The domestic market
-
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్..
ముంబై: కోవిడ్–19(కరోనా వైరస్) తాజా పరిణామాలు, ఏజీఆర్ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న నేపథ్యంలో పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ మరణాల సంఖ్య ఇప్పటికే 1,500 దాటిపోవడం, వూహాన్లో అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి అందించాలనుకున్న ఇద్దరు జర్నలిస్ట్‌ల ఆచూకీ తెలియకుండా పోవడం వంటి పరిణామాలు సోమవారం ట్రేడింగ్‌పై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తేల్చి చెప్పిన కారణంగా మార్కెట్ గమనానికి ఇది అత్యంత కీలకంగా మారిపోయిందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఇప్పటికే 28 దేశాలకు వ్యాపించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ సూచీల ప్రయాణానికి అతి పెద్ద సవాలుగా మారిందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. క్రూడ్ ధర పెరిగింది ముడి చమురు ధరలు గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లలో నాలుగు రోజులు లాభపడ్డాయి. వీక్ ఆన్ వీక్ ఆధారంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 5 శాతం మేర పెరిగింది. శుక్రవారం 1.76 శాతం లాభపడి 57.33 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.36 వద్దకు చేరుకుంది. బడ్జెట్ తరువాత నుంచి 71.10–71.50 శ్రేణిలోనే కదలాడుతోంది. అవెన్యూ సూపర్‌మార్ట్ (డీమార్ట్) స్టేక్ సేల్‌లో ఎఫ్ఐఐ నిధులు ఉండనున్నందున ఈ వారంలో రూపాయి మారకం విలువకు మద్దతు లభించే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెన్సీ రీసెర్చ్ రాహుల్ గుప్తా విశ్లేషించారు. ఆర్థిక అంశాల ప్రభావం.. ఫెడ్ జనవరి పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 20న (గురువారం) ప్రకటించనుంది. ఇదే రోజున ఆర్బీఐ మినిట్స్ వెల్లడికానున్నాయి. అమెరికా తయారీ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ 21న వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఎఫ్‌పీఐ నిధులు రూ. 24,617 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,617 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి 1–14 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 10,426 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 14,191 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులే.. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (21న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. -
ఇక సెల్కాన్ ఎల్ఈడీ టీవీలు!
సెల్కాన్ సీఎండీ వై. గురు * సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి తయారీకి రూ.100 కోట్లు వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రంగంలో ఉన్న సెల్కాన్ త్వరలో ఎల్ఈడీ టీవీల తయారీలోకి అడుగుపెడుతోంది. 14 అంగుళాల నుంచి 50 అంగుళాల సైజులో ఉండే టీవీలను రూపొందిస్తారు. దీనికోసం అంతర్జాతీయ బ్రాండ్లకు విడిభాగాలను సరఫరా చేస్తున్న చైనా, తైవాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలతో సెల్కాన్ చేతులు కలిపింది. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్‌లో ఉన్న మొబై ల్స్ అసెంబ్లింగ్ ప్లాంటులోనే టీవీలను కూడా తయా రు చేస్తారు. ఈ విషయాన్ని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెల్కాన్ సీఎండీ వై. గురు ధ్రువీకరించారు. సంక్రాంతికల్లా దేశీయ మార్కెట్లోకి టీవీలను ప్రవేశపెడతామన్నారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. టీవీల తయారీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి తొలి కంపెనీగా రాబోతున్నారు. ఈ విభాగంలో మీ భవిష్యత్ వ్యూహమేంటి? అందుబాటు ధరలో ఆకర్షణీయ మోడళ్లను అందించడం ద్వారా మొబైల్స్ మార్కెట్లో సెల్కాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే ఊపుతో ఇప్పుడు ఎల్ఈడీ టీవీల రంగంలోకి ప్రవేశిస్తున్నాం. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రంగంలోకి ప్రవేశించిన తొలి కంపెనీ మాదే అవుతుంది. టీవీ విడిభాగాల తయారీలో పేరున్న లిస్టెడ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. సంక్రాంతికి సెల్కాన్ టీవీలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ముందుగా ఈ-కామర్స్ వేదికగా విక్రయిస్తాం. ఆ తర్వాత రిటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి. టీవీల తయారీ కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తున్నాం. మరో రెండు మొబైల్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నారు కదా! ఎక్కడివరకూ వచ్చింది? రేణిగుంట ప్లాంటుకు ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాబ్‌సిటీలో మరో ప్లాంటును నెలకొల్పుతున్నాం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం 11.5 ఎకరాలను కేటాయించింది. ఈ రెండు ప్లాంట్లలో మార్చికల్లా తయారీని ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలతోపాటు ఎల్ఈడీ టీవీలను సైతం వీటిల్లో ఉత్పత్తి చేస్తాం. ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లను భవిష్యత్తులో రూపొందిస్తాం. నిధుల సమీకరణ సంగతో..? ముందుగా ప్లాంట్లలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకోవాలి. ఆ తర్వాత విస్తరణకు పీఈ ఫండ్ల నుంచి నిధులు సేకరించాలనే ఆలోచన ఉంది. అయితే ఎంత మొత్తం సమీకరించేదీ ఇంకా నిర్ణయించలేదు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు, భాగస్వామ్యానికి ఈ రంగంలో ఉన్న విదేశీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాథ హంతో సెల్కాన్లో విదేశీ కంపెనీలు పెట్టుబడికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. జేవీకి సైతం ప్రతిపాదనలు చేస్తున్నాయి. ప్రస్తుతం మాకు బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి మద్దతుంది. నిధులకు ఢోకా లేదు. 4జీ మార్కెట్లోకి ఎప్పుడు వస్తున్నారు? ట్యాబ్లెట్ పీసీల విపణిపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు మోడళ్లున్నాయి. రెండు మూడు నెలల్లో అయిదు మోడళ్లు రానున్నాయి. ఇందులో 4జీ వేరియంట్ కూడా తెస్తున్నాం. ఇంటెల్ చిప్సెట్తో ఒక ట్యాబ్లెట్‌ను కొద్ది రోజుల్లో ఆవిష్కరిస్తాం. ఈ మోడల్‌ను ఆన్లైన్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తాం. ఇప్పటి వరకు 3జీ స్మార్ట్ఫోన్లకే పరిమితమయ్యాం. డిసెంబరులో 4జీ స్మార్ట్ఫోన్ల విభాగంలోకి ప్రవేశిస్తాం. -
ఫార్మా కంపెనీలకు దేశీయ మార్కెట్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఫార్మా కంపెనీలకు ఉత్తర అమెరికా మార్కెట్ అంతగా కలిసి రాకపోయినా ఆ మేరకు దేశీయ మార్కెట్ ఆదుకుంది. ప్రధాన కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే ఆదాయ, నికర లాభాలపై అమెరికా నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇదే సమయంలో ఊహించని విధంగా దేశీయ మార్కెట్లో ఆదాయం పెరగడం విశేషం. గత కొన్నేళ్లుగా సింగిల్ డిజిట్‌కి పరిమితమైన దేశీయ ఫార్మా మార్కెట్ వృద్ధి ఈ ఏడాది 12-15 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ త్రైమాసికంలో ఫార్మా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని, కాని డాలరుతో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉండటంతో రానున్న కాలంలో ఎగుమతుల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. ఈ త్రైమాసికంలో పలు ప్రధాన కంపెనీలు ఈ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేశాయి. సన్ ఫార్మా, సిప్లా, లూపిన్ కంపెనీలు ఈ త్రైమాసిక దేశీయ ఆదాయంలో 20 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేస్తే, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలు 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఉదాహరణకి దేశీయ అతిపెద్ద ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ఈ త్రైమాసికంలో అమెరికా వ్యాపారంలో 15 శాతం వృద్ధిని నమోదు చేస్తే, ఇదే సమయంలో ఇండియా వ్యాపారంలో అత్యధికంగా 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ కూడా ప్రధాన ఆదాయ వనరైన అమెరికా మార్కెట్లో కేవలం 9 శాతం వృద్ధిని నమోదు చేస్తే దేశీయ మార్కెట్లో 14 శాతం వృద్ధిని సాధించింది. మారిన నిబంధనల వల్ల అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల అనుమతికి జాప్యం జరుగుతోందని, దీనికి తోడు ధరలపై ఒత్తిడి ఉండటం కూడా అమెరికా వ్యాపార వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణంగా డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి ఫలితాల విడుదల సందర్భంగా తెలిపారు. కానీ ఇదే సమయంలో అరబిందో ఫార్మా ఎగుమతుల వృద్ధి, దేశీయ ఆదాయ వృద్ధి కంటే ఎక్కువగా ఉంది. ఎగుమతుల్లో 32 వృద్ధి నమోదైతే, దేశీయ ఆదాయంలో కేవలం 6 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. సిప్లా అయితే ఎగుమతులు 9 శాతం క్షీణిస్తే, దేశీయ ఆదాయం 20 శాతం మేర పెరిగింది. ఈ త్రైమాసిక ఫలితాలను చూసి దేశీయ ఫార్మా టర్న్ ఎరౌండ్ అయ్యిందని చెప్పలేం కాని, గతంతో పోలిస్తే వృద్ధి బాగుందంటున్నారు జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి. దాదాపు సగం టర్నోవర్ ఇక్కడి నుంచే... ప్రస్తుతం దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయం సుమారు రూ. 1.70 లక్షల కోట్లు ఉండగా, అందులో రూ. 90,000 కోట్లు ఎగుమతుల నుంచి వస్తుంటే, రూ. 80,000 కోట్లు దేశీయ మార్కెట్ నుంచి సమకూరాయి. అతిపెద్ద జనాభా కలిగిన దేశీయ జనాభాలో కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో దేశీయ ఫార్మా రంగం వేగంగా విస్తరించనుందని ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. గత రెండేళ్ల నుంచి దేశీయ ఫార్మా వేగంగా విస్తరిస్తోందని, కానీ ఇదే సమయంలో అమెరికాతో సహా ఇతర యూరప్ దేశాల్లో ఫార్మా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. -
ఎఫ్ఎంసీజీలో 10% వృద్ధి
గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీవోవో సునీల్ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణి ఉత్పత్తులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగం దేశంలో రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుందని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రంగం పనితీరు గతేడాది కంటే బాగుందని కంపెనీ సీవోవో సునీల్ కటారియా తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణిలో అయిదు రకాల ఉత్పత్తులను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 10 శాతం వాటా లక్ష్యం: ప్రొటెక్ట్ శ్రేణిలో చేతులను శుభ్రం చేసుకునేందుకు వాడే నాలుగు రకాల ఉత్పత్తులతోపాటు దోమల నుంచి శరీరాన్ని రక్షించే స్ప్రే ‘బజ్ ఆఫ్’ ఉన్నాయి. వీటి ధరలు రూ.50 నుంచి ప్రారంభమవుతాయి. చిన్న పిల్లలు నురగను ఇష్టపడతారని, అందుకే భారత్‌లో తొలిసారిగా ఫోమ్ హ్యాండ్ వాష్‌ను ప్రవేశపెట్టినట్టు క ంపెనీ తెలిపింది.