Chess Robot Grabbed And Fractured 7-Year-Old Opponent's Finger - Sakshi
Sakshi News home page

Viral Video: రోబోతో చెస్‌ ఓపెన్‌... ఏడేళ్ల చిన్నారికి చేదు అనుభవం

Published Mon, Jul 25 2022 1:37 PM | Last Updated on Mon, Jul 25 2022 2:40 PM

Chess Robot Grabbed And Fractured 7 Year Old Opponents Finger  - Sakshi

మాస్కోలోని చెస్‌ ఓపెన్‌లో అనుహ్య ప్రమాదం చోటు చేసుకుంది.  చెస్‌ ఆడే రోబోతో తలపడిని ఏడేళ్ల చిన్నారికి చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు ఏడేళ్ల బాలుడు ఒక రోబోతో చెస్‌ ఆడుతున్నాడు. ఇంతలో అనుహ్యంగా ఆ చిన్నారి వేలుని రోబో విరిచేసింది. అసలేం జరిగిందంటే... ఆ చిన్నారి రోబోతో చెస్‌ ఆడుతున్నాడు. ఆట కూడా చాలా ఉత్కంఠంగా సాగుతోంది. ఐతే రోబోతో ఆడేటప్పుడూ కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. కానీ ఆ పిల్లాడు ఆ నియమాలను ఉల్లంఘించడంతోనే ఈ ప్రమాదాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఆ చిన్నారి రోబో వంతు ఆట వచ్చినప్పుడూ వేచి ఉండాలి. అలాకాకుండా ఆట మీద జిజ్ఞాస కొద్ది రోబో తన వంతు పూర్తి చేయకమునుపే చెస్‌ బోర్డుపై చేయిపెట్టి తదుపరి ఆటను ఆడేందుకు యత్నించడంతో ఈ ప్రమాదం సంభవించిందని రష్యన్ చెస్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, సెర్గీ స్మాగిన్ పేర్కొన్నారు. ఆ బాలుడి పేరు క్రిస్టోఫర్‌ అని మాస్కోలోని 30 మంది అత్యుత్తమ చెస్‌ ప్లేయర్‌లలో అతను ఒకడని చెప్పారు. అంతేగాదు ఈ రోబో కూడా పలు చెస్‌ మ్యాచ్‌లను ఆడిందని, ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు: వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement