కుటుంబాన్ని మింగేసిన గీజర్‌ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి! | Important safety measures for geysers check here | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని మింగేసిన గీజర్‌ : ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

Jul 24 2024 12:49 PM | Updated on Jul 25 2024 10:11 AM

Important safety measures for geysers check here

వేడి  నీటి కోసం ఉపయోగించే గీజర్‌నుంచి వెలువడిన కార్బన్​ మోనాక్సైడ్​  గ్యాస్‌ కారణంగా హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌కు చెందిన కుటుంబం ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.  ఆధునిక కాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ తమ వాష్ రూములలో చిన్నా, పెద్దా గీజర్లను వాడుతున్నారు. పైగా ఇపుడు వర్షాకాలం కూడా కావడంతో స్నానానికి వేడి నీటిని వాడటం ఇంకా అవసరం. ఈ నేపథ్యంలో గీజర్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

వాటర్ హీటర్ మీ ఇంటికి సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోవాలి. వాటర్ హీటర్ చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావడం వల్ల  ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  కనెక్షన్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. నీళ్లు తొందరగా చల్లారిపోకుండా అదనపు మందపాటి ఇన్సులేషన్‌ వాడాలి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. వేడి నీటి హీటర్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా సెట్ చేయకూడదు. హాట్ వాటర్ హీటర్‌ నాబ్‌లు , బటన్‌లు దృఢంగా ఉండేలా చూసుకోవాలి.  ఇవి పిల్లలకు  దూరంగా ఉండాలి.

టెస్ట్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్: అధిక ఒత్తిడి , అధిక ఉష్ణోగ్రతల విషయంలో మీ వాటర్ హీటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్‌ చేసుకుంటూ ఉండాలి.  ఏడాదికి ఒకసారి అయినా సర్వీసింగ్, రిపేర్ వంటివి ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా, సర్వీస్ టెక్నీషియన్‌ ద్వారానే  మరమ్మత్తు చేయించడం ఉత్తమం

గ్యాస్‌ గీజర్‌లో బ్యూటేన్ , ప్రొపేన్ అనే వాయువులు ఉంటాయి. ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్‌ను లాంటి హాని కరమైన వాయువులు విడుదలౌతాయ్. ఇవి శ్వాసకోస సమస్యలను పెంచుతాయ్. తలనొప్పి, వికారం లాంటి సమస్యలొస్తాయి. అందుకే బాత్‌రూమ్‌లో గీజర్‌ను అమర్చేటప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా అమర్చాలి. లేదా గాలి, వెలుతురు ఉండేలా అయినా జాగ్రత్త పడాలి.

ముఖ్యంగా వర్షాకాలంలో  గీజర్‌ ఆన్‌లోనే ఉండగానే షవర్‌  బాత్‌ చేయకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాదు, వీలైతే వేటి నీటిని బకెట్‌లో నింపుకొని, గీజర్‌ ఆఫ్‌ చేసి తరువాత మాత్రమే స్నానానికి వెళ్లడం ఇంకా ఉత్తమం.

ఎలక్ట్రిక్ హీటర్లు పర్యావరణానికి నష్టం కూడా. హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవడం మంచిది. అలాగే హీటర్లను వినియోగించేటపుడు  సరైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు,  అప్రమత్తంగా ఉండాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement