స్టాక్స్ వ్యూ | Stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Mar 14 2016 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

స్టాక్స్ వ్యూ

స్టాక్స్ వ్యూ

సన్ ఫార్మా : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్
ప్రస్తుత ధర: రూ.868        
టార్గెట్ ధర: రూ.940
ఎందుకంటే: డిసెంబర్ త్రైమాసికంలో  ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి.  నికర లాభం 258 శాతం వృద్ధితో రూ.1,400 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,070 కోట్లకు పెరిగింది.  గ్లాక్సోస్మిత్‌లైన్(జీఎస్‌కే) నుంచి కొనుగోలు చేసిన ఓపియేట్స్ వ్యాపారం కన్సాలిడేట్ అవుతుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. లాభదాయకం కాని విదేశీ ప్లాంట్లను మూసేసింది.  

అమెరికా ఎఫ్‌డీఏ  ఆమోదం కోసం 156 అండాలు(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్) పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన గ్లీవెక్ ఔషధానికి పోటీ తక్కువగా ఉండడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. ఈ ఔషధానికి అమెరికాలో 200 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. ర్యాన్‌బాక్సీ విలీన ఫలాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీకి అందనున్నాయి. హలోల్ ప్లాంట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఈ షేర్ 30 శాతం తగ్గింది.

ఇప్పుడు ఈ హలోల్ ప్లాంట్‌ను ఈ కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో హలోల్ ప్లాంట్‌ను మళ్లీ తనిఖీ చేయాల్సిందిగా యూఎస్‌ఎఫ్‌డీఏను సన్ ఫార్మా ఆహ్వానిస్తోంది. రానున్న కాలంలో భారత్‌లో విక్రయాలు పుంజుకోనున్నాయి.  మూడేళ్లలో ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. 2017-18 అంచనా ఈపీఎస్‌కు 25 రెట్లు అయిన రూ.940 టార్గెట్ ధరను ఏడాది కాలంలో ఈ షేర్ చేరుతుందని భావిస్తున్నాం.
 
నీల్‌కమల్ : కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ:
ఫస్ట్‌కాల్ రీసెర్చ్
ప్రస్తుత ధర: రూ.1.102        
టార్గెట్ ధర: రూ.1,215
ఎందుకంటే: మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీలో, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థ. వివిధ సెగ్మెంట్లలో విభిన్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోంది. హోమ్ బ్రాండ్ కింద లైఫ్‌స్టైల్ ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, యాక్సెసరీలను విక్రయిస్తోంది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి.

గత క్యూ3లో రూ.8 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 139 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది. అలాగే ఆదాయం రూ.422 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.428 కోట్లకు ఎగిసింది.  గత క్యూ3లో రూ.5.67గా ఉన్న ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ఈ క్యూ3లో 13.53కు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో నికర లాభం 243 శాతం వృద్ధి చెంది  రూ.71 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.20 కోట్లుగా ఉంది.

ఏడాది కాలానికి  హోమ్ బ్రాండ్ టర్నోవర్ 13 శాతం వృద్ధిని సాధించింది. షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.78గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. రెండేళ్లలో నికర లాభం 39 శాతం, నికర అమ్మకాలు 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. జమ్మూ  ప్లాంట్ విస్తరణ పూర్తయి, ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభం కావడం కంపెనీకి కలసివచ్చే అంశం. మధ్య, దీర్ఘకాలినికి రూ.1215 టార్గెట్ ధరకు ప్రస్తుత ధరలో ఈ స్క్రిప్‌ను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement