water heater
-
కుటుంబాన్ని మింగేసిన గీజర్ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
వేడి నీటి కోసం ఉపయోగించే గీజర్నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ కారణంగా హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఆధునిక కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ తమ వాష్ రూములలో చిన్నా, పెద్దా గీజర్లను వాడుతున్నారు. పైగా ఇపుడు వర్షాకాలం కూడా కావడంతో స్నానానికి వేడి నీటిని వాడటం ఇంకా అవసరం. ఈ నేపథ్యంలో గీజర్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వాటర్ హీటర్ మీ ఇంటికి సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోవాలి. వాటర్ హీటర్ చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనెక్షన్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు తొందరగా చల్లారిపోకుండా అదనపు మందపాటి ఇన్సులేషన్ వాడాలి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. వేడి నీటి హీటర్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా సెట్ చేయకూడదు. హాట్ వాటర్ హీటర్ నాబ్‌లు , బటన్లు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పిల్లలకు దూరంగా ఉండాలి.టెస్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్: అధిక ఒత్తిడి , అధిక ఉష్ణోగ్రతల విషయంలో మీ వాటర్ హీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా, సర్వీస్ టెక్నీషియన్ ద్వారానే మరమ్మత్తు చేయించడం ఉత్తమంగ్యాస్ గీజర్‌లో బ్యూటేన్ , ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్‌ను లాంటి హాని కరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలొస్తాయి. అందుకే బాత్రూమ్లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా అమర్చాలి. లేదా గాలి, వెలుతురు ఉండేలా అయినా జాగ్రత్త పడాలి.ముఖ్యంగా వర్షాకాలంలో గీజర్ ఆన్‌లోనే ఉండగానే షవర్ బాత్ చేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాదు, వీలైతే వేటి నీటిని బకెట్లో నింపుకొని, గీజర్ ఆఫ్ చేసి తరువాత మాత్రమే స్నానానికి వెళ్లడం ఇంకా ఉత్తమం.ఎలక్ట్రిక్ హీటర్లు పర్యావరణానికి నష్టం కూడా. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిది. అలాగే హీటర్లను వినియోగించేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, అప్రమత్తంగా ఉండాలి. -
విజయవాడ:చంటిబిడ్డను బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కన్నతల్లి నిర్లక్ష్యం చంటిబిడ్డ ప్రాణాలు హరించింది. ముఖం నుంచి నడుం వరకూ అంతా వేడి నీటికి కాలిపోయినా మృత్యువుతో ఆ బిడ్డ చేసిన పోరాటం చివరకు విషాదంగా ముగిసింది. బోసి నవ్వులు, బుడి బుడి అడుగులు ఇక కనపడవన్న విషయం తెలిసిన ఆ కన్నవారికి కన్నీళ్లే మిగిల్చింది. కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో పడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడీపేటకు చెందిన ఆదిమల్ల ప్రణితి, ప్రేమ్కుమార్లు భార్యభర్తలు. వీరికి పాప(8 నెలలు) సంతానం. ప్రేమ్‌కుమార్ సెంట్రింగ్ పని చేస్తుండగా, ప్రణితి ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 27వ తేదీన భర్త ప్రేమ్‌కుమార్ పనికి వెళ్లగా, పాపకు స్నానం చేయించేందుకు మంచం పక్కనే.. ప్లాస్టిక్ బకెట్లో ఎలక్ట్రికల్ హీటర్ పెట్టి బాత్రూమ్లోకి వెళ్లింది. ఇంతలో గదిలో నుంచి పాప ఏడుపు వినిపించడంతో కంగారుగా వచ్చి చూసింది. పాప వేడినీటి బకెట్లో తల కిందులుగా పడి ఉండటంతో భయంతో కేకలు వేసింది. పాపను వేడినీటిలో నుంచి బయటకు తీయగా ముఖం, రెండు చేతులు, పొట్ట భాగం, వీపు, కాలి భాగం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో పాప చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పసిపిల్లలు ఉన్న ఇంట్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటారు తల్లిదండ్రులు, పెద్దలు. కానీ, ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే.. అనుక్షణం పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. -
హింటాస్టికా ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హింద్‌వేర్, గ్రూప్ ఆట్లాంటిక్ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ హింటాస్టికా ప్లాంటు ప్రారంభం అయింది. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద రూ.210 కోట్లతో దీనిని నెలకొల్పారు. హింద్‌వేర్ అట్లాంటిక్ బ్రాండ్‌లో వాటర్ హీటర్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 6 లక్షల యూనిట్ల వాటర్ హీటర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో స్థాపించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. భారత్‌తోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తామని హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ చైర్మన్ సందీప్ సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్లలో పూర్తి సామర్థ్యానికి చేరుకుంటామన్నారు. ఆ సమయానికి రూ.150 కోట్లతో 50 శాతం సామర్థ్యం అదనంగా జోడిస్తామని వెల్లడించారు. -
ఏవో స్మిత్ విద్యుత్ ఆదా వాటర్ హీటర్
బెంగళూరు: వాటర్ హీటింగ్ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపెనీ అయిన ఏవో స్మిత్ ‘ఎలిగెన్స్ ప్రైమ్’ పేరుతో ఓ అధునాతన వాటర్ హీటర్‌ను విడుదల చేసింది. ఇది విద్యుత్ వినియోగాన్ని ఆదా చేసే ఫైవ్ స్టార్ రేటెడ్ ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది. ఇందులో రస్ట్ రెసిస్టెడ్ ఇంటెగ్రేటెడ్ డిఫ్యూజర్ టెక్నాలజీని వినియోగించినట్టు, విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు, నీటి వేడి కోల్పోకుండా చూస్తుందని పేర్కొంది. దీర్ఘకాలం పాటు మన్నుతుందని, కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను తీసుకురావాలన్న తమ విధానంలో భాగమే ఈ ఉత్పత్తి అని తెలిపింది. 15 లీటర్లు, 25 లీటర్ల సైజులో లభించే ఈ వాటర్ హీటర్ ధర రూ.11,400 నుంచి మొదలవుతుందని ఏవో స్మిత్ పేర్కొంది. -
విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ హీటర్ల తయారీలో ఉన్న యూఎస్ దిగ్గజం ఏ.ఓ.స్మిత్ తాజాగా హీట్‌బోట్ పేరుతో ఎనిమిది నూతన మోడల్స్‌ను బుధవారమిక్కడ విడుదల చేసింది. రిమోట్‌తో పనిచేసే ఈ హీటర్‌లో ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఏ సమయానికి వేడి నీళ్లు కావాలో టైమర్‌తో నిర్దేశించవచ్చు. ధరల శ్రేణి రూ.10–15 వేలుంది. అలాగే ఎక్స్–7 ప్లస్ పేరుతో ఆర్వో వాటర్ ప్యూరిఫయర్‌ను సైతం ప్రవేశపెట్టింది. టీడీఎస్ స్థాయి 3,000 వరకు ఉన్న నీటిని కూడా ఇది శుద్ధిచేస్తుందని ఏ.ఓ.స్మిత్ ఇండియా వాటర్ ప్రొడక్ట్స్ ఎండీ పరాగ్ కులకర్ణి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ఇతర ఆర్వోలతో పోలిస్తే నీటి వృధా గణనీయంగా తగ్గిస్తుంది. ధర రూ.18,000గా నిర్ణయించాం. ఇక స్టోరేజ్ వాటర్ హీటర్ల విభాగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఎక్కువ కాలం మన్నేలా పేటెంటెడ్ టెక్నాలజీ అయిన బ్లూ డైమండ్ గ్లాస్ లైనింగ్‌ను హీటర్ల తయారీలో వాడుతున్నాం. ఏటా నాలుగైదు వాటర్ ప్యూరిఫయర్లు, 7–10 వాటర్ హీటర్లను ప్రవేశపెడతాం. నాణ్యత, టెక్నాలజీ పరంగా విభిన్న ఉత్పాదనలతో పోటీపడతాం’ అని వివరించారు. -
వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు
కర్ణాటక, హొసూరు: వేరేవారితో మొబైల్ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించిన భర్తకు భార్య వినూత్నంగా సమాధానమిచ్చింది. నిద్రపోతుండగా అతనికి వాటర్ హీటర్‌తో వాతలు పెట్టి పరారైంది. వివరాలు.. అంచెట్టి తాలూకా నా ట్రాంపాళ్యం సమీపంలోని పంజల్తురై గ్రామానికి చెందిన చిన్నరాజ్ (37). ఇత ని భార్య జ్యోతి. వీరికి గత ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగి ఆరేళ్ల బాలుడున్నాడు. ప్రస్తు తం చిన్నరాజు కుటుంబంతో కలిసి హొ సూరు సమీపంలోని బేళగొండపల్లిలో నివాసముంటున్నాడు. అక్కడే క్రషర్లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరో ముగ్గురిని పిలిపించి.. ఆదివారం రాత్రి పని ముగించికొని చిన్న రాజు ఇంటికొచ్చేసరికి భార్య మరో వ్యక్తి తో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని చిన్నరాజు నిలదీయడం తో ఇద్దరి మధ్య గలాటా జరిగింది. చిన్న రాజు రాత్రి నిద్రిస్తుండగా సోమవారం వేకువజాము భార్య జ్యోతి, మరో ము గ్గురు వ్యక్తులను పిలిపించింది. వాటర్‌హీటర్‌ను వేడిచేసి భర్తకు వాతలు పెట్టింది.చిన్నరాజు లేవకుండా మిగతా ముగ్గు రూ గట్టిగా పట్టుకొన్నారు. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుప్రక్కలవారు అక్కడికి చేరుకొనేసరికి భార్య జ్యోతి, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. తీవ్ర గాయాలేర్పడిన చిన్నరాజును స్థానికులు చికిత్స కోసం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భార్య, మరో ముగ్గురి వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
ప్రాణం తీసిన వాటర్‌హీటర్
ధర్మపురి: వాటర్ హీటర్ ఓ వివాహిత ప్రాణం తీసింది. పెళ్లయిన తర్వాత కూడా చదువుకొనసాగిస్తున్న ఆమె బీఈడీ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైంది. శనివారం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. స్నానానికి వేడినీళ్ల కోసం వాటర్‌హీట్ పెట్టుకోగా నీటికి విద్యుత్ సరఫరా కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోపాల్పూర్ గ్రామానికి చెందిన నగేశ్– జల(26) దంపతులకు నాలుగేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు శ్రీనిధి, అశ్విని ఉన్నారు. ఉపాధ్యాయురాలు కావాల న్న ఆశయంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ చదువుతోంది. జల భర్త నగేశ్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబయ్ వెళ్లాడు. ఈ క్రమంలో బీఈడీ పరీక్షల శనివారం నుంచి ప్రారంభమయ్యా యి. పరీక్షలకు సిద్ధమైన జల పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు స్నానానికి వేడినీళ్ల కోసం ఇత్తడి పాత్రలో వాటర్‌హీటర్ పెట్టుకుంది. ఈ క్రమంలో వాటర్‌హీటర్‌కు ఉన్న తీగ బయటకు వచ్చి పాత్రకు తగిలింది. పాత్రను తాకుతూ కొద్ది దూరంలో ఉన్న నీటికి కూడా విద్యుత్ సరఫరా అయింది. అటుగా వచ్చిన జల నీటిలో అడుగుపెట్టడంతో షాక్‌కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. ఏం జరిగిందో తెలియక జల ఇద్దరు కూతుళ్లు అమ్మా అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుబాయ్ వెళ్లిన భర్త నగేశ్‌కు జల మరణ వార్త అందించారు. వెంటనే అతడు స్వగ్రామానికి బయల్దేరాడు. -
ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్
వాషింగ్టన్: చిన్న పిల్లలు ఏం మాట్లాడినా, ఏం చేసినా వారి పనులు తల్లిదండ్రులను బాధ నుంచి బయట పడేస్తాయి. కొన్నిసార్లు వారు ఓ వస్తువును చూసి అది వేరే వస్తువుగా భావించి దానితో సరదాగా కబర్లు చెబుతుంటారు. అమెరికాలో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ తల్లికి ఎదురైంది. ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మూడేళ్ల కూతురు రెయినా తల్లితో కలిసి రోడ్డుపై నడుస్తోంది. ఇంతలో ఆ చిన్నారికి ఓ వస్తువు(వాటర్ హీటర్) కనిపించింది. తాను చూసింది రోబో అనుకుంది. వెంటనే పరుగు పరుగున ఆ హీటర్ వద్దకు వెళ్లింది. ముద్దు ముద్దుగా హాయ్ వోబో (రోబో) హాయ్ వోబో అని తన పలుకులతో ఆ మేషీన్ ను పలకరించింది. ఆ వెంటనే ‘ఐ లవ్ యూ వోబో(రోబో)’ అంటూ మెటల్ ట్యాంకును గట్టిగా కౌగిలించుకుంది. రోబో తనకు హాయ్ చెప్పాలని, తనతో మాట్లాడాలని ఆ చిట్టితల్లి భావించింది. అయితే తాను చూసింది, మాట్లాడుతున్నది వృథాగా ఉన్న మేషిన్ అని చిన్నారికి తెలియదు కదా. తన కూతురికి రోబో అంటే ఎంత ప్రాణమో తెలిపేందుకు రెయినా తల్లి ఈ ప్రయత్నం చేశారు. కూతురి ముద్దు ముద్దు మాటలను, రోబో అంటే ఇష్టాన్ని, చిన్నారి అమాయకత్వాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అది మొదలు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు
ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ హావెల్స్.. అత్యాధునిక శ్రేణికి చెందిన వాటర్ హీటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉష్ణోగ్రతల స్థాయిని వెల్లడించేందుకు ఎల్ఈడీ ద్వారా రంగు మారేలా అధునాతన ఫీచర్‌ను పొందుపరిచింది. అంటే నీరు సాధారణం నుంచి గరిష్టంగా 75 డిగ్రీల వేడికి చేరినప్పుడు వాటర్ హీటర్ రంగు నీలం నుంచి జేగుర్ (అంబర్) రంగుకు మారుతుంది. అడోనియా సిరిస్ కింద డిజైన్ చేసిన ఈ హీటర్లు డిజిటల్ టెంపరేచర్ ఇండికేటర్లోనూ లభ్యమవుతాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ తెలియజేసింది. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ఉన్నాయి.