
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో క్విక్ సరీ్వస్ రెస్టారెంట్ల(క్యూఎస్‌ఆర్) దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ. 76 కోట్లు మాత్రమే ఆర్జించింది. డెలివరీ, టేక్‌ఎవే చానల్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు జూబిలెంట్ ఫుడ్ పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ తదితర సుప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. కాగా.. క్యూ2లో మొ త్తం ఆదాయం సైతం రూ. 816 కోట్ల నుంచి రూ. 1,116 కోట్లకు ఎగసింది. ఇది 37% వృద్ధికి సమానం. అయితే మొత్తం వ్యయాలు రూ. 747 కోట్ల నుంచి రూ. 963 కోట్లకు పెరిగాయి.
ప్రోత్సాహకర ఫలితాల నేపథ్యంలోనూ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బీఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమైంది. రూ. 3,965 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment