Mrunal Thakur Reveals She Had Suicidal Thoughts During College Days Deets Inside - Sakshi
Sakshi News home page

Mrunal Thakur : 'చాలా కష్టంగా అనిపించేది.. చచ్చిపోదామనుకున్నా'

Published Fri, Feb 11 2022 4:46 PM | Last Updated on Fri, Feb 11 2022 5:02 PM

Mrunal Thakur Reveals She Had Suicidal Thoughts During College Days - Sakshi

Mrunal Thakur Reveals She Had Suicidal Thoughts: హీరోయిన​ మృణాల్‌ ఠాకూర్‌  ‘సూపర్ 30’సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 17-20 ఏళ్ల మధ్య ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో ఇంటి నుంచి దూరంగా ఉన్నాను.

ముంబైలో ఒంటరిగా జీవించాను. అది అంత సులభమైన విషయం కాదు.  కొన్నిసార్లు అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి.  ఇక నేను చదువకునే రోజుల్లో లోకల్‌ ట్రైన్స్‌లో ప్రయాణం చేసేదాన్ని. అప్పుడు ఎక్కువగా డోర్‌ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ట్రైన్‌లో నుంచి దూకేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జెర్సీ మూవీలో నటిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement