అంత ఈజీగా స్మోకింగ్‌ అలవాటును వదిలేయొచ్చా..! ఏకంగా 24 ఏళ్లుగా.. | Man Quits Smoking Habit Receives Online Accolades | Sakshi
Sakshi News home page

అంత ఈజీగా స్మోకింగ్‌ అలవాటును వదిలేయొచ్చా..! ఏకంగా 24 ఏళ్లుగా..

Sep 13 2024 1:14 PM | Updated on Sep 13 2024 3:09 PM

Man Quits Smoking Habit Receives Online Accolades

కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. అలవాటు కాకుండానే ఉండాలి. మంచిది కాదు అని తెలిసి విడిచిపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. అందుకు ఎంతో బలమైన సంకల్పం ఉంటే గానీ సాధ్యంకాదు. ముఖ్యంగా సిగరెట్టు లాంటి అలవాట్లను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి ఏకంగా 24 ఏళ్లుగా ఉన్న అలవాటును సులభంగా స్వస్తి చెప్పి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సిగరెట్ట అలవాటు మానాలి అనుకునే వాళ్లు వెంటనే ఇది చదివేయండి.

రిటైల్ అండ్‌ ఛానెల్ సేల్స్ ప్రొఫెషనల్‌ కులకర్ణి అనే వ్యక్తి 24 ఏళ్లుగా రోజుకు పది సిగరెట్లకు పైగా తాగేవాడు. అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఈ ఏడాది శ్రీ కృష్ణజన్మాష్టమి రోజు నుంచి సిగరెట్టు ముట్టకూడదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు. 

అనుకున్నట్లుగానే అలా దాదాపు 17 రోజుల వరకు ఆ వ్యక్తి  సిగరెట్టు జోలికే వెళ్లలేదు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్‌ చేసుకోవడంతో నెట్టింట  బాగా వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు అతడి సంకల్ప బలాన్ని మెచ్చుకుంటూ తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేగాదు కొందరూ ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా స్మోకింగ్‌ స్వస్తి చెప్పొచ్చు అంటూ సలహాలు ఇస్తు పోస్టులు పెట్టడం విశేషం. 

 

(చదవండి: "నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?)

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement