ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ | Baby child play with water heater and thought it is a robo | Sakshi
Sakshi News home page

ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్

Published Tue, Mar 28 2017 6:16 PM | Last Updated on Thu, Apr 4 2019 3:19 PM

ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ - Sakshi

ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్


వాషింగ్టన్: చిన్న పిల్లలు ఏం మాట్లాడినా, ఏం చేసినా వారి పనులు తల్లిదండ్రులను బాధ నుంచి బయట పడేస్తాయి. కొన్నిసార్లు వారు ఓ వస్తువును చూసి అది వేరే వస్తువుగా భావించి దానితో సరదాగా కబర్లు చెబుతుంటారు. అమెరికాలో సరిగ్గా ఇలాంటి అనుభవమే ఓ తల్లికి ఎదురైంది. ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. మూడేళ్ల కూతురు రెయినా తల్లితో కలిసి రోడ్డుపై నడుస్తోంది. ఇంతలో ఆ చిన్నారికి ఓ వస్తువు(వాటర్ హీటర్) కనిపించింది. తాను చూసింది రోబో అనుకుంది. వెంటనే పరుగు పరుగున ఆ హీటర్ వద్దకు వెళ్లింది.

ముద్దు ముద్దుగా హాయ్ వోబో (రోబో) హాయ్ వోబో అని తన పలుకులతో ఆ మేషీన్ ను పలకరించింది. ఆ వెంటనే ‘ఐ లవ్ యూ వోబో(రోబో)’ అంటూ మెటల్ ట్యాంకును గట్టిగా కౌగిలించుకుంది. రోబో తనకు హాయ్ చెప్పాలని, తనతో మాట్లాడాలని ఆ చిట్టితల్లి భావించింది. అయితే తాను చూసింది, మాట్లాడుతున్నది వృథాగా ఉన్న మేషిన్ అని చిన్నారికి తెలియదు కదా. తన కూతురికి రోబో అంటే ఎంత ప్రాణమో తెలిపేందుకు రెయినా తల్లి ఈ ప్రయత్నం చేశారు. కూతురి ముద్దు ముద్దు మాటలను, రోబో అంటే ఇష్టాన్ని, చిన్నారి అమాయకత్వాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అది మొదలు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement