దేశంలో పెరిగిపోతున్న సిగరెట్ల వాడకాన్ని తగ్గించేందుకు.. ఈసారి బడ్జెట్లో సిగరెట్ల మీద పన్నులు భారీగా వడ్డించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సిగరెట్ల పొడవుతో సంబంధం లేకుండా.. ఒక్కో సిగరెట్ మీద కనీసం రూ. 3.50 చొప్పున పెంచాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ కోరుతోంది. అలాగే, బీడీల మీద ఇన్నాళ్ల నుంచి ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేయాలని కూడా ఆరోగ్యశాఖ కోరింది.
రోజుకు 20 లక్షల కంటే తక్కువ బీడీలు ఉత్పత్తి చేసేవారికి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవాలని, వాటి మీద కూడా పన్ను విధానాన్ని సవరించాలని, ఎవరూ పన్ను ఎగవేయకుండా పటిష్ఠంగా చూడాలని ఆరోగ్యశాఖ కోరింది. జూలై 11వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి అన్ని అంశాలపై ఆర్థిక శాఖకు వివిధ ప్రతిపాదనలు వస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జరుగుతాయి.
సిగరెట్ ప్యాకెట్.. మరింత ఖరీదు!!
Published Fri, Jun 20 2014 6:11 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement