Jubilant Food Works
-
జూబిలెంట్ ఫుడ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో క్విక్ సరీ్వస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్) దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ. 76 కోట్లు మాత్రమే ఆర్జించింది. డెలివరీ, టేక్ఎవే చానల్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు జూబిలెంట్ ఫుడ్ పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ తదితర సుప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. కాగా.. క్యూ2లో మొ త్తం ఆదాయం సైతం రూ. 816 కోట్ల నుంచి రూ. 1,116 కోట్లకు ఎగసింది. ఇది 37% వృద్ధికి సమానం. అయితే మొత్తం వ్యయాలు రూ. 747 కోట్ల నుంచి రూ. 963 కోట్లకు పెరిగాయి. ప్రోత్సాహకర ఫలితాల నేపథ్యంలోనూ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమైంది. రూ. 3,965 వద్ద ముగిసింది. -
జూబిలెంట్ నుంచి బిర్యానీ- దివీస్ కొత్త రికార్డ్
ముంబై, సాక్షి: దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు రికార్డుల బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సక్స్ 117 పాయింట్లు పెరిగి 46,784కు చేరింది. నిఫ్టీ సైతం 35 పాయింట్లు బలపడి 13,717 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఫాస్ట్ ఫుడ్ చైన్ కంపెనీ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఫార్మా రంగ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. (బర్గర్‌కింగ్- 3 రోజుల్లో 3 రెట్లు లాభం) జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏకదమ్! పేరుతో బిర్యానీల బిజినెస్‌ను ప్రారంభించింది. తద్వారా విభిన్న రుచుల బిర్యానీలను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలియజేసింది. 20 రకాల బిర్యానీల నుంచి కస్టమర్లు ఎంపిక చేసుకోవచ్చని వివరించింది. ఇవి అందుబాటు ధరల్లో అంటే రూ. 99 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గుర్గావ్లోని రెస్టారెంట్లో వీటిని ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్లతో రెస్టారెంట్లను నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబిలెంట్ ఫుడ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 2,885ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.3 శాతం లాభంతో రూ. 2,873 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం లాభపడటం గమనార్హం! (పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్) దివీస్ ల్యాబొరేటరీస్ పటిష్ట పనితీరును చూపడం ద్వారా ఈ కేలండర్ ఏడాది(2020)లో ర్యాలీ బాటలో సాగుతున్న హైదరాబాద్ దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్ మరోసారి జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 3,854ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 3,825 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ తాజాగా రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకింది. వెరసి మార్కెట్ క్యాప్ ర్యాంకులో 30వ పొజిషన్‌కు చేరుకోవడంతోపాటు.. సన్ ఫార్మా తదుపరి నిలుస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2020లో ఇప్పటివరకూ దివీస్ ల్యాబ్స్ షేరు 109 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమామిడి గ్రామపరిసరాల్లో యూనిట్-3 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ఈ నెల మొదట్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. 12-18 నెలల్లోగా ఈ ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభంకాగలవని అంచనా వేస్తోంది. -
బర్గర్ కింగ్ ఐపీవో ధర రూ. 59-60
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్‌కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. -
యాంబర్ పతనం- జూబిలెంట్ ఫుడ్ జోరు
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. కాగా.. క్విప్ ముగిసిన నేపథ్యంలో యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ప్రైజెస్ షేరు నష్టాలతో డీలాపడగా.. ఫాస్ట్‌ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా యాంబర్ ఎంటర్ప్రైజెస్ రూ. 400 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 1,780 ధరలో చేపట్టిన క్విప్ గురువారం(10న) ముగిసింది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.6 శాతం కుప్పకూలి రూ. 1,723ను తాకింది. ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 1,757 వద్ద ట్రేడవుతోంది. వెరసి మంగళవారం నమోదైన ఇంట్రాడే గరిష్టం రూ. 1,997తో పోలిస్తే 12 శాతం నీరసించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో మెరుగైన ఫలితాలు ప్రకటించగలదన్న అంచనాలతో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్ మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,378వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.5 శాతం లాభంతో రూ. 2,322 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ జులై, ఆగస్ట్‌లలో అమ్మకాలు సగటున 77 శాతం చొప్పున పుంజుకున్నట్లు వెల్లడించింది. -
దుమ్మురేపిన జుబిలంట్ ఫుడ్స్
న్యూఢిల్లీ: డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహించే జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ జూన్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. స్టోర్ల వారీ విక్రయాల్లో మంచి వృద్ధి ఉండడంతో లాభం మూడు రెట్లు దూసుకుపోయి రూ.74.67 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం కేలం రూ.23.84 కోట్లు. ప్రస్తుత స్టోర్ల వారీగా అమ్మకాల్లో వృద్ధి 25.9 శాతంగా ఉండడమే ఈ స్థాయి లాభాలకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం వృద్ధితో రూ.681 కోట్ల నుంచి రూ.862 కోట్లకు చేరింది. ‘‘అద్భుతమైన ఉత్పత్తులు, డబ్బుకు తగ్గ విలువను అందించడం, డిజిటల్ తోడ్పాటు వల్లే డామినోస్ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధ్యమైంది. దీనికితోడు డంకిన్ డోనట్స్ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్రేక్ ఈవెన్ (లాభ, నష్ట రహిత స్థితి) దశకు తీసుకురావడంపై దృష్టి పెట్టినందున లాభాల వృద్ధి కొనసాగుతుంది’’ అని జుబిలంట్ ఫుడ్స్ చైర్మన్ శ్యామ్ ఎస్ భర్తియా, కో చైర్మన్ హరి ఎస్ భర్తియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 1,144 డామినోస్ పిజ్జా అవుట్లెట్లను, 37 డంకిన్డోనట్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది. జూన్ త్రైమాసికంలో కొత్తగా కంపెనీ 13 డామినోస్ పిజ్జా స్టోర్లను ప్రారంభించగా, మూడు చోట్ల దుకాణాలను మూసేసింది. డంకిన్ డోనట్స్ విషయంలో ఒకటి మూసేసి, మరో చోట ఇంకో స్టోర్‌ను తెరిచింది. ఫలితాల నేపథ్యంలో జుబిలంట్ స్టాక్ ఒకదశలో 3 శాతానికి పెరిగి రూ.1490ని చేరుకున్నా... చివరకు లాభాల స్వీకరణ కారణంగా 2.5 శాతం నష్టపోయి రూ.1,400 వద్ద క్లోజ్ అయింది. -
జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ లాభం పదింతలు
న్యూఢిల్లీ: జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో పది రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.78 కోట్లకు పెరిగింది. డొమినో ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడం, ఆన్లైన్ అమ్మకాలు జోరుగా ఉండడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ వివరించింది. మొత్తం ఆదాయం రూ.616 కోట్ల నుంచి రూ.793 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం డెలివరీ ఆర్డర్లలో ఆన్లైన్ అమ్మకాలు 63 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.206 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,561 కోట్ల నుంచి రూ.3,003 కోట్లకు ఎగసిందని వివరించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఈక్విటీ షేర్‌ను బోనస్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. అంతే కాకుండా రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇస్తామని పేర్కొంది. నికర లాభం పది రెట్లు పెరగడం, 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వడం వంటి కారణాల వల్ల బీఎస్ఈ ఇంట్రాడేలో జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,668 ను తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో చివరకు 2% నష్టంతో రూ.2,560 వద్ద ముగిసింది. -
స్టాక్ట్స్ వ్యూ
బ్యాంక్ ఆఫ్ బరోడా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: నొముర ప్రస్తుత ధర: రూ.160 టార్గెట్ ధర: రూ.210 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం 48 శాతం క్షీణించి రూ.598కోట్లకు తగ్గింది. కేటాయింపులు 58 శాతం పెరగడమే దీనికి కారణం. ఫీజు ఆదాయం ఎక్కువగా ఉండటంతో వడ్డీయేతర ఆదాయం 15 శాతం పెరిగింది. రిటైల్, ఎస్ఎంఈ సెగ్మెంట్లకు సంబంధించిన రుణాల్లో వృద్ధి చెప్పుకోదగ్గ విషయం. క్యూ3తో పోల్చితే మొండి బకాయిలు తగ్గాయి. మెటల్, ఇన్ఫ్రా కంపెనీలకు అధిక మొత్తంలో రుణాలివ్వడంతో అసెట్ క్వాలిటీ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడగలదని బ్యాంక్ భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 9 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 14 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. ఫీజు ఆదాయం ఆరోగ్యకరంగా ఉండడం, కాసా వృద్ధి కారణంగా రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) మెరుగుపడే అవకాశాలు.. సానుకూలాంశాలు. జూబిలంట్ ఫుడ్‌వర్క్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.1,752 టార్గెట్ ధర: రూ.2,000 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 25 శాతం వృద్ధితో రూ.542 కోట్లకు పెరిగాయి. సంవత్సరంన్నర కాలంలో ఇదే అత్యధికం. నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.31.5కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 150 డొమినోస్, 28 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 150 డొమినోస్, 30 డంకిన్ డునాట్స్ స్టోర్స్‌ను ప్రారంభించనున్నది. డంకిన్ డునాట్స్ వ్యాపార విభాగం 2-3 ఏళ్లలో బ్రేక్ఈవెన్ సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. కొత్తగా స్టోర్స్ ఏర్పాటు ద్వారా నెట్వర్క్ విస్తరిస్తోంది. వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. గత ఏడాది జూన్‌లో ఒకసారి, నవంబర్‌లో మరొకసారి 3 శాతం చొప్పున ధరలను పెంచింది. ఫలితంగా కంపెనీ ఆదాయం పెరిగింది. వచ్చే నెలలో మరోసారి ధరలను పెంచనున్నది. 2013-14 క్యూ4లో 18 శాతంగా ఉన్న ఆన్లైన్ ఆర్డర్లు 2014-15క్యూ4లో 29 శాతానికి పెరిగాయి. మూడేళ్లలో ఇవి 50 శాతానికి పెరుగుతాయని అంచనా. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,166 టార్గెట్ ధర: రూ.1,220 ఎందుకంటే: భారత ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రధన కంపెనీల్లో ఒకటి. పలు గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది. గుడ్‌నైట్(దోమల నివారిణి), నంబర్ 1, సింధాల్ (సబ్బులు), గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్(హెయిర్ కలర్స్), ఎర్(ఎయిర్ ఫ్రెషనర్స్), గోద్రేజ్ ప్రోటెక్ట్( హెల్త్ అండ్ వెల్నెస్) బ్రాండ్లతో అమ్మకాలు సాధిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో విస్తరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు బావున్నాయి. నికర అమ్మకాలు 8% వృద్ధితో రూ.2,092 కోట్లకు పెరిగాయి. భారత్‌లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇక ఇబిటా 13% వృద్ధితో రూ.406 కోట్లకు పెరిగింది. నికర లాభం 12% వృద్ధితో రూ.265 కోట్లకు పెరిగింది. ఘనాలోని డార్లింగ్ గ్రూప్‌లో వంద శాతం వాటాను, దక్షిణాఫ్రికాలోని ఫ్రికా హెయిర్ కంపెనీల్లో వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.