Jaguar Land Rover company
-
రండి మీకు నేను ఉద్యోగాలిస్తా.. ట్విటర్, మెటా ఉద్యోగులకు రతన్ టాటా బంపరాఫర్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ప్రపంచ వ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. యూకే, ఐర్లాండ్,యూఎస్ఏ, భారత్, చైనా, హంగేరీలలో డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో సుమారు 800 మంది అంతకంటే ఎక్కువ మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, టాటా గ్రూపు చైర్మన్ రతన్‌టాటా సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ టెక్ దిగ్గజ కంపెనీలైన మెటా, ట్విటర్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.హైబ్రిడ్ వర్క్‌ను సైతం ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా జేఎల్ఆర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి చేస్తూ వారిని గైడ్ చేయయడం(డిజిటల్ ఫస్ట్), సంస్థలోని వివిధ విభాగాల్ని వర్గీకరిస్తూ రా డేటాను ప్రాసెస్ చేసే అటానమస్ డ్రైవింగ్, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలెక్ట్రిఫికేషన్,క్లౌడ్ సాఫ్ట్వేర్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డెవలపింగ్, నెక్ట్స్ జనరేషన్ జాగ్వార్ కార్లలో అభివృద్ధికి అవసరమైన,బిల్డింగ్, రిపేరింగ్ వంటి విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని హైర్ చేసుకోనున్నట్ల తన ప్రటకనలో పేర్కొంది. ఈ సందర్భంగా జేఎల్ఆర్ సీఈవో ఆంథోనీ బ్యాటిల్(Anthony Battle) మాట్లాడుతూ.. తమ సంస్థ డేటా, డిజిటల్ స్కిల్స్ ఆధారంగా వ్యూహాత్మకంగా 2025 నాటికి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్లను, 2039 నాటికి కార్బన్ నెట్ జీరో కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపారు. ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ ఫస్ట్ బిజినెస్‌గా రూపాంతరం చెందుతోంది.మేం ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అడ్వాన్స్డ్ వెహికల్స్‌ను తయారు చేస్తున్నాం. తద్వారా కార్ల కొనుగోలు దారులకు లేటెస్ట్ లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవాన్ని అందిస్తామని జాబ్ హైరిగ్పై డిజిటల్ ప్రొడక్ట్ ప్లాట్‌ఫారమ్ డైరెక్టర్ డేవ్ నెస్బిట్ స్పందించారు. -
స్టాక్స్ వ్యూ
టాటా మోటార్స్ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.560 టార్గెట్ ధర: రూ.746 ఎందుకంటే: భారత వాణిజ్య వాహన రంగంలో అతి పెద్ద కంపెనీ. ప్రయాణికులు వాహనాలను, యుటిలిటి వాహనాలను కూడా విక్రయిస్తోంది. 2009 ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీని ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే జేఎల్ఆర్ లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సొంత ఇంజిన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. చైనాలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్ ఈ క్వార్టర్‌లోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. జేఎల్ఆర్ జోరు కారణంగా కంపెనీ అమ్మకాలు 2014-17 కాలానికి 15 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. ప్రయాణికుల వాహనాల విడిభాగంలో ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన జెస్ట్,బోల్ట్కార్లకు మంచి స్పందన లభిస్తోంది. 2020 వరకూ ఏడాదికి రెండు కొత్త కార్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తోంది. దీంతో ప్రయాణికుల విభాగంలో అమ్మకాలు రెండేళ్లలో 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. భారతీ ఎయిర్టెల్ బోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.368 టార్గెట్ ధర: రూ.480 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.23,228 కోట్లకు పెరిగింది. వాయిస్ కాల్స్ అధారిత ఆదాయం తగ్గినప్పటికీ, డేటా ఆదాయం బాగా పెరిగింది. డేటా ఆదాయం క్యూ2తో పోల్చితే 17 శాతం వృద్ధితో రూ.2,108 కోట్లకు చేరింది. గత మూడేళ్లుగా తీవ్రమైన పోటీ కారణంగా టారిఫ్‌లు తక్కువ స్థాయిలో ఉన్నాయి. పోటీ తీవ్రత తగ్గుతోంది. ఫలితంగా టెలికం కంపెనీలు టారిఫ్‌లనూ పెంచుతున్నాయి. ఇది వినియోగదారులు అధికంగా ఉన్న ఎయిర్టెల్ వంటి కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. కాగా తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా ఆఫ్రికా వ్యాపారం అంత ఆశాజనకంగా లేదు. రెండేళ్లలో టెలిమీడియా కార్యకలాపాలు 6 శాతం వృద్ధితో రూ.4,622 కోట్లకు, డీటీహెచ్ విభాగం వ్యాపారం 12 శాతం చక్రగతి వృద్ధితో రూ.2,931 కోట్లకు పెరుగుతాయని అంచనా. అత్యున్నత నాణ్యత గల డేటా సర్వీసులందజేయగల సత్తా ఉన్న కారణంగా రెండేళ్లలో కంపెనీ ఆదాయం 7 శాతం, నికర లాభం 43 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.