భారతదేశంలో వ్యాపార దిగ్గజాల్లో ఒకటి గోద్రెజ్ గ్రూప్. 2017లో నిసాబా ఆది గోద్రెజ్ కంపెనీ కీలక బాధ్యతలను నెత్తినవేసుకొని పెనుసవాళ్లను స్వీకరిస్తూ విజయబావుటా ఎగరేసిన ధీర. 13.9 బిలియన్ డాలర్లు విలువైన గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్‌ను గ్లోబల్‌గా తీర్చిదిద్దారు.
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్(జీసీసీఎల్) ఆవిష్కారం, ప్రపంచవ్యాప్త కంపెనీగా తీర్చిదిద్దడంలో నిసాబా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2007లో ఆమె ప్రారంభించిన ప్రాజెక్ట్ లీప్‌ఫ్రాగ్, జీసీసీఎల్ ఏకీకరణ ద్వారా ఆగ్రోలో సేంద్రీయ వృద్ధికి దారితీసింది. పలు విదేశాల్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో పెట్టుబడులతో ప్రపంచవ్యాప్త కంపెనీగా మారింది.
నెలల చంటిబిడ్డతోనే
కుటుంబ వ్యాపారంలోకి ఆమె ప్రవేశం కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ, పని పట్ల మక్కువతో, నిబద్దతతో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని, వ్యాపార విస్తరణలో నిసాబా తనను తాను నిరూపించుకున్నారు. ఎదురైనా ప్రతీ ఛాలెంజ్‌ను అవకాశంగా మల్చుకున్నారు. ఈ క్రమంలో కుమారుడు జన్మించిన ఒక నెలలోనే , తరచుగా పసిబిడ్డను ఆఫీసుకుని వెళ్లి మరీ పనిని తిరిగి ప్రారంభించారు.
నిసాబా గోద్రెజ్ ఇండస్ట్రీస్, దాని సోదర కంపెనీల కోసం కార్పొరేట్ వ్యూహాన్ని కూడా నిసాబా నిర్వహిస్తారు. గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ Re 1 మస్కిటో రెపెల్లెంట్, హిట్ యాంటీ-రోచ్ జెల్ వంటి కొన్ని వినూత్నమైన , ప్రసిద్ధ ఉత్పత్తులను ఆమె పర్యవేక్షణలో వచ్చినవే. అలాగే అధునా భబానీ ఓష్ భబానీకి చెందిన సెలూన్ చైన్ BBluntలో 30 శాతం పెట్టుబడి పెట్టడంతో జీసీపీఎల్ సెలూన్ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్రాండ్ పేరుతో ప్రత్యేకమైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను కూడా విడుదల చేశారు.
సోషల్ సర్వీసులోనూ
సామాజిక సేవలో కూడా నిసాబా ముందే ఉన్నారు. జీసీపీఎల్ , గోద్రెజ్ అగ్రోవెట్ టీచ్ ఫర్ ఇండియా బోర్డులలో ప్రాతినిధ్యం ఉన్న ఆమె తక్కువ-ఆదాయ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారు .కళాశాల గ్రాడ్యుయేట్లు పని చేసే నిపుణులను రెండు సంవత్సరాల పాటు పూర్తి సమయం ఉపాధ్యాయులుగా నియమిస్తోంది. అలాగే గోద్రెజ్ గ్రూప్ 'గుడ్ & గ్రీన్' CSR చొరవను కూడా నడుపుతున్నారు . గోద్రెజ్ ఫ్యామిలీ కౌన్సిల్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు.
నిసాబా గోద్రెజ్ ఎవరు?
గోద్రెజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రెజ్ చిన్న కుమార్తె నిసాబా. నిసాబా సోదరి తాన్యా దుబాష్ వ్యాపారంలో ముఖ్యమైన సభ్యులు.1978లో జన్మించిన నిసాబా తన బాల్యాన్ని ముంబైలో తన తోబుట్టువులు తాన్యా దుబాష్ , పిరోజ్షా ఆది గోద్రెజ్‌లతో గడిపారు.
నిసాబా 2000లో వార్టన్ స్కూల్, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పొందిన తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పట్టా పొందారు. నిసాబా 2013లో ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతాను వివాహమాడారు. ఈ జంటకు జోరాన్, ఐడాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు
కాగా 1.6 బిలియన్ల (సుమారు రూ. 9,600 కోట్లు) ఏకీకృత ఆదాయాన్ని కలిగి ఉన్న గోద్రెజ్‌లో నిసాబా సంస్థ అతి పిన్న వయసులోనే చైర్మన్ కావడం ఒక విశేషమైతే కంపెనీ బోర్డులో అత్యధికంగా ఐదుగురు మహిళా డైరెక్టర్లుండటం విశేషం. అంతేకాదు మహిళలకు సౌకర్యవంతమైన పని వేళలు, ఇంటినుండి పని చేసే అవకాశాలు, మిడ్‌మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన మహిళలు తిరిగి రావడానికి సహాయపడే ప్రోగ్రామ్‌ను అందించడం ద్వారా గోద్రెజ్ మహిళలకు ఉద్యోగాల్లో మరింత ప్రోత్సహిస్తుంది. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం గోద్రెజ్ నికర విలువ దాదాపు రూ. 1.1 లక్షల కోట్లు .
బాలీవుడ్ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా
6 సంవత్సరాల వయస్సులో, నిసా 1986లో బాలీవుడ్ చిత్రం "జాన్‌బాజ్"లో ప్రారంభ సన్నివేశంలో N.A.G అక్షరాలతో ఉన్న గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment