క్యూ4 ఫలితాలు: డాబర్, హెరిటేజ్ ఫుడ్స్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, కంప్యూకమ్ సాఫ్ట్‌వేర్, సన్ ఫార్మాసూటికల్స్, క్వెస్ కార్పొరేషన్, జేపీ అసోసియేట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వైభవ్ గ్లోబల్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను బుధవారం వెల్లడించనున్నాయి.
కొటక్‌మహీంద్రా బ్యాంక్: రూ.7,500 కోట్ల నిధులు సమీకరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్‌స్టీట్యూషనల్ ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను ప్రకటించింది.ఇందులో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.1,147.75 గా నిర్ణయించింది.
బ్లూడార్ట్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.30.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.12.24 కోట్లుగా ఉందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో బ్లూడార్ట్ తెలిపింది.
పీఎఫ్‌సీ: రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించి నర్మదా బేసిన్ ప్రాజెక్ట్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ) తెలిపింది.
న్యూజెన్ సాఫ్ట్‌వేర్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 34 శాతం పడిపోయి రూ.41.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.62.5 కోట్లుగా ఉంది.
దీపక్ నైట్రైట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 88 శాతం పెరిగి రూ.172.3 కోట్లకు చేరిందని దీపక్ నైట్రేడ్ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.91.46 కోట్లుగా ఉందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
ఇన్ఫోసిస్: డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఎండ్‌టుఎండ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను అందించేందుకు అవాల్క్ కంపెనీతో బాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 96 శాతం క్షీణించి రూ.6.67 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.199.91 కోట్లుగా నమోదైంది.
టొరంట్ ఫార్మాసూటికల్స్: కన్సాలిడేటెడ్ నికర లాభం క్యూ4లో రూ.314కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.70.91 కోట్లకు తగ్గినట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 245.30 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment