ప్రస్తుత ధర: రూ.332 ; టార్గెట్ ధర: రూ.380
ఎందుకంటే: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, రుణ నాణ్యత విషయమై సానుకూలమైన వాతావరణం చోటు చేసుకుంది. మొండి బకాయిల ఖాతాలకు అంచనాలకు మించి రూ.6,000 కోట్లు కేటాయింపులు జరపాల్సి వచ్చింది. దీంతో నికర లాభం రూ.1,580 కోట్లకే పరిమితమైంది. ఎన్‌సీఎల్‌టీకి నివేదించిన మొత్తం మొండి బకాయిలు మొత్తం రూ.72,000 కోట్లుగా ఉన్నాయి. ఈ క్యూ1లో రూ.26,300 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.9,000 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, ఈ క్యూ1లో 5.4 శాతంగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.9 శాతానికి తగ్గాయి. దీంతో ఈ క్యూ2లో మొత్తం స్థూల మొండి బకాయిలు 9.8 శాతానికి, నికర మొండి బకాయిలు 5.4 శాతానికి తగ్గాయి. ఎస్‌బీఐ లైఫ్‌లో వాటా విక్రయం కారణంగా రూ.5,400 కోట్లు రావడంతో ఇతర ఆదాయం పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది.
రుణ వృద్ధిలో పెద్దగా పురోగతి లేకపోయినా, కాసా నిష్పత్తి 45 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, అత్యధికంగా ప్రయోజనం పొందే బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. (ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ బాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా చూసినా) బ్యాంక్‌కు మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి, అనుబంధ బ్యాంక్‌ల విలీనం ఫలితాలు అందనుండడం, ఎస్‌సీఎల్‌టీ ఖాతాల విషయం త్వరగా పరిష్కారం కానుండడం, సాధారణ బీమా, ఇతర కీలకం కాని ఆస్తుల్లో వాటా విక్రయం కారణంగా నిధులు అందనుండడం,.. ఇవన్నీ సానుకూలాంశాలు.
పీసీ జ్యువెల్లర్
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.383 ; టార్గెట్ ధర: 490
ఎందుకంటే: 2006లో ఒక చిన్న కంపెనీగా మొదలైన పీసీ జ్యువెల్లర్ ప్రస్తుతం తనిష్క్(టైటాన్ కంపెనీ) తర్వాత రెండో అతి పెద్ద జ్యువెల్లర్ రిటైల్ కంపెనీగా ఎదిగింది. నల్లధనం నిరోధం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, జీఎస్‌టీ అమలు భారత జ్యువెల్లరీ రంగంలో వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశాలు. బ్రాండ్ విశ్వసనీయత, టెక్నాలజీ వినియోగం, అత్యంత ప్రభావవంతమైన హెడ్జింగ్ విధానాలు, విస్తృతమైన శ్రేణిలో వెరైటీలు అందించడం, మార్కెటింగ్ వ్యూహాలు.. వీటన్నింటి దన్నుతో పీసీ జ్యువెల్లర్ వంటి జాతీయ స్థాయి కంపెనీల అమ్మకాలు పుంజుకోనున్నాయి. ఉత్తర భారతదేశంలో పటిష్టంగా ఉన్న ఈ కంపెనీ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఫ్రాంచైజీ విధానంలో కూడా విస్తృతంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా వైవిధ్యమైన ఆభరణాలను అందించనుండడం, బ్రాండ్ ప్రచారానికి భారీగా పెట్టుబడులు పెడుతుండడం, వెడ్డింగ్, డైమండ్ జ్యూయలరీపై ప్రధానంగా దృష్టి సారిస్తుండడం సానుకూలాంశాలు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విక్రయాలు 30 శాతం వృద్ధి చెందగా, మరో మూడేళ్లలో ఇవి దాదాపు రెట్టింపుకానున్నాయని అంచనా. మూడేళ్ల కాలానికి అమ్మకాలు 21 శాతం, స్థూల లాభం 24 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 17 శాతంగా ఉ్న రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్(ఆర్‌ఓసీఈ) 2019–20 కల్లా 19.5 శాతానికి పెరుగుతుందని అంచనా. పుత్తడి ధరల్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉండడం, నిబంధనల కఠినతరం కానుండడం, డిమాండ్‌లో మందగమనం చోటు చేసుకుంటే కొత్త స్టోర్ల ఏర్పాటులో జాప్యం ఉండే అవకాశాలు. ఇవన్నీ ప్రతికూలాంశాలు.
Comments
Please login to add a commentAdd a comment