టాటా మోటార్స్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.560
టార్గెట్ ధర: రూ.746
ఎందుకంటే: భారత వాణిజ్య వాహన రంగంలో అతి పెద్ద కంపెనీ. ప్రయాణికులు వాహనాలను, యుటిలిటి వాహనాలను కూడా విక్రయిస్తోంది. 2009 ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే జేఎల్‌ఆర్ లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సొంత ఇంజిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. చైనాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ఈ క్వార్టర్‌లోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు.
జేఎల్‌ఆర్ జోరు కారణంగా కంపెనీ అమ్మకాలు 2014-17 కాలానికి 15 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. ప్రయాణికుల వాహనాల విడిభాగంలో ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన జెస్ట్,బోల్ట్‌కార్లకు మంచి స్పందన లభిస్తోంది. 2020 వరకూ ఏడాదికి రెండు కొత్త కార్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. దీంతో ప్రయాణికుల విభాగంలో అమ్మకాలు రెండేళ్లలో 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.
భారతీ ఎయిర్‌టెల్
బోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.368
టార్గెట్ ధర: రూ.480
ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.23,228 కోట్లకు పెరిగింది. వాయిస్ కాల్స్ అధారిత ఆదాయం తగ్గినప్పటికీ, డేటా ఆదాయం బాగా పెరిగింది. డేటా ఆదాయం క్యూ2తో పోల్చితే 17 శాతం వృద్ధితో రూ.2,108 కోట్లకు చేరింది. గత మూడేళ్లుగా తీవ్రమైన పోటీ కారణంగా టారిఫ్‌లు తక్కువ స్థాయిలో ఉన్నాయి. పోటీ తీవ్రత తగ్గుతోంది. ఫలితంగా టెలికం కంపెనీలు టారిఫ్‌లనూ పెంచుతున్నాయి.
ఇది వినియోగదారులు అధికంగా ఉన్న ఎయిర్‌టెల్ వంటి కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. కాగా తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా ఆఫ్రికా వ్యాపారం అంత ఆశాజనకంగా లేదు. రెండేళ్లలో టెలిమీడియా కార్యకలాపాలు 6 శాతం వృద్ధితో రూ.4,622 కోట్లకు, డీటీహెచ్ విభాగం వ్యాపారం 12 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,931 కోట్లకు పెరుగుతాయని అంచనా. అత్యున్నత నాణ్యత గల డేటా సర్వీసులందజేయగల సత్తా ఉన్న కారణంగా రెండేళ్లలో కంపెనీ ఆదాయం 7 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
స్టాక్స్ వ్యూ
Published Mon, Feb 9 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement