మందు, సిగరెట్లపై ప్రత్యేక పన్ను
ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త పన్నులు విధిస్తోంది. ప్రతి ప్యాకెట్ సిగరెట్ల మీద, ప్రతి బాటిల్ మందు మీద ఒక్కో రూపాయి చొప్పున పట్టణ రవాణా నిధి కోసం పన్ను విధించాలని భావిస్తున్నారు. వాయుకాలుష్యంపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఈ మేరకు ప్రతిపాదించింది. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది. ఈ పన్ను త్వరలోనే మొదలవుతుంది.
ప్రతి ఒక్క వాహనానికీ తప్పనిసరిగా పీయూసీ స్టిక్కర్ ఉండి తీరాలని ట్రాఫిక్ పోలీసులు నిబంధన విధించారు. ఇలాంటి స్టిక్కర్లు లేనందుకు జనవరి 1 ఉంచి సెప్టెంబర్ 5 వరకు 24వేల మందికి చలాన్లు రాశారు. అలాగే, అనుమతి లేని చోట్ల పార్కింగ్ చేసినా కూడా ఇకమీదట కఠిన చర్యలు తప్పవు. రద్దీ రోడ్ల మీద ఎక్కువ పార్కింగ్ రుసుము, మామూలు రోడ్ల మీద కాస్త తక్కువ రుసుము వసూలు చేయాలని కూడా ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.