స్టాక్స్‌ వ్యూ | stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Mar 13 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ

ఎన్‌టీపీసీ
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌ రీసెర్చ్‌
ప్రస్తుత ధర: రూ.157  టార్గెట్‌ ధర: రూ.189
ఎందుకంటే: భారత్‌లో అతి పెద్ద విద్యుదుత్పత్తి కంపెనీ ఇది. స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 47,178 మెగావాట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అధిక విద్యుదుత్పత్తి కారణంగా ఆదాయం 11 శాతం వృద్ధి చెందింది. కానీ ఇంధన వ్యయాలు 14 శాతం పెరగంతో ఇబిటా మార్జిన్‌ 40 బేసిస్‌ పాయింట్లు తగ్గి 27.1 శాతానికి తగ్గింది. గత క్యూ3లో కేవలం 4 శాతంగానే ఉన్న పన్ను రేటు ఈ క్యూ3లో 20 శాతానికి పెరగడంతో నికర లాభం 8 శాతం మేర  క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,000–4,500 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి  తొమ్మిది నెలల కాలానికి 1,300 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి సాధించగా, చివరి మూడు నెలల్లో కనీసం 3,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తిని సాధించే అవకాశాలున్నాయి. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సంరలో కూడా 4,500 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత క్యూ3లో 78.23 శాతంగా ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్ల ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌)ఈ క్యూ3లో 77.21 శాతానికి తగ్గింది. అలాగే గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్ల పీఎల్‌ఎఫ్‌  28.47 శాతం నుంచి 23.85 శాతానికి తగ్గింది. అయితే ఉత్పాదక సామర్థ్యం పెంపు కారణంగా రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. రెండేళ్లలో అదనపు విద్యుదుత్పత్తి 8 శాతం చొప్పున చక్రగతిన పెరుగుదల సాధిస్తుందని భావిస్తున్నాం. నియంత్రిత వ్యాపార విధానం, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) పటిష్టంగా ఉండడం, సెక్యూర్డ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలు.. ఇవన్నీ కంపెనీ వృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందించేవే.

జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మెతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.126  టార్గెట్‌ ధర: రూ.180
ఎందుకంటే: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీకి చెందిన అంగుల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కార్యకలాపాలు షెడ్యూల్‌ ప్రకారమే సజావుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 2 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఈ ప్లాంట్‌ ఉత్పత్తి సామరŠాధ్యన్ని 5 మిలియన్‌ టన్నులకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఏడాదికి 3 మిలియన్‌టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న మరో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీంతో కంపెనీ మొత్తం ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యం ఏడాదికి 8 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3 మిలియన్‌ టన్నుల ఉక్కు అమ్మకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో ఈ అమ్మకాలు 31 శాతం చక్రగతి వృద్ధిన 5.8 మిలియన్‌ టన్నులకు  చేరవచ్చని భావిస్తున్నాం. రెండేళ్లలో కన్సాలిడేటెడ్‌ ఇబిటా 32 శాతం వృద్ధితో రూ.7,800 కోట్లకు పెరగవచ్చని, అలాగే స్టాండోలోన్‌ ఇబిటా 35% వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. దేశీయంగా ఉక్కుకు డిమాండ్‌ క్రమానుగతంగా పెరగగలదని అంచనా.   పెద్ద ఉక్కు కంపెనీలు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్సార్‌ తది తర స్టీల్‌ కంపెనీలు ‘లాంగ్‌ ప్రోడక్ట్స్‌’ను తక్కువగా ఉత్పత్తి చేయడంతో ఈ ఉత్పత్తుల విషయంలో ఈ కంపెనీదే పై చేయి కానున్నది. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి రానుండడం,  ఉక్కు ధరలు పెరిగే అవకాశాలుండడం తది తర కారణాల వల్ల మార్జిన్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం. సొంత ఇనుప, బొగ్గు గనులు ఉండడం, శారద ఐరన్‌ ఓర్స్‌తో సరఫరా ఒప్పందంతో ముడి పదార్ధాల ధరలు తక్కువగా ఉండనుండడం.. ఇవ్వన్నీ సానుకూలాంశాలు. , ఆస్తుల పునర్వ్యస్థీకరణ కారణంగా తరుగుదల పెరిగి నికర లాభం రుణాత్మకంగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నాం. ఉక్కు ధరలు క్షీణించే అవకాశాలు, రుణ భారం పునర్వ్యస్థీకరణ కారణంగా వడ్డీ వ్యయాలు పెరిగే అవకాశాలుండడం ప్రతికూలాంశాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement