మారథాన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నిబద్ధత అవసరం. ఆరోగ్య స్పృహతో ఉన్న క్రీడాకారులు మాత్రమే ఇలాంటివి చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడొక మనిషి అందుకు విరుద్ధం. పొగ తాగుతూ... మారథాన్ చేసి అందర్నీ ఆకర్షించాడు.
వివరాల్లోకెళ్తూ.....చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి మారథాన్ పోటీల్లో స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు. అలా చేయడంతో అతని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాడు. వాస్తవానికి ధూమపానం చేస్తే గుండె, ఊపితిత్తులు, కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందడంతో పరుగు పెట్టడం కష్టమవుతుంది. కానీ ఈ 50 ఏళ్ల చెన్ మాత్రం చైనాలోని జియాండేలో జరిగిన 42 కి.మీ మారథాన్‌ని ధూమపానం చేస్తూ పూర్తి చేశాడు.
పైగా ఈ మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతేగాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్‌గా నిలిచాడు. చెన్ ఇలాంటి వింత స్టంట్‌లు చేయడం ఇది తొలిసారి కాదు. 2018 గ్వాంగ్‌జౌ మారథాన్, 2019 జియామెన్ మారథాన్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు.
దీంతో అతని ఫోటోలు చైనా సోషల్ మాధ్యమం విబోలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మేరకు నెటిజన్లు పొగ తాగకపోతే ఇంకా మెరుగైనా ప్రతిభ కనబర్చేవాడని ఒకరు, అక్షరాల అతని ఊపిరిత్తితులు బాగా పనిస్తున్నాయి అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రస్తుతం మారథాన్ పోటీల్లో ధూమపానం చేయకూడదనే నిబంధనలు లేవు.
(చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్! ఎలాగో తెలుసా?..)
Comments
Please login to add a commentAdd a comment