అనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెటా, అమెజాన్, ట్విటర్ తరహాలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించేలా నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాబోయే వారాల్లో దాదాపు 10వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించనుందనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆల్ హ్యాండ్ మీటింగ్ తరువాత గూగుల్ సంస్థలోని పరిణామాలు ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం.
చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!
మీ పర్‌ఫార్మెన్స్ బాగలేదయ్యా
ఈ తరుణంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ త్వరలో ఉద్యోగుల తొలగింపులపై సంకేతాలు ఇచ్చారని, పర్‌ఫార్మెన్స్ సరిగ్గా లేని ఉద్యోగుల లేఆఫ్స్‌పై పరోక్షంగా స్పందించారని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక, ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసే విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని చెప్పినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ సైతం తన కథనంలో పేర్కొంది.
ఉద్యోగులపై గ్రాడ్ అస్త్రం
అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిచాయ్ ఉద్యోగుల్ని కోరారు. కీలకమైన విభాగాలు తప్ప మిగిలిన అన్నీ వాటిల్లో హైరింగ్ నిలిపివేశారు. ఉద్యోగులు వారు చేసే పనిని డబ్బుతో పోల్చుకూడదని సూచించారు.ఉద్యోగులపై వేటు వేసే విషయంలో గూగుల్ రివ్యూస్ అండ్ డెవెలప్‌మెంట్ (grad) ఉపయోగించాలని యోచిస్తోంది. తద్వారా వర్క్ విషయంలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా గూగుల్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనుంది.
ఇప్పుడేనా.. గతంలో
లేఆఫ్స్ గురించి పిచాయ్ ఈ తరహా వ్యాఖ్యల్ని గతంలో చేశారు. ఈ ఏడాది క్యూ2 ఫలితాల విడుదల అనంతరం పిచాయ్ మాట్లాడుతూ.. సంస్థ పనితీరు అంచనాల కంటే బలహీనంగా ఉందని అన్నారు. ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉద్యోగులు ఎక్కువ మందే ఉన్నారు. కానీ పనిచేసేది కొద్ది మంది మాత్రమే. ప్రతి ఒక్కరూ వర్క్ ప్రొడక్టివిటీని పెంచాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పిచాయ్ మరోసారి ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడంతో గూగుల్ ఉద్యోగుల్లో కలవరం మొదలైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన‍్ల ఆగ్రహం!
Comments
Please login to add a commentAdd a comment