూ.57,231 కోట్లుగా ఉన్నాయి. 220 బ్రాంచీలతో 2,000 మంది శిక్షణ పొందిన ఉద్యోగులతో హౌసింగ్ ఫైనాన్స్ సేవలందిస్తోంది. వేతనాలు పొందే ఉద్యోగులకు, స్వయం ఉపాధి పొందేవారికి, వ్యాపారస్తులకు త్వరితగతిన, సౌకర్యవంతమైన తగిన రీతి వడ్డీరేట్లతో గృహరుణాలనందిస్తోంది. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,901 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు, ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.1,828 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి నగదు, నగదు సమాన నిల్వలు, ఇన్వెస్ట్మెంట్స్ కలిపి రూ.9,552 కోట్లుగా ఉన్నాయి. బెస్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అసోచామ్ హౌసింగ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఈ ఏడాది ఈ కంపెనీకే లభించింది. కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 17 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మార్కెట్ ధరకు, పుస్తక ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 2.9గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.3గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.840 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తున్నాం. ఆర్థిక సెంటిమెంట్ పుంజుకుంటుండటం, రుణగ్రస్తుల ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, ప్రాపర్టీల ధరలు తగ్గుతుండడం, వడ్డీరేట్లు దిగివస్తుండడం, చౌక ధరల్లో గృహాలందించడానికి జోరుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుండడం... ఇవన్నీ కంపెనీకి కలిసివచ్చే అంశాలు. జస్ట్ డయల్: కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.990 టార్గెట్ ధర: రూ.1,200 ఎందుకంటే: భారత్‌లో అతిపెద్ద లోకల్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థల, ఉత్పత్తుల, సేవల సమాచారాన్ని, సమీక్షలను వినియోగదారులకు అందిస్తోంది. ఇంటర్నెట్, మొబైల్ ఇంటర్నెట్, టెలిఫోన్(వాయిస్), ఎస్ఎంఎస్... ఇలా విభిన్నమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులకు ఆ వివరాలనందిస్తోంది. లోకల్ సెర్చ్ బిజినెస్‌లో అగ్రస్థానం ఈ కంపెనీదే. 2,000 నగరాల్లో కోటిన్నరకు పైగా లిస్టింగ్స్(వ్యాపార సంస్థల, ఉత్పత్తుల వివరాలు) ఉన్నాయి. 9,500 మంది ఉద్యోగుల సేవలతో ఈ డేటాబేస్‌ను జస్ట్ డయల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. ఈ కంపెనీ అందిస్తున్న సెర్చ్ ప్లస్ ఫీచర్ ద్వారా లోకల్ సెర్చింగ్ కంపెనీ నుంచి లావాదేవీలు నిర్వహించే కంపెనీగా రూపాంతరం చెందనున్నది. పూర్తి ప్రయోజనాలు రానున్న 2-3 ఏళ్లలో కనిపిస్తాయని అంచనా. ఈ ఏడాది అక్టోబర్‌లో సెర్చ్ ప్లస్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత విస్తృతంగా తీసుకురానున్నది. సినిమా టికెట్ల బుకింగ్, క్యాబ్, బస్, విమానటికెట్ల బుకింగ్, రెస్టారెంట్లకు సంబంధించి ఆర్డరింగ్, టేబుల్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి సేవలను సెర్చ్ ప్లస్ ఆఫర్ చేస్తోంది. జేడీ సెర్చ్‌ప్లస్ ప్లాట్‌ఫారమ్ కింద ఆన్లైన్ ఫుడ్ డెలివరి,వైన్ డెలివరి, డాక్టర్ అపాయింట్మెంట్, ట్యాక్స్ బుకింగ్స్ వంటి 57 రకాల ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తోంది. లిస్టింగ్స్, లావాదేవీలను కలగలిపిన సేవలను సెర్చ్‌ప్లస్ అందించనున్నది. ఆర్బీఐ నుంచి కొన్ని అనుమతులు రావలసి ఉన్నం దున జేడీ వాలెట్‌ను వాయిదా వేసిన కంపెనీ యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ వాలెట్‌ను అందించాలని యోచిస్తోంది. జస్ట్ డయల్ గ్యారంటీడ్, జస్ట్ డయల్ క్యాష్, ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ వంటి కొత్త సర్వీసులను అందుబాటులోకి తేనున్నది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. APPకీ కహానీ... డైలీ ఎక్స్పెన్సెస్ ఖర్చులుపెరిగిపోతున్నాయనో, వాటిపై నియంత్రణ తప్పిపోతోందనో, మీకు తెలియకుండానే ఖర్చు పెట్టేస్తున్నారనో ఇక ఎలాంటి దిగులూ అవసరం లేదు. ఎందుకంటే మీ మొబైల్లోనే మీ ఆర్థిక లావాదేవీల నిర్వహణ ఎంచక్కా ఈజీగా చేసేసుకోవటానికి చక్కని యాప్ రెడీగా ఉంది. అదే ‘డైలీ ఎక్స్పెన్సెస్’. ఇది మీ ఆదాయానికి తగినట్లుగా ఖర్చులెలా చేయాలో చెబుతుంది. తగిన సూచనలిస్తుంది. ఖర్చులను నియంత్రించి, డబ్బును పొదుపు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై లభిస్తున్న ఈ యాప్‌ను యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవీ ప్రత్యేకతలు * ఆదాయ, వ్యయాలను పరిశీలించి బడ్జెట్‌ను రూపొందిస్తుంది. * మీ ఆదాయాలకు, ఖర్చులకు సంబంధించిన లావాదేవీలను కేటగైరె జ్ చేస్తుంది. * ఆదాయ, వ్యయాలకు సంబంధించి క్రియేట్ చేసిన రికార్డులను తొలగించవచ్చు కూడా. * భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బిల్స్ రిమైండ ర్లను, బిల్స్ అలర్ట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. * ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఇంటర్నెట్ లేనపుడు ఆఫ్‌లైన్‌లో కూడా చూసుకోవచ్చు. * పాస్వర్డ్ పెట్టుకునే వీలున్న ఈ యాప్‌లో యూజర్ల సమాచారానికి కంపెనీ భరోసా ఇస్తోంది. * ఆదాయం ఎన్ని మార్గాల్లో వస్తుందో, అది ఏ విధంగా ఖర్చు అవుతుందో, ఏ ప్రాంతంలో వెచ్చిస్తున్నామో వంటి అంశాలను రోజూ వారీగా, వారం వారీగా, నెల వారీగా, నెలల వారీగా, ఏడాది వారీగా చూసుకోవచ్చు. బ్రీఫ్స్ అవైవా ధన్వృద్ధి ప్లస్ ప్రైవేటు రంగ బీమా కంపెనీ అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ ధన్వృద్ధి ప్లస్ పేరుతో పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే ఎండోమెంట్ పాలసీని మార్కెట్లోకి విడుదల చేసింది. 20 ఏళ్ల కాలపరిమితి గల ఈ పాలసీకి ప్రీమియం 5 లేదా 7 లేదా 11 ఏళ్లు చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి తర్వాత 100 శాతం ప్రీమియంతో పాటు బోనస్‌లు చెల్లించడం జరుగుతుంది. ఈ పాలసీని 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు తీసుకోవచ్చు. కోటక్ ఇండియా గ్రోత్ ఫండ్ కోటక్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఇండియా గ్రోత్’ సిరీస్-2 ఈక్విటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ ఆర్థిక వృద్ధిరేటుకు దోహదం చేసే రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇది క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 1,095 రోజుల వరకు వైదొలగడానికి ఉండదు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఎన్ఎఫ్వో అక్టోబర్ 6తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ విలువ రూ. 5,000గా నిర్ణయించారు. -
స్టాక్స్ వ్యూ
నెస్లే ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ప్రస్తుత ధర: రూ.6,087 టార్గెట్ ధర: రూ.5,614 ఎందుకంటే: కంపెనీకి చెందిన కీలకమైన బ్రాండ్ మ్యాగీ వివాదంలో చిక్కుకుంది. మ్యాగీలో పరిమితికి మించి సీసం, ఎంఎస్‌జీలు ఉన్నాయంటూ దుమారం రేగుతోంది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే దీనిని నిషేధించింది. మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బిగ్‌బజార్‌ను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ మ్యాగీ అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయించింది. ఈ వివాదం కారణంగా మ్యాగీ అమ్మకాలు తగ్గాయి. నెస్లే ఇండియా మొత్తం ఆదాయంలో మ్యాగీ వంటి ప్రిపేర్డ్ డిషెస్ సెగ్మెంట్ వాటా 30 శాతంగా ఉంది. వీటిల్లోనూ మ్యాగీ వాటానే అధికం. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తాయన్న అంచనాలు ఎఫ్ఎంసీజీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. మ్యాగీ సురక్షితమైనదేనని, ప్రచారం చేయడానికి కంపెనీ భారీ సంఖ్యలో మార్కెటింగ్ వ్యయాలు భరించాల్సి ఉంటుంది. న్యాయ స్థానాల్లో న్యాయపోరాటానికి భారీగానే వ్యయం చేయాల్సి రావచ్చు. ఇవన్నీ కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపవచ్చు. మ్యాగీ వివాదం నెస్లే ఇతర బ్రాండ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటి కారణంగా ఈ కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం చొప్పున తగ్గగలదని అంచనా వేస్తున్నాం. పవర్ గ్రిడ్ బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.145 టార్గెట్ ధర: రూ.165 ఎందుకంటే: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రసార కంపెనీల్లో ఒకటి. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,962 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,703 కోట్లకు, నికర లాభం రూ.1,175 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,412 కోట్లకు పెరిగాయి. ఇబిటా 19 శాతం వృద్ధి చెందింది. అలాగే షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.2.25 నుంచి రూ.2.7కు పెరిగింది. షేర్ వారీ ఆర్జన వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11గా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.12గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నాం. కంపెనీకి భారీగా మిగులు నిధులున్నాయి. ఇదే జోరు మరో మూడేళ్ల వరకూ కొనసాగవచ్చు. ప్రభుత్వ రంగ ఈ నవరత్న కంపెనీ పవర్టెల్ పేరుతో టెలికాం వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వింధ్యాచల్ జబల్పూర్ ట్రాన్సిమిషన్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో మెగా సోలార్ పార్క్‌ను రూ.312 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తోంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.174 టార్గెట్ ధర: రూ.287 ఎందుకంటే: పదవ ద్వైపాక్షిక వేతన సెటిల్మెంట్ కారణంగా 2013-14లో రూ.వంద కోట్లుగా ఉన్న వేతన కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.310 కోట్లకు పెరిగాయి. ఇంకా ఇతర కేటాయింపులు మొత్తం 800 కోట్లకు చేరాయి. ఇది స్థూల లాభంలో 87 శాతానికి సమానం. అయితే ట్రెజరీ ఆదాయం 610 కోట్లకు పెరగడం, తక్కువ పన్ను రేటు కొంత ఊరటనిచ్చాయి. 2011-15 మధ్యకాలంలో కొత్తగా 630 బ్రాంచీలను ఏర్పాటు చేసినప్పటికీ, బ్రాంచి వారీ సగటు ఆర్జనలో పెద్దగా మార్పులేదు. వ్యవసాయ రంగంలో మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ మొండి బకాయిలు పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ పనితీరు బాగా లేదు. రిటర్న్ ఆన్ అసెట్ 30 బేసిస్ పాయింట్లు తగ్గింది. రుణ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా పగ్గాలు చేపట్టిన ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం. టైర్-వన్ పెట్టుబడులు సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే లాభపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది. -
స్టాక్స్ వ్యూ
ఐటీసీ - బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.329, టార్గెట్ ధర: రూ.394 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం 0.6 శాతం వృద్ధితో రూ.9,290 కోట్లకు పెరిగింది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల అమ్మకాల పరిమాణం 10 శాతం తగ్గింది. వ్యవసాయ విభాగపు రాబడులు 29 శాతం తగ్గాయి, కొత్త కంపెనీల చట్టం ప్రకారం అదనపు తరుగుదల వ్యయాల కారణంగా హోటల్ విభాగం రాబడులు కూడా తగ్గాయి. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు 11 శాతం వృద్ధిని సాధించాయి. వచ్చే బడ్జెట్లో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం హేతుబద్ధీకరణ జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి సిగరెట్ల విభాగం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు కూడా దూసుకుపోతుండడం సానుకూలాంశం. 2007-08లో 16 శాతంగా ఉన్న మొత్తం అమ్మకాల్లో ఎఫ్ఎంసీజీ వాటా 2013-14లో 25 శాతానికి పెరిగింది. ఇదే జోరు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. కొత్త కొత్త కేటగిరీల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలనే సావ్లాన్, షవర్ టు షవర్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఎస్బీఐ - బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.282, టార్గెట్ ధర: రూ.357 ఎందుకంటే: ట్రెజరీ ఆదాయం 314 శాతం పెరగడం, ఆదాయపు పన్ను రీఫండ్‌పై వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, తక్కువ కేటాయింపులు తదితర కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం అంచనాలను మించింది. 23 శాతం వృద్ధి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 29 శాతం)తో రూ.3,740 కోట్లకు పెరిగింది. గత ఏడాది కాలం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 4.9శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4.25 శాతానికి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు మరింతగా తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రుణాలు 8 శాతం, డిపాజిట్లు 13 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆస్తుల నాణ్యత, పనితీరుల్లో మంచి వృద్ధినే సాధించింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఈ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ జోరు పెరుగుతుంది. టీవీ టుడే - బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ - ప్రస్తుత ధర: రూ.184, టార్గెట్ ధర: రూ.240 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.114 కోట్లకు పెరిగింది. ఢిల్లీ ఎన్నికలు, ఆస్ట్రేలియాలో క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా కంపెనీ నిర్వహణ వ్యయాలు పెరిగాయి. పోటీ పెరగడంతో మార్కెటింగ్ వ్యయాలు కూడా పెరిగాయి. దీంతో మొత్తం వ్యయాలు 46 శాతం పెరిగాయి. నికర లాభం రూ.8.7 కోట్లకే పరిమితమైంది. హిందీ వార్తా చానెళ్లలో ఈ సంస్థకు చెందిన ఆజ్ తక్ అగ్రస్థానం గత పదేళ్లుగా కొనసాగుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయ్, కరణ్ థాపర్ వంటి హేమాహేమీలు డెరైక్టర్ల బోర్డ్లోకి రావడంతో ఈ సంస్థ ఇంగ్లీస్ న్యూస్ చానెల్, హెడ్‌లైన్స్ టుడే జోరు పెరుగుతోంది. ప్రకటనల ఆదాయం 18 శాతం పెరిగింది. డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయితే, మరింత మంది చందాదారులకు చానెల్ చేరువవుతుంది. ఆదాయం 7 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఇబిటా 26 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. -
స్టాక్ట్స్ వ్యూ
బ్యాంక్ ఆఫ్ బరోడా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.210 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం 48 శాతం క్షీణించి రూ.598కోట్లకు తగ్గింది. కేటాయింపులు 58 శాతం పెరగడమే దీనికి కారణం. ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండటంతో వడ్డీయేతర ఆదాయం 15 శాతం పెరిగింది. రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్లకు సంబంధించిన రుణాల్లో వృద్ధి చెప్పుకోదగ్గ విషయం. క్యూ3తో పోల్చితే మొండి బకాయిలు తగ్గాయి. మెటల్, ఇన్ఫ్రా కంపెనీలకు అధిక మొత్తంలో రుణాలివ్వడంతో అసెట్ క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడగలదని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 9 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. ఫీజు ఆదాయం ఆరోగ్యకరంగా ఉండడం, కాసా వృద్ధి కారణంగా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) మెరుగుపడే అవకాశాలు.. సానుకూలాంశాలు. జూబిలంట్ ఫుడ్‌వర్క్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,752 టార్గెట్ ధర: రూ.2,000 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 25 శాతం వృద్ధితో రూ.542 కోట్లకు పెరిగాయి. సంవత్సరంన్నర కాలంలో ఇదే అత్యధికం. నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.31.5కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 150 డొమినోస్, 28 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 150 డొమినోస్, 30 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నది. డంకిన్ డునాట్స్ వ్యాపార విభాగం 2-3 ఏళ్లలో బ్రేక్ఈవెన్ సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. కొత్తగా స్టోర్స్ ఏర్పాటు ద్వారా నెట్వర్క్ విస్తరిస్తోంది. వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. గత ఏడాది జూన్‌లో ఒకసారి, నవంబర్‌లో మరొకసారి 3 శాతం చొప్పున ధరలను పెంచింది. ఫలితంగా కంపెనీ ఆదాయం పెరిగింది. వచ్చే నెలలో మరోసారి ధరలను పెంచనున్నది. 2013-14 క్యూ4లో 18 శాతంగా ఉన్న ఆన్లైన్ ఆర్డర్లు 2014-15క్యూ4లో 29 శాతానికి పెరిగాయి. మూడేళ్లలో ఇవి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,166 టార్గెట్ ధర: రూ.1,220 ఎందుకంటే: భారత ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రధన కంపెనీల్లో ఒకటి. పలు గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. గుడ్‌నైట్(దోమల నివారిణి), నంబర్ 1, సింధాల్ (సబ్బులు), గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్(హెయిర్ కలర్స్), ఎర్(ఎయిర్ ఫ్రెషనర్స్), గోద్రేజ్ ప్రోటెక్ట్( హెల్త్ అండ్ వెల్నెస్) బ్రాండ్లతో అమ్మకాలు సాధిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో విస్తరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు బావున్నాయి. నికర అమ్మకాలు 8% వృద్ధితో రూ.2,092 కోట్లకు పెరిగాయి. భారత్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక ఇబిటా 13% వృద్ధితో రూ.406 కోట్లకు పెరిగింది. నికర లాభం 12% వృద్ధితో రూ.265 కోట్లకు పెరిగింది. ఘనాలోని డార్లింగ్ గ్రూప్‌లో వంద శాతం వాటాను, దక్షిణాఫ్రికాలోని ఫ్రికా హెయిర్ కంపెనీల్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
షాపర్స్ స్టాప్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.373 టార్గెట్ ధర: రూ.520 ఎందుకంటే: డిపార్ట్మెంటల్ స్టోర్స్, స్పెషాల్టీ ఫార్మాట్ స్టోర్స్, హైపర్ మార్కెట్ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత రిటైల్ రంగ దిగ్గజాల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్ అమ్మకాలు 10% వృద్ధితో రూ.1,179 కోట్లకు పెరిగాయి. హైపర్సిటీ ఫార్మాట్ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయినప్పటికీ, ఈవిభాగం పనితీరు బాగానే మెరుగుపడుతోంది. ఆన్లైన్ రిటైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్లనివ్వడంతో డిపార్ట్మెంటల్ స్టోర్ ఆదాయాలు పడిపోయాయి. దీనిని నివారించడానికి తన ప్రైవేట్ లేబుల్స్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ, ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లలలోనూ ఆఫర్ చేస్తోంది. ఇటీవలే ఐస్టాప్ పేరుతో లెన్స్, ఫ్రేమ్‌ల వ్యాపారంలోకి ప్రవేశించింది. త్వరలో రేసన్ బ్రాండ్‌తో మహిళల దుస్తులను అందించనున్నది. క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా యువ వినియోగదారులే లక్ష్యంగా రాన్ బ్రాండ్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రెండేళ్లలో 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించి రూ.5,473 కోట్లకు పెరుగుతుందని అంచనా. మంగళం సిమెంట్ బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.238 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: బికే బిర్లా గ్రూప్ కంపెనీకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇది. కంపెనీ వ్యవస్థాపిత ఉత్పాదక సామర్థ్యం ఏడాదికి 3.25 మిలియన్ టన్నులు. ఇటీవలనే 1.25 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కొత్తగా జత అయిం ది. బిర్లా ఉత్తమ్ బ్రాండ్ పేరుతో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ల్లో సిమెంట్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 3,500 కు పైగా రిటైలర్లు, 1,100 కు పైగా డీలర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కంపెనీ ఇబిటా టన్నుకు రూ.262గా ఉంది. అమ్మకాలు(టన్నుల్లో) ఏడాది ప్రాతిపదికన 20%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13% చొప్పున పెరిగాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన వ్యయాలు 5% తగ్గాయి. లాభదాయకత తగ్గినా, వ్యయాలు కూడా తగ్గుతుండడం కంపెనీకి కలసి వచ్చే అంశం. ఆలీఘర్ ప్లాంట్ విస్తరణ పూర్తికానుండడంతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మార్కెట్ అవసరాలను తీర్చగలుగుతుంది. రాజస్థాన్‌లోని మోరాక్ ప్లాంట్‌కు లభించిన వ్యాట్ మినహాయింపు ప్రయోజనం ఈ క్వార్టర్ నుంచి కనిపిస్తుంది. ధరలు, డిమాండ్ పెరిగితే ప్రయోజనం పొందగలిగే సిమెంట్ కంపెనీల్లో మొదటి వరుసలో ఉంటుంది. -
స్టాక్స్ వ్యూ
టాటా మోటార్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.560 టార్గెట్ ధర: రూ.746 ఎందుకంటే: భారత వాణిజ్య వాహన రంగంలో అతి పెద్ద కంపెనీ. ప్రయాణికులు వాహనాలను, యుటిలిటి వాహనాలను కూడా విక్రయిస్తోంది. 2009 ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే జేఎల్ఆర్ లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సొంత ఇంజిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. చైనాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ఈ క్వార్టర్‌లోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. జేఎల్ఆర్ జోరు కారణంగా కంపెనీ అమ్మకాలు 2014-17 కాలానికి 15 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. ప్రయాణికుల వాహనాల విడిభాగంలో ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన జెస్ట్,బోల్ట్కార్లకు మంచి స్పందన లభిస్తోంది. 2020 వరకూ ఏడాదికి రెండు కొత్త కార్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. దీంతో ప్రయాణికుల విభాగంలో అమ్మకాలు రెండేళ్లలో 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. భారతీ ఎయిర్టెల్ బోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.368 టార్గెట్ ధర: రూ.480 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.23,228 కోట్లకు పెరిగింది. వాయిస్ కాల్స్ అధారిత ఆదాయం తగ్గినప్పటికీ, డేటా ఆదాయం బాగా పెరిగింది. డేటా ఆదాయం క్యూ2తో పోల్చితే 17 శాతం వృద్ధితో రూ.2,108 కోట్లకు చేరింది. గత మూడేళ్లుగా తీవ్రమైన పోటీ కారణంగా టారిఫ్‌లు తక్కువ స్థాయిలో ఉన్నాయి. పోటీ తీవ్రత తగ్గుతోంది. ఫలితంగా టెలికం కంపెనీలు టారిఫ్‌లనూ పెంచుతున్నాయి. ఇది వినియోగదారులు అధికంగా ఉన్న ఎయిర్టెల్ వంటి కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. కాగా తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా ఆఫ్రికా వ్యాపారం అంత ఆశాజనకంగా లేదు. రెండేళ్లలో టెలిమీడియా కార్యకలాపాలు 6 శాతం వృద్ధితో రూ.4,622 కోట్లకు, డీటీహెచ్ విభాగం వ్యాపారం 12 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,931 కోట్లకు పెరుగుతాయని అంచనా. అత్యున్నత నాణ్యత గల డేటా సర్వీసులందజేయగల సత్తా ఉన్న కారణంగా రెండేళ్లలో కంపెనీ ఆదాయం 7 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఇండియన్ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.210 టార్గెట్ ధర: రూ. 245 ఎందుకంటే: తమిళనాడులో అధిక శాఖలున్న దక్షిణాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. అత్యధిక ప్రభుత్వ వాటా (81 శాతం) ఉన్న పీఎస్ బ్యాంక్ కూడా ఇదే. 2010-14 కాలానికి రుణాలు 19 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 1,24,359 కోట్ల రుణాలిచ్చింది. వీటిలో కార్పొరేట్ రుణాలు 52 శాతం, వ్యవసాయ రుణాలు 15 శాతం, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు చెరో 13 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి10-12 శాతం రేంజ్లో ఉండొచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కార్పొరేట్ రుణాలు తగ్గించి, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని బ్యాంక్ నిర్ణయించింది. దేశీయ కాసా వాటా 28 శాతంగా ఉంది. దక్షిణాదిపైననే అధికంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన ఈ బ్యాంక్ ప్రతీ ఏటా 115 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ.1,245 కోట్లుగా ఉన్న నికర లాభం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.1,710 కోట్లకు పెరిగింది. అధిక కేటాయింపులు, డిపాజిట్లపై చెల్లించే అధిక వడ్డీరేట్ల కారణంగా ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం తగ్గింది. నిధుల సమీకరణ వ్యయం తగ్గడం, ట్రేడింగ్ గెయిన్స్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి నికర లాభం ఆర్జించే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్ 3 శాతంగా ఉంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. హిందుస్తాన్ మీడియా వెంచర్స్ బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.230 టార్గెట్ ధర: రూ.358 ఎందుకంటే: హిందుస్తాన్ మీడియా వెంచర్స్(హెచ్‌ఎంవీఎల్)కు చెందిన హిందుస్తాన్ హిందీ వార్తాపత్రిక భారత్‌లోనే రెండో అతి పెద్ద పత్రిక(ఐఆర్ఎస్-2013 సర్వే). 2011-14 కాలానికి హెచ్‌ఎంవీఎల్ రీడర్షిప్, నిర్వహణ లాభాలు పోటీ పత్రిక సంస్థలతో పోల్చితే పెరిగాయి. ఈ కాలంలో సంస్థ ఇబిటా 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. అతి పెద్ద హిందీ ప్రకటనల మార్కెట్ అయిన ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ సర్క్యులేషన్‌ను సాధించింది. ఇది సంస్థ దీర్ఘకాల వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ వార్తాపత్రిక ప్రచురిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో(ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్) త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా రీడర్షిప్ మరింతగా పెరగనున్నది. ఈ అంశాల కారణంగా పరిశ్రమ అంచనాలను మించిన వృద్ధిని హెచ్‌ఎంవీఎల్ సాధిస్తుందని భావిస్తున్నాం. 2014-16 కాలానికి లాభాల్లో వృద్ధి పోటీ సంస్థల కంటే అధికంగా ఉంటుందని అంచనా. ఏడాది కాలానికి ఇబిటా 35%, నికర లాభం 18% చొప్పున వృద్ధి సాధించవచ్చు. మీడియా షేర్లలో ప్రస్తుతం ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న షేర్ ఇదే. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో(డీసీఎఫ్) మదింపు ఆధారంగా టార్గెట్ ధరను నిర్ణయించాం. పత్రికా రంగంలో తీవ్ర పోటీ, ముడి పదార్ధాల ధరలు పెరుగుదల వంటివి ప్రతికూలాంశాలు. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
ఐడియా సెల్యులార్ బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ. 160 టార్గెట్ ధర: రూ.190 ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న భారత టెలికం కంపెనీ ఇది. మార్కెట్ వాటా 17 శాతంగా ఉంది. 2010-14 కాలానికి టెలికం పరిశ్రమ రాబడి 6 శాతంగా ఉండగా, ఈ కంపెనీ రాబడి 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇదే కాలానికి కంపెనీ మార్కెట్ వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. 12కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రమైన పోటీ ఉన్న టెలికం పరిశ్రమలో నాలుగేళ్లలోనే మార్కెట్ వాటాను, రాబడులను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుకోవడం కంపెనీ పనితీరును ప్రతిబింబిస్తోంది. కంపెనీ బ్రాండ్ బిల్డింగ్ సామర్థ్యానికి, పటిష్టమైన నిర్వహణ తీరుకు ఇదే నిదర్శనం. 2014 ఆర్థిక సంవత్సరంలో నాలుగో క్వార్టర్లో 2.4గా ఉన్న రుణ, ఇబిటా నిష్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ కల్లా 1.32కు తగ్గింది. పుష్కలంగా ఉన్న నగదు నిల్వలు, ఈక్విటీ పెరగడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కంపెనీలు టారిఫ్‌లను పెంచుతున్నాయి. రెండేళ్లలో ఈ టారిఫ్‌లు 7% వరకూ పెరుగుతాయని అంచనా. భారత్‌లో వాయిస్, డేటా మార్కెట్ మరింతగా వృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న ఈ కంపెనీకి మంచి ప్రయోజనాలు అందనున్నాయి. అందుకని ప్రస్తుతమున్న ధర స్థాయి నుంచి ఈ కంపెనీ షేర్ 15-18 శాతం రేంజ్లో పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 970 టార్గెట్ ధర: రూ.1,100 ఎందుకంటే: వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీ వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ రికవరీ అధికంగా ఉంది. ఆఫ్రికా, నైజీరియా, దక్షిణాఫ్రికాల్లో వ్యాపారం మందగమనంగా ఉన్నా ఇండోనేసియాలో జోరుగా ఉంది. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండటంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో ఆయా దేశాల కరెన్సీ మారక విలువల కారణంగా ప్రస్తుతం ఈ షేర్ డిస్కౌంట్‌కే ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు తగ్గుతుండడంతో ముడి పదార్థాల ధరలు తగ్గి ఉత్పత్తి వ్యయాలు తగ్గనున్నాయి. ఉత్పత్తి వ్యయాలు 50 శాతం వరకూ తగ్గుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. దీంట్లో కొంత భాగాన్ని వినియోగదారులకు డిస్కౌంట్/ఉచిత వస్తువుల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఫలితంగా అమ్మకాలు మరింతగా పుంజుకుంటాయి. కుదుటపడుతున్న ఆర్థిక ఫలితాల కారణంగా మరోవైపు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. డెంగ్యూ జ్వరంపై ఆందోళనల కారణంగా కంపెనీ హోమ్ ఇన్సెక్టిసైడ్స్ వ్యాపారం జోరుగా ఉంది. కంపెనీ అందిస్తున్న దోమలకు సంబంధించిన ఫాస్ట్కార్డ్ ఉత్పత్తి ఏడాది కాలంలోనే వంద కోట్ల రూపాయల అమ్మకాలు సాధించింది. సబ్బుల వ్యాపారం కూడా పుంజుకుంది.