: మొబైల్ ఫోన్లు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడేవారికి ఇది చేదువార్తే. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ బడ్జెట్‌లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచారు. మొబైల్ ఫోన్లు, ఎల్‌ఈడీ బల్బుల ధరలకూ రెక్కులు రానున్నాయి. మొబైల్స్‌లో వాడే పాపులేటెడ్ ప్రింటెడ్ సర్‌క్యూట్ బోర్డు (పీసీబీ)లు, ఎల్‌ఈడీ బల్బుల విడి భాగాల దిగుమతిపై సుంకం భారీగా పెంచడం వల్ల ఇవి ప్రియం కానున్నాయి. మరోవైపు జైట్లీ... సహజసిద్ధ ఇంధన వనరుల వినియోగంపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై సర్వీస్ చార్జీలను ఎత్తివేశారు.