ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) ప్రపంచ వ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. యూకే, ఐర్లాండ్,యూఎస్‌ఏ, భారత్, చైనా, హంగేరీలలో డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో సుమారు 800 మంది అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటా సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, ట్విటర్‌లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.హైబ్రిడ్ వర్క్‌ను సైతం ఆఫర్ చేస్తోంది.
ఇందులో భాగంగా జేఎల్‌ఆర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి చేస్తూ వారిని గైడ్ చేయయడం(డిజిటల్ ఫస్ట్), సంస్థలోని వివిధ విభాగాల్ని వర్గీకరిస్తూ రా డేటాను ప్రాసెస్ చేసే అటానమస్ డ్రైవింగ్, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలెక్ట్రిఫికేషన్,క్లౌడ్ సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డెవలపింగ్, నెక్ట్స్ జనరేషన్ జాగ్వార్ కార్లలో అభివృద్ధికి అవసరమైన,బిల్డింగ్, రిపేరింగ్ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని హైర్ చేసుకోనున్నట్ల తన ప్రటకనలో పేర్కొంది.
ఈ సందర్భంగా జేఎల్‌ఆర్ సీఈవో ఆంథోనీ బ్యాటిల్(Anthony Battle) మాట్లాడుతూ.. తమ సంస్థ డేటా, డిజిటల్ స్కిల్స్ ఆధారంగా వ్యూహాత్మకంగా 2025 నాటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్లను, 2039 నాటికి కార్బన్ నెట్ జీరో కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని తెలిపారు.
‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ ఫస్ట్ బిజినెస్‌గా రూపాంతరం చెందుతోంది.మేం ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అడ్వాన్స్‌డ్ వెహికల్స్‌ను తయారు చేస్తున్నాం. తద్వారా కార్ల కొనుగోలు దారులకు లేటెస్ట్ లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవాన్ని అందిస్తామని జాబ్ హైరిగ్‌పై డిజిటల్ ప్రొడక్ట్ ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ డేవ్ నెస్‌బిట్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment