మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు | Homegrown FMCG companies are going 'natural' to boost business | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు

Jul 8 2016 1:15 AM | Updated on Oct 2 2018 8:16 PM

మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు - Sakshi

మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు

ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ హావెల్స్.. అత్యాధునిక శ్రేణికి చెందిన వాటర్ హీటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) కంపెనీ హావెల్స్.. అత్యాధునిక శ్రేణికి చెందిన వాటర్ హీటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉష్ణోగ్రతల స్థాయిని వెల్లడించేందుకు ఎల్‌ఈడీ ద్వారా రంగు మారేలా అధునాతన ఫీచర్‌ను పొందుపరిచింది. అంటే నీరు సాధారణం నుంచి గరిష్టంగా 75 డిగ్రీల వేడికి చేరినప్పుడు వాటర్ హీటర్ రంగు నీలం నుంచి జేగుర్ (అంబర్) రంగుకు మారుతుంది. అడోనియా సిరిస్ కింద డిజైన్ చేసిన ఈ హీటర్లు డిజిటల్ టెంపరేచర్ ఇండికేటర్‌లోనూ లభ్యమవుతాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ తెలియజేసింది. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement