ప్రముఖ బెంగాలీ నటుడు, సామాజిక కార్యకర్త బిభాష్ చక్రవర్తి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
కాగా బిభాష్ 'నందికర్' అనే సంఘంలో థియేటర్ ఆర్టిస్టుగా జాయిన్ అయ్యారు. 1960లో ఎన్నో రకాల పాత్రలు పోషించిన ఆయన తర్వాత థియేర్ వర్క్‌షాప్‌ను స్థాపించి రాజ్‌రక్త, చక్‌భంగ మోదు అనే నాటకాలను డైరెక్ట్ చేశారు. అనంతరం పశ్చిమ బంగ నాట్య అకాడమీ మెంబర్‌గానూ సేవలదించారు. అనారోగ్య కారణాల వల్ల 2018లో పశ్చిమ బంగ నాట్య అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
చదవండి: గర్భవతి అయ్యాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే?
బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ధమాకా
Comments
Please login to add a commentAdd a comment