బెంగాలీ నటుడు సైబాల్ భట్టాచార్య సోమవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో సూసైడ్‌కు ప్రయత్నిస్తూ దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 'నాకు మరో దారి కనిపించడం లేదు. నా భార్య, అత్తమ్మ..' అంటూ ఆయన మాట్లాడుతున్న సగంలోనే ఆ వీడియో ఆగిపోయింది. ఇందులో నటుడు చేతిలో పదునైన ఆయుధంతో తన తల, కాళ్లను గాయపర్చుకున్నట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
కాగా సైబాల్‌కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. పైగా ఇటీవలే ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైబాల్‌కు.. ప్రోతోమా కాదంబిని సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. తండ్రిగా, అంకుల్‌గా పలు పాత్రలు పోషించిన ఆయన స్క్రిప్ట్ రైటర్, డైలాగ్స్ రచయితగానూ పని చేశాడు.
ఇకపోతే సెలబ్రిటీల వరుస ఆత్మహత్యలతో బెంగాలీ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. పల్లవి డే, బిడిషా డే మజుందార్, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్న కొద్ది వారాలకే సైబాల్ ఆత్మహత్యకు యత్నించడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment